దురహంకారం … జాన్ వెబ్స్టర్, ఇంగ్లీషు కవి
వసంత ఋతువులోని పూలన్నీ
మన సమాధులని గుబాళింపజెయ్యడానికి సరిపోతాయి;
పాపం అవన్నీ మంచి వయసులో ఉన్నాయి,
మనిషి చూడబోతే అలంకరించుకునేది కాసేపే:
పుట్టినప్పటినుండి మన ప్రగతి ఒక సారి గమనించండి
మనం పుడతాం, పెరుగుతాం, తిరిగి మట్టిలో కలుస్తాం.
టాటాలు చెప్పుకుంటాం, అన్ని సుఖాలకీ,
అన్ని బలహీనతలకీ వశమౌతాము !
తియ్యని మాటైనా, నిశితమైన చూపైనా, పరిమళాల్లా,
నాలుగుదిక్కులా వ్యాపించి నశించవలసిందే.
సూర్యుడికోసం నిరీక్షించే నీడలా,
అందుకనే, ఈ తంతు అంతా జరుగుతుంటుంది.
రారాజుల నిష్ఫలమైన కోరిక, అంతే!
విజయచిహ్నాలద్వారా, నశ్వరమైన వస్తువులద్వారా
తమ పేరు శాశ్వతంగా వదిలిపోదామని
గాలిని పట్టుకోడానికి వలలు అల్లుతుంటారు.
.
జాన్ వెబ్స్టర్,
ఇంగ్లీషు కవి
1580-1634
.
.
Vanitas Vanitatum (Vanity)
.
All the flowers of the spring
Meet to perfume our burying;
These have but their growing prime,
And man does flourish but his time:
Survey our progress from our birth;
We are set, we grow, we turn to earth.
Courts adieu, and all delights,
All bewitching appetites!
Sweetest breath and clearest eye,
Like perfumes, go out and die;
And consequently this is done
As shadows wait upon the sun.
Vain ambition of kings
Who seek by trophies and dead things
To leave a living name behind,
And weave but nets to catch the wind.
.
John Webster
c.1580 – c.1634
English Dramatist
దైవానికి ప్రేమగీతాలు… రిల్కే, ఆస్ట్రియన్ కవి
నువ్వే భవిష్యత్తువి,
ప్రభాత సంధ్యల విశాల కాలమైదానాల విరిసే
అరుణారుణ గగనానివి నువ్వు.
నిశాంతాన్ని సూచిస్తూ కూసే తొలికోడి కూతవి,
తుహిన బిందువువీ, ప్రాభాత భేరీవీ,
కన్నియవీ, అపరిచితుడివీ, తల్లివీ, మృత్యువువ్వీ నువ్వే.
మేము కనీ వినీ ఎరుగని కారడవిలా…
మేము కీర్తించక, శోకించక, వర్ణించక గడిపే
మా దైనందిన జీవితాలలోంచి ప్రభవించే అనేకానేక
రూపాలుగా నిన్ను నువ్వు సృజించుకుంటావు
వస్తువులలోని అంతరాంతర ప్రకృతివి నువ్వు,
ఎన్నడూ నిర్థారించి చెప్పలేని తుది పలుకువి నువ్వు.
మాకొక్కరికీ ఒక్కొక్కలా నువ్వు గోచరమౌతావు
నావకి తీరంలానూ, తీరానికి నావలానూ.
.
రైనర్ మారియా రిల్కే,
4 December 1875 – 29 December 1926
బొహీమియన్- ఆస్ట్రియన్ కవి
ఈ కవితలో అత్యంత సుందరమైన ఉపమానం నామట్టుకి చివరి వాక్యమే.
.
Rainer Maria Rilke
.
The Book of Pilgrimage, II, 22
.
You are the future,
the red sky before sunrise
over the fields of time.
You are the cock’s crow when night is done,
You are the dew and the bells of matins,
maiden, stranger, mother, death.
You create yourself in ever-changing shapes
that rise from the stuff of our days —
unsung, unmourned, undescribed,
like a forest we never knew.
You are the deep innerness of all things,
the last word that can never be spoken.
To each of us you reveal yourself differently:
to the ship as coastline, to the shore as a ship.
.
(Sub Title: Book of Hours : Love poems to God
Translated from the German by Anita Barrows.)
.
Rainer Maria Rilke
4 December 1875 – 29 December 1926
Bohemian-Austrian Poet and Novelist
(Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2001/09/book-of-pilgrimage-ii-22-rainer-maria.html)
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
(సారా టీజ్డేల్ వర్ధంతి సందర్భంగా)
.
నాలోని యోగీ, భోగీ
రాత్రనక పగలనక కొట్టుకుంటూ ఉంటారు;
సమౌజ్జీలేమో, అలుపులేక, శక్తి సన్నగిల్లుతున్నా
ఒకర్ని ఇంకొకరు తిట్టుకుంటూ,
నా చల్లారిన రక్తం చెమటపడుతుంది, వాళ్ళు అలా
సూర్యోదయం నుండి అస్తమయందాకా కొట్టుకుంటుంటే.
మళ్ళీ రాత్రయినదగ్గరనుండీ యుద్ధం కొనసాగుతుంది
వేకువవేళకి నేను వణుకుతూ వాళ్ళ పోరాటం వింటుంటాను;
ఈ సారి మాత్రం వాళ్ళు చావో రేవో తేల్చుకునేలా పోరాడుతుంటారు,
అయితే, ఎవరు చస్తే నాకేం అని నేను పట్టించుకోను.
ఎందుకంటే, ఎవరు మృత్యువాతపడినప్పటికీ
చివరకి ఓడిపోయేది మాత్రం నేనే.
.
సారా టీజ్డేల్
ఆగష్టు 8, 1884 – జనవరి 29, 1933
అమెరికను.
.
Sara Teasdale
.
Conflict
.
The Spartan and the Sybarite
Battle in me day and night;
Evenly matched, relentless, wary,
Each one cursing his adversary,
With my slow blood dripping wet,
They fight from sunrise to sunset.
And from sunset the fight goes on,
I shiver and hear them in the dawn;
They fight to the death this time, but I
Care little which will have to die,
Whichever it is, when the end has come,
I shall be the defeated one.
.
Sara Teasdale
August 8, 1884 – January 29, 1933
American
విలంబనము… ఎలిజబెత్ జెన్నింగ్స్, బ్రిటిషు కవయిత్రి
ఈ క్షణం నా మీద ప్రసరిస్తున్న నక్షత్ర కాంతి
ఎన్నో ఏళ్ళక్రిందట మెరిసినది. ఇప్పుడు అక్కడ
మిలమిలలాడుతున్న కాంతిని నా కనులు బహుశా చూడలేకపోవచ్చు,
ఈ కాల విలంబనము ఎలాగా అని నన్ను ఊరిస్తూంటుంది.
ఇపుడు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ నాదగ్గరకు చేరకపోవచ్చు
దాని తొలి లాలసలు తీరేదాకా. కళ్ళు చూచి అందంగా
ఉందని గుర్తించేదాకా, ఆ తారకావేశం నిరీక్షించాల్సిందే
మనల్ని చేరుకున్న ప్రేమ, మనం ఇంకెక్కడో ఉండగా చేరొచ్చు.
.
ఎలిజబెత్ జెన్నింగ్స్
బ్రిటిషు కవయిత్రి.
బ్రిటన్ లో అండర్ గ్రౌండ్ రైలు మార్గంలో ప్రజలకు కవిత్వం చేరువగా తీసుకునివెళ్ళాలన్న తలంపుతో కొందరు యువకవులు చేసిన ప్రయత్నంలో భాగంగా గత శతాబ్దంలో ఎందరో కవులూ, ఎన్నో చక్కని కవితలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రజలనాల్కలమీద నిలబడ్డదే కవిత. అలాంటి బహుళజనాదరణ పొందిన కవితల్లో ఇదొకటి.
మననుండి నక్షత్రాలు కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటాయన్న ఒక భౌతిక సత్యాన్ని ప్రేమకు అనువర్తించి, ఆ దూరాన్ని కాలప్రమాణంతో పోల్చినపుడు మన ఆయుఃప్రమాణం దానికంటే తక్కువగనక, మనల్ని నిజంగా చేరుకునే (చుక్కల వెలుగులాంటి ) ప్రేమ ఒక్కోసారి మనం బ్రతికుండగా చేరదుసుమా అని హెచ్చరిస్తూ వ్రాసిన అందమైన కవిత.
.
Delay
.
The radiance of the star that leans on me
Was shining years ago. The light that now
Glitters up there my eyes may never see,
And so the time lag teases me with how
Love that loves now may not reach me until
Its first desire is spent. The star’s impulse
Must wait for eyes to claim it beautiful
And love arrived may find us somewhere else.
.
Elizabeth Jennings
British Poetess
Revision 2… Nanda Kishore, Telugu, Indian
Some acquaintances are such!
Furnishing wings
you did not fancy in your wildest dreams
they bid you up suddenly
pitting against gushing winds.
.
If you could somehow manage
to drop down safely, fine!
You can still breathe life
even if your body is battered.
.
But if you continue your assay
for fun or in frolic
that’s it!
Your ordeals and your odyssey
commence instantly.
.
The sky continues to elude eternally,
nor life runs smoothly on the land;
one has to fear for the rain and wind,
and hie scared of an eagle or a snake.
.
One has to answer
the tree… if you build a nest,
the hill … if you drink of a rill,
the field… if you glean few grains,
and the wind.. if you molt.
.
Even you plead innocence,
say you know nothing but flying,
or pray flying is imperative for your living,
you have to apologize.
.
Speaking the language of the flowers,
crooning in the voice of dove
or talking in childy morpheme
is not what you need to learn,
but to pretend as any human being does.
.
Crying wild and flying off to unknown shores
with a freedom of no consequence,
you have to answer
the tree, the field, the rill, and the wind.
.
And, answer you must!
.
Nanda Kishore
Telugu
Indian
.

Nanda Kishore is a young engineer (EEE) from Warrangal. He is very prolific on Facebook and particularly active “Kavisangamam” group.
Last year he released his maiden volume of poetry “Neelage okadundevaadu” (There was one like you).
Nanda Kishore has fine sensibilities and has come out with a distinct voice of his own.
.
పునర్విమర్శ 2
.
కొన్ని పరిచయాలంతే.
ఊహలోకూడా తెలియని రెక్కల్ని కట్టి
రివ్వున వీచేగాలిలో
ఒక్కసారిగా ఎగరేస్తాయ్.
తేరుకుని క్రిందపడ్డావో
సరేసరి!
దేహం విరిగినా ప్రాణం మిగిలించుకోవచ్చు.
సరదాగానో, సంతోషంగానో,
కదలడం మొదలెట్టావో—
ఇక అంతే!
నీ ప్రయాణం, ప్రయాస
రెండూ మొదలవుతాయి.
ఆకాశం ఎప్పటికీ అందదు.
నేలమీదే జీవితం సాగదు.
గాలొచ్చినా, వానొచ్చినా భయపడాలి.
గద్దొచ్చినా, పామొచ్చినా దాక్కోవాలి.
కొమ్మపైన గూడుకడితే చెట్టుకీ
ఏటిలో నీళ్ళుతాగితే కొండకీ
గింజల్ని ఏరుకుంటే చేనుకీ
ఈకలు రాల్చుకుంటే గాలికీ
సమాధానం చెప్పి తీరాలి.
ఎగరడం తప్ప ఏమీ తెలీదన్నా
ఎగరడం నీ తప్పని అవసరమైనా
ఎగరకపోతే బతుకేలేదని తెలిసినా
సమాధానం చెప్పి తీరాలి.
పూవులభాషలో మాట్లాడడం
గువ్వలభాషలో పాడడం
పిల్లల భాషలో పదాలల్లడం కాదు
మనుషులభాషలో నటించడం నేర్చుకోవాలి.
ఎందుకూ పనికిరాని స్వేచ్ఛతో
ఎటో ఓ దిక్కుకి ఏడ్చుకుంటూ ఎగిరిపోతూ
చెట్టుకి, చేనుకి, ఏటికి, గాలికి
వీలైనా కాకున్నా వేగులకి, వేటగాళ్ళకి
సమాధానం చెప్పి తీరాలి.
సమాధానం చెప్పే తీరాలి.
.
నందకిషోర్
(“నీలాగే ఒకడుండేవాడు!” సంకలనం నుండి.)
అర్థరాత్రి నిద్రలో… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను
1
అర్థ రాత్రి నిద్రలో, వ్యధాభరితమైన అనేక ముఖాలు,
చూడటానికి ప్రాణాంతకంగా గాయపడ్డ చూపులు —
వర్ణించనలవిగాని ఆ చూపులు;
వెల్లకిలాపడిన నిహతులు, చేతులు బార్లా జాపుకుని,
కలగంటి, కలగంటి, కలగంటి.
2
ప్రకృతి దృశ్యాలు, పంటచేలు, మహానగాలు,
తుఫానువెలిసిన తర్వాతి అందమైన ఆకాశాలు…
రాత్రిపూట అద్భుతంగా ప్రకాశిస్తూ చందమామ
తళతళా మెరుస్తూ, క్రింద మేము కందకాలు తవ్వుతూ
మట్టి పోకలుపోస్తున్న చోట కాంతి ప్రసరిస్తూ,
కలగంటి కలగంటి కలగంటి
3
అవన్నీ గతించిపోయి ఎన్నేళ్ళో అయింది
— ఆ ముఖాలూ, ఆ కందకాలూ, ఆ పంటచేలూ…;
అక్కడి మారణహోమం నుండి,
నిర్లక్ష్యంతో కూడిన స్థైర్యంతో,
రాలిపోయిన వారికి దూరంగా,
ముందుకి కాలంతో పాటు పరిగెత్తేను.
కానీ ఇప్పుడు ఆ ఆకారాలన్నీ రాత్రిపూట
కలగంటున్నా, కలగంటున్నా, కలగంటున్నా.
.
(From Leaves Of Grass)
.
వాల్ట్ వ్హిట్మన్
31 మే, 1819 – మార్చి 26, 1892
అమెరికను కవి
ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత ఒక వృద్ధసైనికుడి జ్ఞాపకాలగురించి అయినప్పటికీ, ఈ పరివేదన అందరికీ చెందుతుంది. జీవితం ఒక గొప్ప పోరాటం అనుకుంటే, మనకంటే ముందు గతించిపోయిన వారందరూ యుద్ధంలో నిహతులక్రిందే లెక్క. మనం వాళ్ళందరి నుండి కాలంతో పాటు పరిగెత్తుకుని వచ్చాం. ఆ ముఖాలు అప్పటంత ప్రస్ఫుటంగా ఉండకపోవచ్చు. మసకబారినా ఆముఖాలే మనకళ్ళకి నిద్రలో కనిపిస్తాయి.
.
.
In Midnight Sleep
1
In midnight sleep, of many a face of anguish,
Of the look at first of the mortally wounded—
of that indescribable look;
Of the dead on their backs,
with arms extended wide,
I dream, I dream, I dream.
2
Of scenes of nature, fields and mountains;
Of skies, so beauteous after a storm—
and at night the moon so unearthly bright,
Shining sweetly, shining down,
where we dig the trenches and gather the heaps,
I dream, I dream, I dream.
3
Long, long have they pass’d
— faces and trenches and fields;
Where through the carnage
I moved with a callous composure
— or away from the fallen,
Onward I sped at the time
— But now of their forms at night,
I dream, I dream, I dream.
.
(From Leaves Of Grass)
.
Walt Whitman
(May 31, 1819 – March 26, 1892)
American
తమార్ కి ఊరడింఫు … స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి
(ఒక పురాతన భాండాన్ని పగులగొట్టిన సందర్భంగా)
.
తమార్! నేనేమీ పురాతత్వవేత్తని కానని నీకు తెలుసు,
నాకు ఆ మట్టయినా, ఈ మట్టయినా ఒకలాగే ఉంటాయి.
అయినప్పటికీ, ఇన్ని వందల ఏళ్ళు భూకంపాలూ, వరదలూ,
యుద్ధాలూ, వాతావరణం తట్టుకోగలిగిందంటే మాటలుకాదు
చివరకి నీ చేతిలో పగిలిపోయింది.
గురుత్వాకర్షణ వల్లో, లేక అలా రాసిపెట్టి ఉందో—
అలా యుగాలతరబడి ఎక్కడో సొరుగుల్లో, దూర దేశాల్లో
ఎలా పగలకుండా ఉండగలిగిందా అని ఆశ్చర్యపోతున్నాను
నీ చేతివేళ్ళ మృదుస్పర్శలో ఎక్కడో
ఉడుకు రక్తపు దుడుకుతనం కనిపించి, మరిచిపోయింది
తను గులాబీ మొగ్గను కాదని, కేవలం కుండనేనని;
నీకు తనని విశదపరచబోయి, పగిలిపోయింది.
.
ఏ. ఇ. స్టాలింగ్స్
1968
అమెరికను కవయిత్రి.
.
AE Stallings
.
Consolation for Tamar
(on the occasion of her breaking an ancient pot)
.
You know I am no archeologist, Tamar,
And that to me it is all one dust or another.
Still, it must mean something to survive the weather
Of the Ages-earthquake, flood, and war –
Only to shatter in your very hands.
Perhaps it was gravity, or maybe fated –
Although I wonder if it had not waited
Those years in drawers, aeons in distant lands,
And in your fingers’ music, just a little
Was emboldened by your blood, and so forgot
That it was not a rosebud, but a pot,
And, trying to unfold for you, was brittle.
.
Alicia Elisbeth Stallings
1968
American settled in Greece.
ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన … ఎడ్మండ్ స్పెన్సర్ , ఇంగ్లీషు కవి
ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన,
కాని అలలు వచ్చి దాన్ని ఊడ్చుకుపోయాయి,
మళ్ళీ మరో సారి చేత్తో రాసేను
మళ్ళీ కెరటం వచ్చి నా శ్రమని హరించింది.
“ప్రయోజనం లేదు, ప్రియా” అంది ఆమె, “నువ్వు అనవసరంగా
శ్రమపడుతున్నావు, నశ్వరమైన దాన్ని శాశ్వతం చెయ్యడానికి
నా మట్టుకు నాకు ఇలాగే నశించిపోవడం ఇష్టం.
దానితో పాటే, నా పేరూ అలాగే చెరిగిపోవాలి.
“వీల్లేదు,” అన్నాను నేను, “విలువలేనివి
మట్టిలో కలిసేమార్గాలు ఎన్నుకోనీ, నీ కీర్తి శాశ్వతం.
నా కవిత నీ గుణాలని అజరామరం చేస్తుంది,
నీ పేరు స్వర్గంలో గొప్పగా ఉల్లేఖించబడుతుంది.
మృత్యువు ఏదోనాడు ప్రపంచాన్ని లోబరచుకుంటుంది
కాని మన ప్రేమ నిలుస్తుంది, మరుజన్మలో మరింతకొత్తగా.”
.
ఎడ్మండ్ స్పెన్సర్
1552- 13 జనవరి, 1599
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Edmund_Spenser_oil_painting.JPG
.
One Day I Wrote Her Name Upon the Strand
(Amoretti LXXV)
.
One day I wrote her name upon the strand,
But came the waves and washed it away;
Again I wrote it with a second hand,
But came the tide and made my pains his prey.
“Vain man,” said she “thou dost in vain assay
A mortal thing so to immortalize,
For I myself shall like to this decay,
And eke my name be wiped out likewise.”
“Not so,” quoth I “let baser things devise
To die in dust, but you shall live by fame:
My verse your virtues rare shall eternize,
And in the heavens write your glorious name;
Where, whenas death shall all the world subdue,
Our love shall live, and later life renew.” .
.
Edmund Spenser
English Poet of Elizabethan Era
ఎదురు జవాబు… సారా టీజ్డేల్, అమెరికను
నేను మట్టిలో తిరిగి కలిసిపోయేక
సంతోషంతో అతిశయించిన ఈ శరీరం
ఒకప్పుడు తను విర్రవీగిన
ఎర్ర, తెల్లకణాలను వదుల్చుకున్నాక…
నా మీద నుండి పురుషులు నడిచిపోతూ
తెచ్చిపెట్టుకున్న లేశమాత్రపు జాలితో మాటాడితే
నా మట్టి తిరిగి గొంతు తెచ్చుకుని
వాళ్ళకి గట్టిగా ఇలా ఎదురుచెబుతుంది:
“చాలు, ఆపండి! నేను సంతృప్తిగా ఉన్నాను.
మీ జాలి నాకక్కరలేదు! వెనక్కి తీసుకొండి.
సంతోషమన్నది నాలో ఒక జ్వాల
ఎంత నిలకడ అంటే అంత సులువుగా ఆరదు;
సులువుగా ఒదిగే రెల్లు అంత చురుకైనది
తనను అల్లల్లాడించే సుడిగాలిని సైతం ప్రేమించగలదు…
మీరు ఉత్సాహంతో ఉన్నప్పుడు పొందిన ఆనందంకంటే
ఎక్కువ ఆనందాన్ని నేను దుఃఖంలో పొందగలిగాను.”
.
సారా టీజ్డేల్
ఆగస్ట్ 8, 1884 – జనవరి 29, 1933
అమెరికను
.

.
The Answer
.
When I go back to earth
And all my joyous body
Puts off the red and white
That once had been so proud,
If men should pass above
With false and feeble pity,
My dust will find a voice
To answer them aloud:
“Be still, I am content,
Take back your poor compassion!—
Joy was a flame in me
Too steady to destroy.
Lithe as a bending reed
Loving the storm that sways her—
I found more joy in sorrow
Than you could find in joy.”
.
Sara Teasdale
American
Poem courtesy: The New Poetry: An Anthology. 1917.
Ed. Harriet Monroe, (1860–1936).
http://www.bartleby.com/265/369.html
పీసా గీతం LXXXI … ఎజ్రా పౌండ్ , అమెరికను
నువ్వు ప్రేమించిందే శాశ్వతం, మిగతాదంతా పనికిమాలినదే
నువ్వు ప్రేమించించింది నీనుండి వేరుచెయ్యబడలేదు
నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం,
ఈ సృష్టి ఎవరిది, నాదా, నీదా, లేక ఎవరికీ చెందదా?
ముందుగా గ్రహించేది దృశ్యమానం, తర్వాతే స్థూలప్రపంచం
స్వర్గం… అది నరకలోకలోకపు చావడులలో ఉన్నా
నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం
నువ్వు ప్రేమించేది నీ నుండి లాక్కోబడలేదు.
.
ఎజ్రా పౌండ్
30 October 1885 – 1 November 1972
అమెరికను
.
