అనువాదలహరి

సమవర్తి మృత్యువు… జేమ్స్ షెర్లీ. ఇంగ్లీషు కవి

గొప్పింటి పుట్టుకలగురించీ, అధికార దర్పాలగురించీ

చెప్పుకునే వన్నీ కేవలం మిధ్య, వాస్తవాలు కావు;

విధిని ఎదిరించి నిలవగల కవచం ఏదీ లేదు;

మహరాజులైనా మృత్యువు తన శీతహస్తంతో స్పృశిస్తుంది,

కిరీటాలూ, రాజ చిహ్నాలూ

దొర్లి పడవలసిందే

పాడుబడ్డ బొరిగ తోనూ, పార తోనూ

సమానంగా మట్టిపాలుకావలసిందే.

కత్తులతో కొందరు యుద్ధరంగంలో జయించొచ్చు

మృతుల హారాలని ధరించి సరికొత్త చరిత్ర లిఖించుకోవచ్చు

కానీ, చివరకి ఏదోనాటికి వాళ్ళ సత్త్వము ఉడుగక తప్పదు

విధితో పోరాడుతూ జయాపజయాలు చేతులు మారొచ్చు

కానీ, ముందో వెనకో

విధికి తలవంచక తప్పదు;

పాపం, బందీలుగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు

కొన ఊపిరిని కూడా చివరకి విడిచిపెట్టక తప్పదు.

నీ నుదిటిమీది పూమాలలు వాడిపోతాయి

కనుక నీ విజయాలగురించి గర్వంగా చెప్పుకోకు!

నీలి వర్ణపు మృత్యు పీఠం మీద చూడు…

గెలిచి ఓడినవాడు ఎలా రక్తం కక్కుకుంటున్నాడో!

నీ తల చివరకి

శీతల సమాధిలోకి రావలసిందే.

కేవలం ధర్మ సమ్మతంగా నడిచినవారి చేతలు మాత్రమే

మట్టిలో కూడా పరిమళాలు వెదజల్లుతూ… చిగురిస్తాయి.

.

జేమ్స్ షెర్లీ.

(September 1596 – October 1666)

ఇంగ్లీషు కవి

James Shirley
James Shirley (Photo credit: Wikipedia)

.

Death the Leveller

 

THE glories of our blood and state

  Are shadows, not substantial things;        

There is no armour against Fate;   

  Death lays his icy hand on kings:  

        Sceptre and Crown

        Must tumble down,      

  And in the dust be equal made     

With the poor crookèd scythe and spade.  

 

Some men with swords may reap the field,           

  And plant fresh laurels where they kill:     

But their strong nerves at last must yield;  

  They tame but one another still:   

        Early or late      

        They stoop to fate,        

And must give up their murmuring breath             

When they, pale captives, creep to death.  

 

The garlands wither on your brow,           

  Then boast no more your mighty deeds!  

Upon Death’s purple altar now      

  See where the victor-victim bleeds.             

        Your heads must come

        To the cold tomb:         

Only the actions of the just  

Smell sweet and blossom in their dust.

.

James Shirley

((September 1596 – October 1666)

English Dramatist

 

Poem Courtesy: The Oxford Book of English Verse: 1250–1900,

Ed.  Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/288.html

%d bloggers like this: