అనువాదలహరి

కీర్తన… సారా ఫ్లవర్ ఏడమ్స్, ఇంగ్లీషు కవయిత్రి

ఎండనీ అతనే పంపుతాడు, చినుకునీ అతనే పంపుతాడు

రెండూ పువ్వు విరబూయడానికి ఒక్కలాగే కావాలి.

అలాగే కష్టాలూ సుఖాలూ ఒక్కలాగే పంపుతాడు

ఈ ఆత్మకి తగిన పోషణనివ్వడానికి.

తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి చుట్టుముట్టినా

నాది కాదు, ఎప్పుడూ నీ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది.

విసుక్కున్నా, తాము ప్రేమించి, విశ్వసించే

తల్లిదండ్రుల్ని పిల్లలు నిందించగలరా?

ఓ సృష్టి కర్తా! నేను నీకు ఎల్లప్పుడూ

విశ్వాసముగల, ప్రియమైన బిడ్డగా ఉంటాను:

తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి చుట్టుముట్టినా

నాది కాదు, ఎప్పుడూ నీ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది.

ఈ జీవితం పట్ల ఎన్నడూ అసంతృప్తి ప్రకటించను

నాకు నువ్వీజీవితాన్ని ప్రసాదించేవు. అదే చాలు!

ఈ నీడ మృత్యుస్పర్శతో చల్లబడి రాలిపోయినా

చివరి ఊపిరిలో కూడా నిను కీర్తిస్తూనే ఉంటాను.

తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి చుట్టుముట్టినా

నాది కాదు, ఎప్పుడూ నీ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది.

.

సారా ఫ్లవర్ ఏడమ్స్

22 ఫిబ్రవరి 1805 – 14 ఆగష్టు 1848

ఆంగ్ల కవయిత్రి .

.

Hymn

 

.

 

He sendeth sun, he sendeth shower,

         

Alike they ’re needful for the flower:

         

And joys and tears alike are sent

         

To give the soul fit nourishment.

         

As comes to me or cloud or sun,

                 

Father! thy will, not mine, be done! 

 

 

Can loving children e’er reprove

         

With murmurs whom they trust and love?

         

Creator! I would ever be         

 

A trusting, loving child to thee:

                 

As comes to me or cloud or sun,

         

Father! thy will, not mine, be done! 

 

 

Oh, ne’er will I at life repine:

         

Enough that thou hast made it mine.

         

When falls the shadow cold of death

                 

I yet will sing, with parting breath,

         

As comes to me or shade or sun,

         

Father! thy will, not mine, be done!

 

.

Sarah Flower Adams

 

22 February 1805 – 14 August 1848

 

English Poetess

 

Poem Courtesy: http://www.bartleby.com/246/257.html

 

A Victorian Anthology, 1837–1895,

Ed. Edmund Clarence Stedman (1833-1908)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: