అనువాదలహరి

కురుస్తున్న మంచులో దేవదారు చెట్లు… థామస్ వెంట్ వర్త్ హిగిన్సన్, అమెరికను

నిశ్శబ్దం కన్నా మెల్లగా, నిలిచిపోయిన గాలికంటే నిశ్చలంగా

ఎత్తైనదేవదారువులనుండి జాలువారుతున్నాయి లేతఆకుల్లా…మంచుపరకలు.

ఈ అడవి నేలంతా వార్షికపు వరాన్ని అందుకుంటోంది

నిర్విరామంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా కురిసే హిమపాతం రూపంలో.

చాలా సున్నితంగా తేలియాడుతూ, వయసుమీరిన ఆ గండశిలల్ని

అంత సున్నితంగానూ, సొగసుగానూ అలంకరిస్తున్నాయి.

 

శిశిరంలో పనలు పనలుగా రాలిన ఆకులుకంటే

వెలబోయిన పసుపురంగు వస్త్రాన్ని నేస్తున్నాయా

లేక, ఆ చిత్రమైన మంచుపుష్పాలు “విచ్ హేజిల్స్” (1) ని ధరిస్తున్నాయా?

పొడవైన చెట్లవరుసలోంచి సూర్యకిరణాలు అడ్డంగా దూసుకొస్తున్నై

ఆకాశంలో ఎక్కడో కాకులు రాత్రికి గూడుచేరుకుంటున్నాయి.

 

వాతావరణం మెత్తని సూదుల మయం; పాలపిట్ట ఒకటి

ఆ బంగరు పొగమంచులోంచి సంతోషంగా దూసుకు పోతోంది;

నవంబరు నెల గడిచేదాకా అలా రాలుతూనే ఉంటాయి

ఆ మంచు తూలికలు … లలిత లలితంగా తేలుతూ, తూలుతూ.

.

థామస్ వెంట్ వర్త్ హిగిన్సన్

(డిశంబరు 22, 1823 – మే 9, 1911) 

అమెరికను  కవి, సైనికుడు, బానిసత్వ నిర్మూలన వాది, యూనిటరీ క్రైస్తవ మతాధికారి.

Notes:  విచ్ హేజిల్స్ (Witch-hazels) అన్నవి Hamamelidaceae Family కి చెంది, అమెరికా, చైనా, జపాను లలో  శీతకాలంలో పూచే ఒక జాతి పూలచెట్లు.  మరింత వివరాలకు ఇక్కడ చూడండి.

.

 

 

English: Thomas Wentworth Higginson.
English: Thomas Wentworth Higginson. (Photo credit: Wikipedia)

 

.

The Snowing of the Pines

.

Softer than silence, stiller than still air

Float down from high pine-boughs the slender leaves.

The forest floor its annual boon receives

That comes like snowfall, tireless, tranquil, fair.

Gently they glide, gently they clothe the bare

Old rocks with grace.

Their fall a mantle weaves

Of paler yellow than autumnal sheaves

Or those strange blossoms the witch-hazels wear.

Athwart long aisles the sunbeams pierce their way;

High up, the crows are gathering for the night;

The delicate needles fill the air; the jay

Takes through their golden mist his radiant flight;

They fall and fall, till at November’s close

The snow-flakes drop as lightly—snows on snows.

.

Thomas Wentworth Higginson.

(December 22, 1823 – May 9, 1911)

 American Unitarian minister, author, abolitionist, and soldier.

 

http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_67

%d bloggers like this: