రోజు: జనవరి 4, 2014
-
ఎంత కష్టపడ్డాను నా కన్నీళ్ళు దాచుకుందికి!… ఏన్ లీ వ్హార్టన్, ఇంగ్లీషు కవయిత్రి
నా కన్నీళ్ళు దాచుకుందికి ఎంత కష్టపడ్డాను! ఎన్ని సార్లు మొరపెట్టుకున్నాను! నా భయాలూ, దుర్భరమైన రోజులూ బోధించాయి: నేను నిష్ఫలంగా ప్రేమించానని. ఇప్పుడు నా ఆనందాలు చిన్నగానైనా మొలకెత్తుతున్నాయి అవి దాచుకోవడం అంత సులభం కాదు; విషాదం ఎవరికీ తెలియకుండా మూలగొచ్చేమో కాని, అనందం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. నా ఆనందాన్ని అరుస్తున్న గొర్రెలమందకి చెబుతాను ప్రతి సెలయేరుకీ, ప్రతి చెట్టుకీ చెబుతాను నా ఆనందాన్ని నాకు తొరిగి ప్రతిధ్వనిస్తున్నందుకు ఈ లోయలోని ప్రతి కొండకీ […]