అనువాదలహరి

అందరూ పాడిన పాట… … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

అందరూ ఒక్కసారి పాడటం ప్రారంభించేరు

నాకు ఎంతగా ఆనందంతో పులకరింత కలిగిందంటే

పంజరంలో బంధించిన పక్షి స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ

తెల్లని పళ్ళతోటల్లోంచీ, పచ్చని మైదానాలమీంచీ

అలా అలా ఎగురుకుంటూ … కనుచూపు దాటిపోయినంత…

అందరి గొంతూ ఒక్కసారి తారస్థాయి చేరుకుంది;

సూర్యాస్తమయమంత శోభాయమానంగా ఉంది;

నా గుండె కన్నీళ్ళతో నిండిపోయింది; భయం

నెమ్మదిగా తొలగిపోయింది… ఓహ్, ప్రతివ్యక్తీ ఒక పిట్ట;

పాటకి పదాలు లేవు… పాట మాత్రం ఎప్పటికీ ఆగదు…

.

సీగ్ ఫ్రై ససూన్

.

సీగ్ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవీ, సైనికుడూ

‘సీఫ్రెడ్ ససూన్’ మొదటి ప్రపంచ సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడు.  యుద్ధరంగంలోని భీభత్సరసాన్ని స్వయంగా అనుభవించిన వాడు.


మృత్యువుతో భుజం భుజం రాసుకుంటున్నప్పుడు ఒక ప్రక్క భీతావహంగా అనిపించినా వేరొక పక్క మొండిదైర్యంకూడా వస్తుంది. వేదనలోంచే తాత్త్విక చింతనా, అందులోంచే ఒక అనిర్వచనీయమైన ఆనందమూ వస్తాయి. అప్పుడే గొంతులోంచి ఒక రాగం వస్తుంది. పంజరంలోంచి చిలక బయటికి ఎగిరిపోవడం అదే. బహుశా ప్రాణం మీద అంతవరకూ ఉన్న తీపి ఒక్క సారి పోతుందేమో.  పదిమందితో చావు పెళ్ళితో సమానం అని మనకో నానుడి ఉంది. ఇలాంటి సందర్భాన్ని బట్టే వచ్చిందేమో.  అలా వచ్చిన పాటకి పదం లేకపోయినా రాగం మాత్రం మనసులో మారుమోగుతూనే ఉంటుంది.

.

Everyone Sang

 .

 Everyone suddenly burst out singing;

 And I was filled with such delight

 As prisoned birds must find in freedom,

 Winging wildly across the white

 Orchards and dark-green fields; on – on – and out of sight.

 

 Everyone’s voice was suddenly lifted;

 And beauty came like the setting sun:

 My heart was shaken with tears; and horror

 Drifted away … O, but Everyone

 Was a bird; and the song was wordless; the singing will never be done.

 

Siegfried Sassoon

8 September 1886 – 1 September 1967

English Poet and Soldier

Poem Courtesy:  http://wonderingminstrels.blogspot.in/2002/04/everyone-sang-siegfried-sassoon.html

%d bloggers like this: