See a Lovely Video Of this poem here
అది బాగా దెబ్బతింది, మచ్చలుపడింది,
ఆ వేలంపాటగాడు ఆ తుక్కు వాయులీనం మీద
తన విలువైనకాలం అట్టే వృధాచెయ్యదలుచుకోలేదు
అయినా నవ్వుముఖంతో దాన్ని పైకెత్తి అరిచేడు:
“మహాజనులారా! దీన్ని ఎంతకు కొంటారు,” అని ప్రారంభించేడు
“ఎవరు ముందుగా పాటప్రారంభిస్తారు?
ఒక డాలరా? ఒకటీ. రెండు డాలర్లు? రెండూ!
దీన్ని మూడు డాలర్లిచ్చి ఎవరు తీసుకుంటారు?”
మూడు డాలర్లు … ఒకటోసారి; మూడు డాలర్లు… రెండోసారి;
అయిపోతోంది, మూడుడాలర్లు మూడో…” అనేలోగా
‘ఆగు ‘ అన్న ఒక కేక వినిపించింది.
గది చివర వరసలోంచి జుత్తు నెరిసిన వృద్ధుడు,
ముందుకొచ్చి ఫిడేలుని చేతిలోకి తీసుకున్నాడు
దానిమీద పేరుకున్న దుమ్ము దులిపి,
వదులైన తీగలను బిగించి చూసాడు
దేవదూతలు సంకీర్తనచేస్తున్నారా అనిపించేలా
ఒక చక్కని రసమయమైన గీతాన్ని వాయించేడు.
పాట ఆగింది, వేలంపాటగాడు
ప్రశాంతంగా మంద్రస్వరంలో ఇలా అన్నాడు:
“ఈ వాయులీనానికి ఎంతని ధర చెప్పను?”
అని, ఫిడేలుని, కమానుని పైకి ఎత్తేడు.
“వెయ్యి డాలర్లు. రెండువేలెవరిస్తారు?
రెండు వేలు ! మూడువేలు ఎవరిస్తారు?
మూడువేలు డాలర్లు ఒకటోసారి! రెండో సారి!
అయిపోతోంది…. అయిపోతోంది… మూడవసారి. అయిపోయింది.”
ప్రజలంతా సంతోషంతో చప్పట్లు కొట్టేరు.
ఒకడు మాత్రం అరిచేడు: “మాకేం అర్థం కాలేదు,
దీని విలువ అమాంతం ఎలా పెరిగిపోయిందో?”
వెంటనే వచ్చింది జవాబు: “నిపుణహస్తస్పర్శ.”
చాలామంది వ్యక్తులు, పాపాలతో, పొరపాట్లతో గాయపడి
శృతి తప్పిన తమ జీవితాలని
ఈ పాత వాయులీనాన్ని అమ్మజూపినట్టు
బుద్ధితక్కువ జనాలకి ఎంతకో అంతకి అమ్మెస్తారు.
క్షణికమైన అవసరానికో, ఒక గ్లాసు సారాయికో
ఒక ఆటలోకలిగే ఆనందానికో… ఆ దిగజారుడు అనంతం…
అతను “ఒకటో సారి” పోబోతాడు, “రెండో సారి” పోబోతాడు
“మూడో సారి” అనడమే ఆలస్యం, అమ్మకం పూర్తయేదే.
ఇంతలో ఒక నిపుణుడు తెరమీదకి వస్తాడు.
మూర్ఖపు జనులకి ఎంతమాత్రం అర్థం కాదు:
ఒక ఆత్మ విలువా, ఒక నిపుణహస్తస్పర్శ
ఆ జీవితంలో తీసుకురాగలిగిన ప్రభావమూ.
.
(1877- 1959)
అమెరికను
This is one of the most inspiring poems I came across in recent times. I feel really foolish that I did not read it till today.
.
The Touch Of The Master’s Hand
.
‘Twas battered and scarred, and the auctioneer
Thought it scarcely worth his while
To waste much time on the old violin,
But held it up with a smile.
“What am I bidden, good folks,” he cried,
“Who’ll start the bidding for me?”
“A dollar, a dollar. Then two! Only two?
Two dollars, and who’ll make it three?”
“Three dollars, once; three dollars, twice;
Going for three…” But no,
From the room, far back, a grey-haired man
Came forward and picked up the bow;
Then wiping the dust from the old violin,
And tightening the loosened strings,
He played a melody pure and sweet,
As a caroling angel sings.
The music ceased, and the auctioneer,
With a voice that was quiet and low,
Said: “What am I bid for the old violin?”
And he held it up with the bow.
“A thousand dollars, and who’ll make it two?
Two thousand! And who’ll make it three?
Three thousand, once; three thousand, twice,
And going and gone,” said he.
The people cheered, but some of them cried,
“We do not quite understand.
What changed its worth?” Swift came the reply:
“The touch of the Master’s hand.”
And many a man with life out of tune,
And battered and scarred with sin,
Is auctioned cheap to the thoughtless crowd
Much like the old violin.
A game — and he travels on.
He is “going” once, and “going” twice,
He’s “going” and almost “gone.”
But the Master comes, and the foolish crowd
Never can quite understand
The worth of a soul and the change that is wrought
By the touch of the Master’s hand.
.
(1877 – 1959)
American
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి