అనువాదలహరి

పొగ మంచు … సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి

(పొగ మంచు ప్రవాహంలో మునిగిన అమెరికను వాసులకి)


ఆకసం మీద దండెత్తే మహానగాలు విశాలమైన

పొగమంచుతెరల ప్రవాహంలో మునిగిపోయాయి

నా గుమ్మం ముందర అల్లుకున్న ఫ్లాక్స్ తీవె

గరుడపచ్చ బిందువులు దండలా రాలుస్తోంది

.

పదే పదడుగుల దూరంలో ధృఢమైన నేల

కరుగుతున్న మేఘంగా మారిపోతోంది

వేదన, ఉల్లాసముల మేళవింపులో నిశ్శబ్దం ఎల్లెడా పరుచుకుంది

ఒక్క పిట్టకి కూడా గట్టిగా కూయడానికి మనసొప్పడం లేదు.

.

భూమీ, ఆకాసమూ, సముద్రమూ

పోల్చుకోలేని ఈ ప్రపంచంలో

ఏ మార్పూ చెందకుండా మిగిలినదాన్ని నే నొకతెనే

నన్ను ఊరడించడానికి మిగిలినదాన్ని కూడా నేనే.

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

.

White Fog

.

Heaven-invading hills are drowned

in wide moving waves of mist

Phlox before my door are wound

in dripping wreaths of amethyst.

.

Ten feet away the solid earth

Changes into melting cloud

There is a hush of pain and mirth

No bird has heart to speak aloud.

.

Here in a world without a sky

Without the ground, without the sea

The one unchanging thing is I,

Myself remains to comfort me.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Lyrical Poet

%d bloggers like this: