అనువాదలహరి

నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే… ఎమిలీ డికిన్సన్, అమెరికను

నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే

మధ్యలో, మృత్యువు అడ్డు వస్తుంది,

జీవితం మరీ అంత నిడుపైనదేం కాదు

నా శత్రువులందర్నీ మట్టుపెట్టగలగడానికి.

నాకు ప్రేమించడానికీ అంత తీరికలేదు,

కానీ ఏదో పరిశ్రమ చెయ్యాలి కాబట్టి;

చిన్నపాటి ప్రయత్నం చాలు ప్రేమకి

అనుకుంటాను, అదే నాకు అసంఖ్యం.

.

ఎమిలీ డికిన్సన్

డిశంబరు 10, 1830 – మే 15, 1886

అమెరికను కవయిత్రి.

.

http://en.wikipedia.org/wiki/File:Emily_Dickinson_daguerreotype.jpg

.

I had no time to hate, because

.

I had no time to hate, because

The grave would hinder me,

And life was not so ample I

Could finish enmity.

Nor had I time to love, but since

Some industry must be,

The little toil of love, I thought,

Was large enough for me.

.

Emily Dickinson

(December 10, 1830 – May 15, 1886)

American

%d bloggers like this: