ఆ రాక్షసుడు రాక్షసులేం చెయ్యగలరో
అదే చేస్తాడు; అది మనుషులకి సాధ్యం కాదు;
కానీ ఒక అమూల్యవస్తువు మాత్రం వాడికి చిక్కదు:
రాక్షసుడు మాటను వశపరచుకోలేడు.
దాసోహం అన్న నేల మీద,
అక్కడి హతాసులూ, నిహతులూ మధ్య
ఆ రాక్షసుడు నడుం మీద చేతులేసుకుని
పెదాలంట చొంగకారుతుంటే అసహనంగా కదులుతుంటాడు.
.
వ్యుస్టన్ హ్యూ ఆడెన్ (W H Auden)
21 ఫిబ్రవరి- 29 సెప్టెంబరు 1973
బ్రిటిషు-అమెరికను కవి
.
ఈ కవిత కమ్యూనిష్టు రష్యా 1968 ఆగష్టు 20 వతేదీ రాత్రి తన వార్సా ఒప్పందంలోని ఇతర అనుచర దేశాలతో కలిసి చెకోస్లొవేకియా మీద జరిపిన దాడికి నిరసనగా రాసింది. కమ్యూనిష్టు దేశంగా ఉంటూనే, కొంత ప్రజాస్వామిక దృక్పథమూ, వాక్స్వాతంత్ర్యమూ, పత్రికలకి స్వేచ్ఛా మొదలైన అంశాలపై ప్రజల అభీష్టం మేరకు స్పందించి Prague Spring గా పిలవబడ్డ ఒక విప్లవాత్మకమైన ఆలోచనలకి కారకుడైన అలెగ్జాండర్ డూబ్ చెక్ చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగింది.
అధికారానికి మించిన దాహం మరొకటిలేదు. రాచరికాల్లోనూ, ప్రజాస్వామ్యాల్లోనూ అయితే ఒక వ్యక్తితో తీరదు… అది వంశానుగతమై/ పరంపరాగతమై వర్ధిల్లాలి. చేవలేని నాయకులూ, ప్రమత్తులైన ప్రజలూ, యువతరం ఉన్నంతవరకూ మాట ఎప్పుడూ జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తుంది. కనీసం కవులైనా గొంతెత్తి తమ అభిప్రాయాల్ని ప్రకటించగలగాలి.
.

.
August 1968
.
The Ogre does what ogres can,
Deeds quite impossible for Man,
But one prize is beyond his reach:
The Ogre cannot master speech.
About a subjugated plain,
Among it’s desperate and slain,
The Ogre stalks with hands on hips,
While drivel gushes from his lips.
.
స్పందించండి