అనువాదలహరి

సాహసికుడు… విల్టన్ ఏగ్నూ బారెట్, అమెరికను

I

ఎర్రగా, ముడుతలుపడ్డ ముఖంతో

చేతులు బిగించి పట్టుకుని

ఏమిచెబదామనో ఆ  ఆరాటం?

ఇప్పుడే ఆ చీకట్లోంచి బయటకు వచ్చేడు

అక్కడి నిశ్శబ్దం ఇంకా అతని శరీరాన్ని వదలనే లేదు

అప్పుడే జీవితంగురించి ఏదో చెప్పాలని ఉబలాట పడుతునాడు.

ష్!

బహుశా జననమరణాలగురించి గొప్ప రహస్యం తెలిసుంటుంది,

ఆ చీకటి ‘గర్భ’ గుడిలో తను తెలుసుకున్నది,

జీవితం దాన్ని సంగ్రహిస్తోందని

మనతో చెబదామనుకుంటూ

చెప్పలేకపోతున్నాడు.

అతను ఆనందంగాకంటే, ఎక్కువ విచారంగానే ఉన్నాడు.

II

దౌడుతీయి, దౌడుతీయరా కన్నా, నా మోకాళ్ళమీద.

ఈ ఆశ్వికుడుకి ఎంతకీ అలుపురాదేమి ?

ఆ నిశ్శబ్దపు నిశీధిని

నువ్వు ‘కేర్’ మనడానికి వీపు తడుతున్నప్పుడు

నువ్వీపాటి చెయ్యగలవనుకోలేదురా!

నువ్వు ఇక ఈ పరుగు పరిగెడుతూనే ఉండాలి!

నువ్వు మీ నాన్నని అనుకరిస్తే

బాన్ బరీ క్రాస్ కి వెళ్ళడానికి కొయ్యగుర్రం స్వారీచేస్తూ

నీ జీవితం కూడా సుఖదుఃఖాలమయమౌతుంది.

III

లే నాన్నా,  ఉదయాన్నే లే!

కాంతివంతమైన సముద్రపొడ్డుకి పరిగెత్తు

మిలమిలలాడే గవ్వల్ని వెదుకు

చంద్రకాంతమణులవంటి మంచుబిందువులు ఏరుకో

పట్టుకున్నాక,

ఒక ఎగురు ఎగిరి

తిరిగి విసిరెయ్

మహోన్నతమైన ఈ ఆకాశం క్రింద

నువ్వెంత స్వచ్ఛంగా, విచ్చలవిడిగా ఉండగలవో ఉండు!

నీ అంగాలు చాలా తేలిక, అవలీలగా నృత్యం చెయ్యగలవు.

అవి ఎంతసేపు అలా నృత్యం చెయ్యగలవో తెలుసా?

ఒక్కసారి ప్రయత్నం చేసి చూడరా తండ్రీ, నీకే తెలుస్తుంది.

.

విల్టన్ ఏగ్నూ బారెట్

అమెరికను

.

The Adventurer

 .

I

.

What is he struggling to say,

With his red, wrinkled face

And clawing hands?

He has just come out of the darkness,

Its silence is still upon him,

And already he wants to talk about life!

Hush!—

Perhaps he has some great secret of birth and death,

Learned back there in the black womb,

Which he feels life stealing;

And he wants to tell it to us

And cannot.

He is more terrible than funny.

.

II

.

Gallop, gallop on my knee—

What a tireless rider!

I didn’t think of your doing this

When, in the stillness of night,

We set you stirring.

Now I suppose you must keep on!

If you follow your daddy

You will have a merry and sad time,

Riding a cock-horse

To Banbury Cross.

III

Arise, child, in the morning!

Go down upon the shining beach,

Find the glinting shells

And the white drops of moonstone.

Gather and toss them away,

Leaping.

Under the towering sky

Be wild as you are white!

Your limbs are light and can dance.

Do you know how far they can dance?

Dance, child, and see.

.

Wilton Agnew Barrett

American

Poem Courtesy: http://www.bartleby.com/300/1037.html

A Magazine of Verse 1912-22 Ed. Harriet Monroe (1860-1936)

%d bloggers like this: