రోజు: డిసెంబర్ 9, 2013
-
XII ఎమిలీ డికిన్సన్, అమెరికను
నా రథచక్రం చీకటిలో చిక్కుకుంది. నాకు ఒక ఆకూ కనిపించడం లేదు, అయినా నీళ్ళోడ్తున్న దాని కమ్ములు గుండ్రంగా ఉన్నచోటే తిరుగుతున్నాయని తెలుస్తోంది. నా అడుగు కెరటం మీద పడింది ఇదెన్నడూ నడిచినత్రోవ కాదు, అయినా అన్ని మార్గాలకీ చివర ఒక చక్కని మైదానం ఉంటుంది. కొందరు నావ తెడ్డు వదిలిపెట్టేరు, కొందరికి సమాధిలోనే ప్రశాంతమైన వ్యాపకం దొరుకుతుంది, కొందరు సమస్యలని నీకూ నాకు వదిలిపెట్టి దర్జాగా రాజసంగా అడుగులేసుకుంటూ ద్వారంలోంచి నిష్క్రమిస్తారు. […]