ఎంచుకో… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను
అటు గట్టిగా బిగించబడి, సిద్ధంగా పైకి లేపిన ఒక పిడికిలి,
ఇటు దేహీ అని యాచిస్తూ నీ ముందుకి చాచబడి ఎదురుచూస్తున్న చేయి…
ఏదో ఒకటి ఎంచుకో
ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది.
.
కార్ల్ సాండ్బర్గ్
(January 6, 1878 – July 22, 1967)
అమెరికను.
ఇంత చిన్న కాన్వాసులో అద్భుతమైన భావాన్ని చెబుతున్నాడు కవి. మనకి జీవితంలో ఎంపిక చేసుకుందికి రెండే ఉన్నాయి… మనకి సమాజం పట్ల అసహనం ఉంటే, దాన్ని మార్చడానికి పిడికిలి బిగించి సాగిపోవడం; లేదా, సమాజంచే మోసపోయి బ్రతుకే యాచనగా మారిన వాళ్ళకి మనవంతు సహాయం చెయ్యడం.
.
