అనువాదలహరి

జ్ఞానోదయం… సారా టీజ్డేల్, అమెరికను

జరుగుతున్న పొరపాట్లకి

నా తల బద్దలుకొట్టుకోవడం మాని

ప్రతి తెరవని తలుపు వెనకా ఒక రాజీమార్గం

దాగుంటుందని తెలుసుకునే వేళకి;

జీవితాన్ని కళ్ళల్లోకళ్ళుపెట్టి చూసి, నెమ్మదించి,

ప్రాప్తకాలజ్ఞత అలవరచుకునే వేళకి

జీవితం నాకు సత్యాన్ని ఆవిష్కరిస్తుందేమో గాని

ప్రతిగా, నా యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది.

.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి

ఈ కవితలో ప్రకటించిన సత్యం అందరికీ తెలిసినదే… మనం సత్యాన్ని అవగతం చేసుకునే వేళకి జీవిత చరమాంకంలోకి వచ్చెస్తాం…  ఆ సత్యం యవ్వనంలో ఉన్నప్పుడు అవగతమైతే బాగుణ్ణుకదా!.  అది ప్రకృతి కల్పనకి విరుద్ధం.  దాన్నే తనదైన శైలిలో చెప్పింది సారా టీజ్డేల్.

అమెరికను కవయిత్రులలో అత్యంత ప్రతిభాశాలీ, హృదయ సౌకుమార్యమూ, కవిత్వాన్ని అతి చిన్నపదాలలో చొప్పించి చెప్పగల నేర్పూ కల కవయిత్రి.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

Wisdom

.

When I have ceased to break my wings

against the faultiness of things

and learned that compromises wait

Behind each hardly opened gate

When I can look Life in the eyes

Grown calm and very coldly wise –

Life will have given me the Truth

and taken in exchange – my Youth.

.

Sara Teasdale 

(August 8, 1884 – January 29, 1933)

American

%d bloggers like this: