విస్మృతి… జెస్సీ రెడ్మన్ ఫాసెట్, అమెరికను కవయిత్రి
నేను మరణించిన పిదప ఎక్కడో నిర్మానుష్యమైన
సమాధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేను;
కానీ, నాకు ఎవ్వరికీ తెలియని, అందరూ మరచి,
పాడుబడి ఉపేక్షించబడిన చోట నిద్రించాలని ఉంది.
నే నలా పడుక్కుని, నా మృత్యుశ్వాసతో గ్రహించగలగాలి
నిర్జీవత్వాన్నీ, పరిపూర్ణమైన మృత్యు స్పర్శనీ;
సమాధుల పక్కనుండి పోయేవాళ్ళు తరచు పలికే
అసూయా, ద్వేషాలతో కూడిన వాక్కులెన్నడూ వినకూడదు
ప్రార్థనలు గాని, కన్నీళ్ళు గాని నాలోకి ఇంకకూడదు
అవి నిష్కారణంగా మృతుల్ని హింసించి, చెవులని బాధిస్తాయి;
అక్కడ నేను చివికి నశించాలి, నా మనసు విస్మృతిని ఆశీర్వదించాలి
… పరమానందాన్ని మరుగుచేసి పొదువుకుంటుంది అది.
.
(హైతీ కవి మాసిలాన్ కొయ్ కూ ఫ్రెంచి కవితకి అనువాదం)
(ఏప్రిల్ 27, 1861 – ఏప్రిల్ 30, 1961)
అమెరికను కవయిత్రి, వ్యాసకర్తా, నవలాకారిణి, సంపాదకురాలు.
.
