అనువాదలహరి

సంజాయిషీ అడుగు… వ్లాడిమిర్ మయకోవ్ స్కీ, రష్యను

యుద్ధభేరీ మ్రోగుతూ ఉంటుంది.

అది నినదిస్తుంటుంది: శత్రువు గుండెల్లో కత్తి దించమని.

ఒకరి తర్వాత ఒకరుగా బానిసలు

కత్తికి బలవుతూ ఉంటారు.

ఎందుకోసమని?

వివస్త్రయై *

ఆకలితో నేల అలమటిస్తుంది.

ఒక మారణహోమంలో

మనుషులు సమిధలుగా ఆహుతైపోతారు;

ఎందుకంటే

ఎవడో

ఎక్కడో

అల్బేనియాను స్వాధీనం చేసుకుంటాడు.

ఒకరిపట్ల ఒకరికిఉ విద్వేషంతో

మానవ సమూహాలు ఒకదాన్నొకటి చంపుకుంటాయి;

ఎందుకంటే

ఎవడివో నౌకలు

బోస్ఫోరస్  జలసంధిగుండా

ఉచితంగా ప్రయాణం చెయ్యగలుగుతాయి.

త్వరలో

ప్రపంచంలో

మనిషన్నవాడు మిగలడు;

నిర్దాక్షిణ్యంగా తొక్కివెయ్యబడతాడు;

ఎందుకంటే

ఎవడో

మెసొపొటేమియాని హస్తగతం చేసుకుంటాడు.

అసలు ఏ బూటైనా

నేలని ఎందుకు

కరుకుగా, నెర్రెలుపడేలా తన్నాలి?

యుద్ధాలకి ఆవల ఏమిటి లభిస్తుంది?

స్వాతంత్ర్యమా?

నిర్వాణమా?

ధనమా?

వాళ్ళకోసం ప్రాణత్యాగంచేసే

ఓ యోధుడా!

ఎప్పుడు నీకాళ్ళమీద నిటారుగా నిలబడతావు?

“మేమెందుకు యుద్ధం చేస్తున్నాం” అని

వాళ్ళని ఎప్పుడు నిలదీసి అడుగుతావు?

.

వ్లాడిమిర్ మయకోవ్ స్కీ

July 19 1893 – April 14, 1930

రష్యను కవీ, నాటక రచయితా, కళాకారుడూ, నాటక, సినీరంగ నటుడు.

(Notes:

వివస్త్రయై: సస్యశ్యామలమై నిండుగా ఉండవలసిందిపోయి,  బీడుభూమిగా అని అర్థం.

బోస్ఫోరస్  జలసంధి: యూరోపు ఆసియా ఖండాల్ని కలుపుతూ (లేదా విడదీస్తూ) నల్లసముద్రాన్నీ, సీ ఆఫ్ మర్మరాని కలిపే  టర్కీలోని జలసంధి. దీన్ని ఇస్తాన్ బుల్ జలసంధి అనికూడా పిలుస్తారు.

యుద్ధాన్ని నిరసిస్తూ రాసిన కవితల్లో ఇదొక మంచి కవిత.  “ఎవడో ఒకడి స్వార్థం కోసమో, అధికారదాహానికో, పేరుప్రతిష్ఠలకో, అపురూపమైన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి? ”
అన్న సందేశాన్ని ఇస్తోంది ఈ కవిత.

.

Русский: В. В. Маяковский Фото 1929 г.
Русский: В. В. Маяковский Фото 1929 г. (Photo credit: Wikipedia)

.

Call To Account!

.

 

The drum of war thunders and thunders.
It calls: thrust iron into the living.
From every country
slave after slave
are thrown onto bayonet steel.
For the sake of what?
The earth shivers
hungry
and stripped.
Mankind is vapourised in a blood bath
only so
someone
somewhere
can get hold of Albania.
Human gangs bound in malice,
blow after blow strikes the world
only for
someone’s vessels
to pass without charge
through the Bosporus.
Soon
the world
won’t have a rib intact.
And its soul will be pulled out.
And trampled down
only for someone,
to lay
their hands on
Mesopotamia.
Why does
a boot
crush the Earth — fissured and rough?
What is above the battles’ sky –
Freedom?
God?
Money!
When will you stand to your full height,
you,
giving them your life?
When will you hurl a question to their faces:
Why are we fighting?

.

Vladimir Mayakovsky (1917)

July 19 1893 – April 14, 1930

Russian Soviet Poet, Playwright, artist and stage and film actor.

(Translated: by Lika Galkina with Jasper Goss, 2005.)

Poem Courtesy: 

http://www.marxists.org/subject/art/literature/mayakovsky/1917/to-account.htm

%d bloggers like this: