అనువాదలహరి

ఆగష్టు 1968… ఆడెన్, ఇంగ్లీషు-అమెరికను కవి

ఆ రాక్షసుడు రాక్షసులేం చెయ్యగలరో

అదే చేస్తాడు; అది మనుషులకి సాధ్యం కాదు;


కానీ ఒక అమూల్యవస్తువు మాత్రం వాడికి చిక్కదు:


రాక్షసుడు మాటను వశపరచుకోలేడు.


దాసోహం అన్న నేల మీద,


అక్కడి హతాసులూ, నిహతులూ మధ్య


ఆ రాక్షసుడు నడుం మీద చేతులేసుకుని


పెదాలంట చొంగకారుతుంటే అసహనంగా కదులుతుంటాడు.


.


వ్యుస్టన్ హ్యూ ఆడెన్ (W H Auden)


21 ఫిబ్రవరి- 29 సెప్టెంబరు 1973


బ్రిటిషు-అమెరికను కవి

.

ఈ కవిత కమ్యూనిష్టు రష్యా 1968 ఆగష్టు 20 వతేదీ రాత్రి తన వార్సా ఒప్పందంలోని ఇతర అనుచర దేశాలతో కలిసి చెకోస్లొవేకియా మీద జరిపిన దాడికి నిరసనగా రాసింది. కమ్యూనిష్టు దేశంగా ఉంటూనే, కొంత ప్రజాస్వామిక దృక్పథమూ, వాక్స్వాతంత్ర్యమూ, పత్రికలకి స్వేచ్ఛా మొదలైన అంశాలపై ప్రజల అభీష్టం మేరకు స్పందించి Prague Spring గా పిలవబడ్డ ఒక విప్లవాత్మకమైన ఆలోచనలకి కారకుడైన  అలెగ్జాండర్ డూబ్ చెక్ చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగింది.

అధికారానికి మించిన దాహం మరొకటిలేదు. రాచరికాల్లోనూ, ప్రజాస్వామ్యాల్లోనూ అయితే ఒక వ్యక్తితో తీరదు… అది వంశానుగతమై/ పరంపరాగతమై వర్ధిల్లాలి. చేవలేని నాయకులూ, ప్రమత్తులైన ప్రజలూ, యువతరం ఉన్నంతవరకూ మాట ఎప్పుడూ జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తుంది. కనీసం కవులైనా గొంతెత్తి తమ అభిప్రాయాల్ని ప్రకటించగలగాలి.

 

.

Portrait of W.H. Auden
Portrait of W.H. Auden (Photo credit: Wikipedia)

 

.

August 1968   

.

The Ogre does what ogres can,

Deeds quite impossible for Man,


But one prize is beyond his reach:

The Ogre cannot master speech.

 


About a subjugated plain,

Among it’s desperate and slain,

The Ogre stalks with hands on hips,

While drivel gushes from his lips.

.

W H Auden
21 February 1907 – 29 September 1973
British American Poet.

As the title suggests, this is a poem in protest against the invasion of Czechoslovakia by Russia on the night of 20th August 1968 to crush “Prague Spring”  a reform movement initiated by the First Secretary Alexander Dubcek which included among other things… freedom of speech, religion, and democratic elections.

Nothing can satiate a thirst like thirst for power. In democracies and aristocracies, if people and youth are not alert and there is no alternate leadership, it extends to perpertuating it for generations to come.  At least, the poet should be able to voice his opinion without any fretters.

 

%d bloggers like this: