అనువాదలహరి

సాహితీజీవిత ఆత్మకథ… ఫ్రాంక్ ఒహారా, అమెరికను

నా చిన్నతనంలో

నేనొక్కడినే ఆడుకుంటూ ఉండే వాడిని

స్కూలు ఆటస్థలానికి ఓ మూల,

ఒంటరిగా.

నాకు బొమ్మలంటే అసహ్యం

ఆటలంటే అయిష్టం, జంతువులు

స్నేహంగా ఉండేవి కావు,

పిట్టలు పారిపోతుండేవి.

నాకోసం ఎవరైనా వెదుక్కుంటూ వస్తే

ఓ చెట్టు వెనక దాక్కుని

“నేనొక అనాథని” అని

ఏడుస్తుండే వాడిని.

ఇప్పుడు చూడబోతే నేనిక్కడ,

ఈ కవితలు రాసుకుంటూ,

ఆనందానికి కేంద్రంగా!

ఆశ్చర్యం!

.

ఫ్రాంక్ ఒహారా

(March 27, 1926 – July 25, 1966)

అమెరికను కవి

ఈ కవితలోని వ్యంగ్యం, చిన్నప్పుడు ఆనందానికి హేతువులు, కవిత్వానికి కావలసిన అనుభవమూ, జ్ఞాపకాలకి మూలహేతువులైన ఆటబొమ్మలూ, మిత్రులూ, జంతువులూ, పిట్టలూ  వీటన్నిటితో స్నేహం చెయ్యకుండా, ఒంటరిగా గడిపి, పెద్దయ్యేక, కవిత్వం రాయడం… ఇది ఆశ్చర్యం అంటున్నాడు కవి.  ఎందుకంటే, వైయక్తికంగానో ఇతరుల అనుభవాన్ని విని అనుభూతించడం ద్వారానో కాకుండా ఏది రాసినా అది కేవలం కల్పన, ఊహే అవుతుంది… దానితో ఇతరులని రంజింపజెయ్యడం ఆశ్చర్యమే మరి!

.

frank o'hara
frank o’hara (Photo credit: m kasahara)

.

Autobiographia Literaria

.

When I was a child
I played by myself in a
corner of the schoolyard
all alone.

I hated dolls and I
hated games, animals were
not friendly and birds
flew away.

If anyone was looking
for me I hid behind a
tree and cried out “I am
an orphan.”

And here I am, the
center of all beauty!
writing these poems!
Imagine!

.

Frank O”Hara

(March 27, 1926 – July 25, 1966)

American writer, poet and art critic.

As I understand, the satire in the poem is that people without accumulating experiences since childhood … from nature, friends, sport and pets… try to write poetry when they grow up.  What is there to write about when you don’t have any nostalgia!

%d bloggers like this: