రోజు: డిసెంబర్ 7, 2013
-
చేతిరుమాలు … అజ్ఞాత కవి, యుక్రెయిన్
(యుక్రెయిన్ పడుచులలో ఒక ఆచారం ఉంది. పెళ్ళికి ముందు వాళ్ళు అల్లిన చేతిరుమాలు, నిశ్చితార్థం నాడు వరుడు ముంజేతికో, ఇంకెక్కడైనా ప్రస్ఫుటంగా కనిపించేచోట కడతారు. ) . సముద్రానికి ఆవలి అంచున సూర్యుడు మునిగి ఉన్నాడు ఎర్రగా, రక్త వర్ణంతో; ఆ కెంపువన్నె ప్రవాహంలో ఒక పడుచు మేలిమి రుమాలు అల్లింది. బంగారంలాంటి చక్కని చేతికుట్టుతో అల్లింది… ఈ రేయి ఆమె చెక్కిళ్ళు తెల్లకలువల్లా కనిపిస్తాయి, కన్నీట కడిగిన స్వచ్ఛమైన కలువల్లా ఆల్లిక పూర్తవగానే గుండెలకి గాఢంగా […]