అనువాదలహరి

Anand 2 … Dr. Pulipati Guruswamy, Telugu, Indian

 ‘Daddy! Don’t you sing me a song?’

Hailed Anand from the entrance

even before he walked into the room.

I was just wondering what the matter was for his unusual request.

He must have guessed it from my silence.

He said, ‘all my classmates are singing for an event.

It’s is only me who knew no songs.

Will you teach me one, daddy?’

‘I am sorry, Anand, neither do I.

I can read you a poem if you like.’

‘Then sing me a poem.’

“A son  unkind to his parents

counts for little whether he is dead or alive

won’t termites in an ant hill exist and go extinct?

……………………………………..”

I did not complete.

“Thuuuuu” he said bitterly putting up a sour face.

“What song is this daddy?”

He did not hide his contempt.

“What can I do? I know only this.”

I answered apologetically.

 “Pch!…” he held his head

in the crescent of his thumb and index finger.

After a while,

“At least, do you know how to dance?”

 “No,” I said.

(One can guess the consequences if I had said yes.)

Moving his head rather uneasily, he asked rather coolly,

“Then what do you know daddy?”

There was a hint of despair and hopelessness in the voice.

My worst fears came true. I was in pits.

He asked finally, ‘Do you know swimming?”

“God!’ … My heart creaked. Soul rattled within.

My daughter began laughing at the other end of the room.

He closely watched the changing colours in my face.

 “Go! Get lost in your poetry .”

And left.

.

Dr. Pulipati Guruswamy

Telugu

Indian.

.

Image Courtesy: Dr. Pulipati Guruswamy
Image Courtesy: Dr. Pulipati Guruswamy

.

డాడీ ఏదైనా పాట పాడవా అనుకుంట వచ్చిండు మా ఆనందుడు.

వస్తూనే ఇట్లా అడిగిండు… ఏంటో కథ అనుకుంటున్నా …

ఏం లేదులే …మా క్లాసుల పిల్లలంతా పాటలు పాడుతున్నరు …నాకే ఏం రావు.

అందుకే నేర్పుతవా…

పాటలు నాకు రావురా …పద్యాలు నేర్పుతా నేర్చుకో అన్నాను.

ఒక్కటి పాడు వింటా అంటే...

”తల్లి దండ్రి మీద దయలేని పుత్రుడు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా

విశ్వదాభిరామ వనుర వేమ”

”థు”అనడం తోటే గలీజుగ చూసిండు.

ఇదేం పాట డాడీ…అన్నడు

నాకు గివె వచ్చు రా అన్నాను.

ప్చ్…అని తల పట్టుకున్నడు

పోనీ డాన్స్ వచ్చా …అన్నడు.

రాదు అన్న…

వచ్చు అంటే ఉండే ప్రాబ్లం తెలుసు కద.

అసలు నీకేం వచ్చు డాడీ …నిదానంగ ప్రశ్న ఓ రకంగ పలికిండు

ఇరికిచ్చాడు అనుకుంటనే ఉన్న

మళ్లీ తనే …..ఈత వచ్చా అన్నడు.

చచ్చాం.

జీవుడు గిల గిల కొట్టుకుంటున్నడు

మల్లక్క అవతల నవ్వుడు షురూ చేసింది

నా మొఖం ల రంగులు సూసిండు మావాడు…..

పో…కవిత్వం రాసుకో …

అనుకుంట పోయిండు.

***

డా. పులిపాటి గురుస్వామి 

తెలుగు

%d bloggers like this: