అనువాదలహరి

నగరం లోని చెట్లు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

పుర వీధుల్లోని చెట్లు

రోడ్లమీద వాహనాలూ, రైళ్ళ కూతలూ లేకుంటే

జనపథాలపక్కని చెట్లలా,

అంత సుతిమెత్తని, తీయని ధ్వని చేస్తాయి.

వర్షానికి,  వాటి నీడలో

తలదాచుకుంటున్న మనుషులు  నిస్సందేహంగా

పల్లెల్లోని చెట్లమీద

వాన చేసే సంగీతాన్ని వినగలరు

నగర రణగొణధ్వనికి

మౌనాన్ని వహించే చిన్ని చిగురాకుల్లారా!

పిల్లతెమ్మెర వీచినపుడు నే గమనింఛా,-

మీరెంత చిరుసవ్వడి చేస్తారో.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19)

అమెరికను కవయిత్రి

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)
Portrait of Edna St. Vincent Millay (1933-01-14) (Photo credit: Wikipedia)

.

City Trees

.

The trees along this city street,

Save for the traffic and the trains,

Would make a sound as thin and sweet

As trees in country lanes.


And people standing in their shade

Out of a shower, undoubtedly

Would hear such music as is made

Upon a country tree.


Oh, little leaves that are so dumb

Against the shrieking city air,

I watch you when the wind has come,—

I know what sound is there.

.

Edna St. Vincent Millay 

(February 22, 1892 – October 19)

American Poet and Playwright

క్రీడ… హేమ్లిన్ గార్లాండ్, అమెరికను కవి

ఎక్కడో, దూరంగా

పెనవేసుకున్న పనలతో, పండిన గోధుమ చేలలో  

ఒక చిన్న అడివికోడిపిల్ల ఏడుస్తోంది

తనవాళ్ళందరినుండి తప్పిపోయి, వేడుకుంటూ, వెక్కివెక్కి.

ఇంతలో,  మట్టికొట్టుకుని, రెక్కలు చెదిరి

దుమ్ముకొట్టుకున్న కళ్ళతో

సమాధానం చెప్పలేని తల్లి కోడి

వేటగాడి కాళ్ళదగ్గర రక్తమోడుతూ, కదల్లేక పడి ఉంది.

.

హేమ్లిన్ గార్లాండ్ 

(September 14, 1860 – March 4, 1940)

అమెరికను కవి.

.

English: Photograph of American writer Hamlin ...
English: Photograph of American writer Hamlin Garland (1860-1940). From A Member of the Third House: A Dramatic Story. Chicago: F. J. Schulte and Company, 1892. (Photo credit: Wikipedia)

.

Sport

.

Somewhere, in deeps

Of tangled, ripening wheat,

A little prairie-chicken cries-

Lost from its fellows, it pleads and weeps.

Meanwhile, stained and mangled,

With dust-filled eyes,

The unreplying mother lies

Limp and bloody at the sportsman’s feet.

.

Hamlin Garland 

(September 14, 1860 – March 4, 1940) 

American novelist, poet, essayist, and short story writer

సమవర్తి మృత్యువు… జేమ్స్ షెర్లీ. ఇంగ్లీషు కవి

గొప్పింటి పుట్టుకలగురించీ, అధికార దర్పాలగురించీ

చెప్పుకునే వన్నీ కేవలం మిధ్య, వాస్తవాలు కావు;

విధిని ఎదిరించి నిలవగల కవచం ఏదీ లేదు;

మహరాజులైనా మృత్యువు తన శీతహస్తంతో స్పృశిస్తుంది,

కిరీటాలూ, రాజ చిహ్నాలూ

దొర్లి పడవలసిందే

పాడుబడ్డ బొరిగ తోనూ, పార తోనూ

సమానంగా మట్టిపాలుకావలసిందే.

కత్తులతో కొందరు యుద్ధరంగంలో జయించొచ్చు

మృతుల హారాలని ధరించి సరికొత్త చరిత్ర లిఖించుకోవచ్చు

కానీ, చివరకి ఏదోనాటికి వాళ్ళ సత్త్వము ఉడుగక తప్పదు

విధితో పోరాడుతూ జయాపజయాలు చేతులు మారొచ్చు

కానీ, ముందో వెనకో

విధికి తలవంచక తప్పదు;

పాపం, బందీలుగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు

కొన ఊపిరిని కూడా చివరకి విడిచిపెట్టక తప్పదు.

నీ నుదిటిమీది పూమాలలు వాడిపోతాయి

కనుక నీ విజయాలగురించి గర్వంగా చెప్పుకోకు!

నీలి వర్ణపు మృత్యు పీఠం మీద చూడు…

గెలిచి ఓడినవాడు ఎలా రక్తం కక్కుకుంటున్నాడో!

నీ తల చివరకి

శీతల సమాధిలోకి రావలసిందే.

కేవలం ధర్మ సమ్మతంగా నడిచినవారి చేతలు మాత్రమే

మట్టిలో కూడా పరిమళాలు వెదజల్లుతూ… చిగురిస్తాయి.

.

జేమ్స్ షెర్లీ.

(September 1596 – October 1666)

ఇంగ్లీషు కవి

James Shirley
James Shirley (Photo credit: Wikipedia)

.

Death the Leveller

 

THE glories of our blood and state

  Are shadows, not substantial things;        

There is no armour against Fate;   

  Death lays his icy hand on kings:  

        Sceptre and Crown

        Must tumble down,      

  And in the dust be equal made     

With the poor crookèd scythe and spade.  

 

Some men with swords may reap the field,           

  And plant fresh laurels where they kill:     

But their strong nerves at last must yield;  

  They tame but one another still:   

        Early or late      

        They stoop to fate,        

And must give up their murmuring breath             

When they, pale captives, creep to death.  

 

The garlands wither on your brow,           

  Then boast no more your mighty deeds!  

Upon Death’s purple altar now      

  See where the victor-victim bleeds.             

        Your heads must come

        To the cold tomb:         

Only the actions of the just  

Smell sweet and blossom in their dust.

.

James Shirley

((September 1596 – October 1666)

English Dramatist

 

Poem Courtesy: The Oxford Book of English Verse: 1250–1900,

Ed.  Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/288.html

విస్మృతి… జెస్సీ రెడ్మన్ ఫాసెట్, అమెరికను కవయిత్రి

నేను మరణించిన పిదప  ఎక్కడో నిర్మానుష్యమైన

సమాధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేను;

కానీ, నాకు ఎవ్వరికీ  తెలియని, అందరూ మరచి,

పాడుబడి ఉపేక్షించబడిన చోట నిద్రించాలని ఉంది.

నే నలా పడుక్కుని, నా మృత్యుశ్వాసతో గ్రహించగలగాలి

నిర్జీవత్వాన్నీ, పరిపూర్ణమైన మృత్యు స్పర్శనీ;

సమాధుల పక్కనుండి పోయేవాళ్ళు తరచు పలికే

అసూయా, ద్వేషాలతో కూడిన వాక్కులెన్నడూ వినకూడదు

ప్రార్థనలు గాని, కన్నీళ్ళు గాని నాలోకి ఇంకకూడదు

అవి నిష్కారణంగా మృతుల్ని హింసించి, చెవులని బాధిస్తాయి;

అక్కడ నేను చివికి నశించాలి, నా మనసు విస్మృతిని ఆశీర్వదించాలి

… పరమానందాన్ని మరుగుచేసి పొదువుకుంటుంది అది.

.

(హైతీ కవి మాసిలాన్ కొయ్ కూ ఫ్రెంచి కవితకి అనువాదం)

(ఏప్రిల్ 27, 1861 – ఏప్రిల్ 30, 1961)

అమెరికను కవయిత్రి, వ్యాసకర్తా, నవలాకారిణి, సంపాదకురాలు.

.

Jessie Redmon Fauset
Jessie Redmon Fauset (Photo credit: Wikipedia)

.

Oblivion

 .

I hope when I am dead that I shall lie

  In some deserted grave—I cannot tell you why,

But I should like to sleep in some neglected spot

  Unknown to everyone, by everyone forgot.

There lying I should taste with my dead breath

  The utter lack of life, the fullest sense of death;

And I should never hear the note of jealousy or hate,

  The tribute paid by passers-by to tombs of state.

To me would never penetrate the prayers and tears

  That futilely bring torture to dead and dying ears;

There I should lie annihilate and my dead heart would bless

  Oblivion—the shroud and envelope of happiness.

.

(Translated from French of Massillon Coicou (Haiti))

 Jessie Redmon Fauset

 (April 27, 1882 – April 30, 1961)

 American editor, poet, essayist and novelist.

 Poem Courtesy:

 The Book of American Negro Poetry.  1922

 Ed. James Weldon Johnson, (1871–1938).

Bio: http://en.wikipedia.org/wiki/Jessie_Redmon_Fauset

రెండు దృక్పధాలు… ల్యూసియన్ వాట్కిన్స్, అమెరికను

గంభీరమైన ఈ లోయలోంచి చూస్తుంటే, వావ్!  జీవితం

ఎంత అద్భుతంగా, అందంగా, ప్రశాంతంగా, గొప్పగా అనిపిస్తోంది,

దూరాన శైలసింహాసనం మీద పసిడి సూర్యబింబ మకుటం!

సమున్నతమైన ఈ శిఖరాగ్రంమీదనుండి చూస్తుంటే

దూరాన  కలువలు విరిసిన ఆ కనుమ ప్రశాంతంగా నిద్రిస్తూ,

ఏ సడీ లేక, నులివెచ్చగా, మెత్తగా, పచ్చగా నిగనిగలాడుతూ కనిపిస్తోంది!

.

ల్యూసియన్ వాట్కిన్స్

అమెరికను

.

Lucian B Watkins

Image Courtesy:

http://digitalgallery.nypl.org/nypldigital/dgkeysearchdetail.cfm?trg=1&strucID=539826&imageID=1216454&parent_id=539787&word=&snum=&s=&notword=&d=&c=&f=&k=0&sScope=&sLevel=&sLabel=&total=41&num=20&imgs=20&pNum=&pos=40

.

Two Points of View

.

From this low-lying valley; Oh, how sweet         

And cool and calm and great is life, I ween,        

There on yon mountain-throne—that sun-gold crest!   

 

From this uplifted, mighty mountain-seat:

How bright and still and warm and soft and green               

Seems yon low lily-vale of peace and rest!

.

 

Lucian B. Watkins

 

American

 

It is very unfortunate that too little is known about the poet.

Watkins, Lucian B., was born in Virginia. He served overseas in the Great War and lost his health. He died in 1921. He was the author of a large number of uncollected poems. (http://www.bartleby.com/269/1002.html)


Poem Courtesy: The Book of American Negro Poetry.  1922

Ed. James Weldon Johnson. (1871–1938

ఆఫ్రికా నుండి అమెరికాకు … ఫిల్లిస్ వ్హీట్లీ, అమెరికను

నాగరికత ఎరుగని నేల నుండి విధి ఇక్కడకి తీసుకొచ్చింది

అంధకారంలో ఉన్న నా ఆత్మకి అవగాహన నేర్పింది:

దేవుడున్నాడనీ, ఒక రక్షకుడున్నాడనీ

నేను మోక్షాన్ని కోరుకోనూ లేదు, అసలుందనీ తెలీదు.

మా నల్ల జాతిని కొందరు నిరసనగా చూస్తారు,

“వాళ్ళ రంగు రాక్షసుల రంగు,” అంటూ

క్రిస్టియనులారా! గుర్తుంచుకొండి. నీగ్రోలు కెయిన్ లా నల్లగా ఉండొచ్చు

కాని వాళ్ళు సంస్కరించబడి, దివ్యపరంపరలో చేరగలరు. 

.

ఫిల్లిస్ వ్హీట్లీ

(1753 – 5 డిశంబరు 1784)

అమెరికను

.

Statue of Phillis Wheatley
Statue of Phillis Wheatley (Photo credit: Sharon Mollerus)

.

On Being Brought from Africa to America

 

‘Twas mercy brought me from my Pagan land,

Taught my benighted soul to understand

That there’s a God, that there’s a Saviour too:

Once I redemption neither sought nor knew.

Some view our sable race with scornful eye,

 “Their colour is a diabolic die.”

 Remember, Christians, Negros, black as Cain,

May be refin’d, and join th’ angelic train. –

 .

Phillis Wheatley

(1753 – 5 Dec,  1784)

American

Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/16360

Bio Courtesy: http://www.biography.com/people/phillis-wheatley-9528784

మన వియోగం విలక్షణమైనది … అజ్ఞాత కవి

మిత్రులకీ, బ్లాగు సందర్శకులకీ క్రిస్మస్ శుభాకాంక్షలు

.

మనం ఎడబాసినపుడు అందరిలా ఉండకూడదు…

నిట్టూరుస్తూ, కన్నీరు కారుస్తూ. ఇద్దరం

శరీరాలు వేరయినా, ఒకరికొకరు దూరమయినపుడు

ఒకరి హృదయంలో రెండోవారిని నిలుపుకుంటాం.

ఎవరు వెదకి పట్టుకోగలరు నేను లేకుండా

నువ్వు మాత్రమే ఉండగలిగే జీవిని?     

సిసలైన ప్రేమకి రెక్కలుంటాయి; తలచినంత మాత్రమే

అది ప్రపంచాన్ని చుట్టి రా గలదు  సూర్యచంద్రుల్లా.

ఇతరులు అందరూ ఎడబాటుకి వగచి విలపించే చోట

మన విజయాలు ఎడబాటుని మరపింపజేస్తాయి.

దానివల్లే, స్వర్గంలో ఉన్నవాళ్ళకి మల్లే

ఈ భూమిమీద కూడా బ్రతకడానికి కావలసిన శక్తి వస్తుంది.

.

అజ్ఞాత కవి 

.

We Must Not Part As Others Do

 .

 We must not part, as others do,

With sighs and tears, as we were two,

Though with these outward forms, we part;

We keep each other in our heart.

What search hath found a being, where

I am not, if that thou be there?

True love hath wings, and can as soon

Survey the world, as sun and moon;

And everywhere our triumphs keep

Over absence, which makes others weep:

By which alone a power is given

To live on earth, as they in heaven.

.

Anonymous

Poem Courtesy: The Book of Restoration Verse.  1910. Ed. William Stanley Braithwaite

(The poem is taken by the Editor from the Egerton MS., 2013, printed by Dr. Arber in his English Garner, vol. III. p. 396.)

పెళ్ళిచేసుకోమని ఒక స్త్రీని అర్ధిస్తున్న వానికి హితవు … కేథరీన్ ఫిలిప్స్, ఇంగ్లీషు- వెల్ష్ కవయిత్రి

నిలు నిలు, ధైర్యశాలీ! ఇదంతా స్వర్గ ధామమే.

నువ్వు ఏది ప్రమాణం చేసిచెపుతున్నావో

ఇతరులకి అది పెండ్లికి అభ్యర్థిస్తున్నట్టు కనిపించొచ్చు

ఆమెపట్ల అది మహాపచారం.

ఆమె ప్రజలందరికీ ఆరాధ్య దేవత.

ఒక చిన్న అనామకమైన ఇంట్లో దేవతలా

ఆమె కొలువై ఉండడం

చూడ్డానికి చాలా వింతగా అనిపించదూ?

ముందు ఒక పని చెయ్యి. లోకానికి సెలవు చెప్పి

సూర్యుణ్ణి నీ ఒక్కడికోసం ప్రకాశించమను.

అతడు తన కిరణాలన్నిటితో

నీకు పరిపూర్ణత ప్రసాదించనీ.

అల జరగడం లేదని ఒకవేళ నిరాశపడుతుంటే

ఆ కిరణాలకంటే, విశాలమూ ప్రకాశమూ ఐన

ఆమె వెలుగులని కొద్దిజాగాకి పరిమితం చెయ్యడం

ఎంత పొరపాటో ఒకసారి ఆలోచించు!

.

కేథరీన్ ఫిలిప్స్ (ఓరిండా)

(1 January 1632 – 22 June 1664)

ఇంగ్లీషు- వెల్ష్ కవయిత్రి, అనువాదకురాలు, చదువరి

.

Philips 634
Philips 634 (Photo credit: Wikipedia)

.

An Answer to Another Persuading a Lady to Marriage

 

.

 

Forbear, bold youth, all’s Heaven here,    

        And what you do aver,   

To others, courtship may appear,    

        ’Tis sacriledge to her.     

 

She is a publick deity,             

        And were’t not very odd

She should depose her self to be      

        A petty household god? 

 

First make the sun in private shine, 

        And bid the world adieu,          

That so he may his beams confine   

        In complement to you.   

 

But if of that you do despair, 

        Think how you did amiss,       

To strive to fix her beams which are          

        More bright and large than this.

 

 

Katherine Philips (‘Orinda’)

(1631–1664)

Anglo-Welsh Poet, Translator, and woman of letters

వోటు … జాన్ పియర్పాంట్, అమెరికను

మట్టి పెల్లలమీద మంచు కురిసినట్టు
అంత నిశ్శబ్దంగా వాలే ఆయుధం అది;
అది ఒక స్వతంత్రుడి కోరికకి రూపునిస్తుంది
దేవుని చిత్తాన్ని మెరుపు ఆచరణలో పెట్టినట్టుగా.
.
జాన్ పియర్ పాంట్
(April 6, 1785 – August 27, 1866)
అమెరికను కవీ ఉపాధ్యాయుడూ, న్యాయవాదీ

.

John Pierpont (1785 - 1866)
John Pierpont (1785 – 1866) (Photo credit: Wikipedia)

.

The Ballot

 

 .

A Weapon that comes down as still 

  As snowflakes fall upon the sod;   

But executes a freeman’s will,

  As lightning does the will of God.

 

.

John Pierpont

(April 6, 1785 – August 27, 1866)

American poet,  teacher, lawyer, merchant, and Unitarian minister.

 

 

సంజాయిషీ అడుగు… వ్లాడిమిర్ మయకోవ్ స్కీ, రష్యను

యుద్ధభేరీ మ్రోగుతూ ఉంటుంది.

అది నినదిస్తుంటుంది: శత్రువు గుండెల్లో కత్తి దించమని.

ఒకరి తర్వాత ఒకరుగా బానిసలు

కత్తికి బలవుతూ ఉంటారు.

ఎందుకోసమని?

వివస్త్రయై *

ఆకలితో నేల అలమటిస్తుంది.

ఒక మారణహోమంలో

మనుషులు సమిధలుగా ఆహుతైపోతారు;

ఎందుకంటే

ఎవడో

ఎక్కడో

అల్బేనియాను స్వాధీనం చేసుకుంటాడు.

ఒకరిపట్ల ఒకరికిఉ విద్వేషంతో

మానవ సమూహాలు ఒకదాన్నొకటి చంపుకుంటాయి;

ఎందుకంటే

ఎవడివో నౌకలు

బోస్ఫోరస్  జలసంధిగుండా

ఉచితంగా ప్రయాణం చెయ్యగలుగుతాయి.

త్వరలో

ప్రపంచంలో

మనిషన్నవాడు మిగలడు;

నిర్దాక్షిణ్యంగా తొక్కివెయ్యబడతాడు;

ఎందుకంటే

ఎవడో

మెసొపొటేమియాని హస్తగతం చేసుకుంటాడు.

అసలు ఏ బూటైనా

నేలని ఎందుకు

కరుకుగా, నెర్రెలుపడేలా తన్నాలి?

యుద్ధాలకి ఆవల ఏమిటి లభిస్తుంది?

స్వాతంత్ర్యమా?

నిర్వాణమా?

ధనమా?

వాళ్ళకోసం ప్రాణత్యాగంచేసే

ఓ యోధుడా!

ఎప్పుడు నీకాళ్ళమీద నిటారుగా నిలబడతావు?

“మేమెందుకు యుద్ధం చేస్తున్నాం” అని

వాళ్ళని ఎప్పుడు నిలదీసి అడుగుతావు?

.

వ్లాడిమిర్ మయకోవ్ స్కీ

July 19 1893 – April 14, 1930

రష్యను కవీ, నాటక రచయితా, కళాకారుడూ, నాటక, సినీరంగ నటుడు.

(Notes:

వివస్త్రయై: సస్యశ్యామలమై నిండుగా ఉండవలసిందిపోయి,  బీడుభూమిగా అని అర్థం.

బోస్ఫోరస్  జలసంధి: యూరోపు ఆసియా ఖండాల్ని కలుపుతూ (లేదా విడదీస్తూ) నల్లసముద్రాన్నీ, సీ ఆఫ్ మర్మరాని కలిపే  టర్కీలోని జలసంధి. దీన్ని ఇస్తాన్ బుల్ జలసంధి అనికూడా పిలుస్తారు.

యుద్ధాన్ని నిరసిస్తూ రాసిన కవితల్లో ఇదొక మంచి కవిత.  “ఎవడో ఒకడి స్వార్థం కోసమో, అధికారదాహానికో, పేరుప్రతిష్ఠలకో, అపురూపమైన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి? ”
అన్న సందేశాన్ని ఇస్తోంది ఈ కవిత.

.

Русский: В. В. Маяковский Фото 1929 г.
Русский: В. В. Маяковский Фото 1929 г. (Photo credit: Wikipedia)

.

Call To Account!

.

 

The drum of war thunders and thunders.
It calls: thrust iron into the living.
From every country
slave after slave
are thrown onto bayonet steel.
For the sake of what?
The earth shivers
hungry
and stripped.
Mankind is vapourised in a blood bath
only so
someone
somewhere
can get hold of Albania.
Human gangs bound in malice,
blow after blow strikes the world
only for
someone’s vessels
to pass without charge
through the Bosporus.
Soon
the world
won’t have a rib intact.
And its soul will be pulled out.
And trampled down
only for someone,
to lay
their hands on
Mesopotamia.
Why does
a boot
crush the Earth — fissured and rough?
What is above the battles’ sky –
Freedom?
God?
Money!
When will you stand to your full height,
you,
giving them your life?
When will you hurl a question to their faces:
Why are we fighting?

.

Vladimir Mayakovsky (1917)

July 19 1893 – April 14, 1930

Russian Soviet Poet, Playwright, artist and stage and film actor.

(Translated: by Lika Galkina with Jasper Goss, 2005.)

Poem Courtesy: 

http://www.marxists.org/subject/art/literature/mayakovsky/1917/to-account.htm

%d bloggers like this: