అనువాదలహరి

మనుషులు … యెవెనీ యెటుషెంకో, రష్యను కవి, రష్యను కవి.

అంత ఆనాసక్తికరంగా ఏ మనుషులూ  ఉండరు
గ్రహాల్లాగే ప్రతివారి జీవితమూ ఒక ఇతిహాసమే.

అందులో వ్యక్తిగతం కానిదేదీ లేదు, అలాగని
ఏ గ్రహమూ మరోదానికి భిన్నంగానూ ఉండదు.

ఒక వ్యక్తి అజ్ఞాతంగా జీవించి
ఆ అజ్ఞాతంలోనే స్నేహితులను సంపాదించుకుని బ్రతికితే
ఆ అజ్ఞాతం కుతూహలంగా ఉండకపోదు.

ప్రతివ్యక్తికీ తన ప్రపంచం తనది
ఆ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షణమూ
అందులోనే ఒక విషాద సంఘటనా
అవన్నీ వ్యక్తిగతాలే.

ఏ వ్యక్తి మరణించినా, అతనితోపాటే పోతుంది
మొదటి హిమపాతపు అనుభూతీ, మొదటి ముద్దూ,
మొదటి పోట్లాటా అతనితో మరుగైపోతుంది.

ఇక మిగిలినవల్లా పుస్తకాలూ, వంతెనలూ
చిత్రాలు గీసిన కేన్వాసులూ, యంత్రాలూ…
ఇంకా మిగిలి ఉండడం వాటి విధిలిఖితం.
.
అయితే పోయినదేదీ విలువలేనిది కాదు:
ఆటలోని నిబంధనలప్రకారం ఒకటి పోతుంది. అంతే!
మనుషులుకాదు మరణించేది; ఒక్కొక్కరితో ఒక ప్రపంచం.

ఈ భూమ్మీద మనం దోషాలెంచే చాలామందిలో
వాళ్ళగురించి నిజంగా మనకి ఏమాత్రం తెలుసు?
ఫలానా వారి తమ్ముడు? ఒక మిత్రుడికి మిత్రుడు?
ఒక ప్రేమికకి ప్రేమికుడు? అంతేనా?

తల్లిదండ్రుల గురించి తెలుసనుకున్నవాళ్ళలో కూడా
మనకి అన్నీ తెలుసుగాని, ఏమీ తెలీదు.

వాళ్ళు మరణిస్తారు. మనం తిరిగి తీసుకు రాలేము.
ఆ రహస్య ప్రపంచాలు తిరిగి నిర్మించబడలేవు.

అన్నిటినీ వినాశనం చేయడం పట్ల అందుకే
ప్రతి సారీ, పదే పదిసార్లూ, విచారం వ్యక్తపరుస్తుంటాను.

.

యెవెనీ యెటుషెంకో

(18 July 1932 – )

రష్యను కవి, వ్యాసకర్తా, నవలా కరుడూ, నాటక కర్తా, నటుడూ, దర్శకుడూ, నిర్మాతా, స్క్రీన్ ప్లే రచయితా… ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఈ కవితలో నిజమైన హీరో సామాన్య మానవుడు. ఒక సమూహంలో ఉంటూనే, సమూహపు లక్షణాలు ఉంటూనే, తన ఉనికిని కూడ చాటుకుంటూ, అజ్ఞాతంగా చనిపోయినా, ఒక సామాన్యుడి జీవితం అంతపసలేనిదీ, విలువలేనిది కాదంటున్నాడు కవి. అంతే కాదు, మనుషులపట్ల, వాళ్ల జీవితాల విలువపట్లా ఏ మాత్రం సంకోచం లేకుండా తీర్పుచెప్పే మన మానసిక ప్రవృత్తిని వేలెత్తి చూపుతూ, ప్రతి వ్యక్తితోనూ, తిరిగి తీసుకురాలేని కాలశకలంతో పాటు, తిరిగి నిర్మించలేని ఒక ఇతిహాసం కూడా మరణిస్తుంది సుమా అని హెచ్చరిస్తున్నాడు.  మనకి తెలిసినవి మహా అయితే పైకి కనిపించే అనుబంధాలూ ఆత్మీయతలూ తప్ప, అతను అనుభూతిచెందినవి మనం ఎన్నడూ కనుక్కోలేము. అవి తెలియకుండా మనుషుల్ని విమర్శించడం తగని పని అని తాత్పర్యం.

.

.

People

.

No people are uninteresting.
Their fate is like the chronicle of planets.

Nothing in them in not particular,
and planet is dissimilar from planet.

And if a man lived in obscurity
making his friends in that obscurity
obscurity is not uninteresting.

To each his world is private
and in that world one excellent minute.

And in that world one tragic minute
These are private.

In any man who dies there dies with him
his first snow and kiss and fight
it goes with him.

There are left books and bridges
and painted canvas and machinery
Whose fate is to survive.

But what has gone is also not nothing:
by the rule of the game something has gone.
Not people die but worlds die in them.

Whom we knew as faulty, the earth’s creatures
Of whom, essentially, what did we know?

Brother of a brother? Friend of friends?
Lover of lover?

We who knew our fathers
in everything, in nothing.

They perish. They cannot be brought back.
The secret worlds are not regenerated.

And every time again and again
I make my lament against destruction.

.

Yevgeny Yevtushenko

(born 18 July 1932- )

Soviet Poet, novelist, essayist, dramatist, screenplay writer, actor, editor, and a director.

This is a great tribute to a ‘common man’.  Living amidst an indifferent society that takes no notice of his presence, he makes his own little world of isolation incognito, making his own friends and living his life full whatever be its worth.  The poet says that we are too eager to pass judgements on the value of their lives, and asks us what do we really know about them?  For that matter, the poet asks, what do we really know about our own parents about whom we think we know much. He argues that what all we know at best is only about the mundane relations and explicit passions. We can never know the real feelings they underwent in their lives.  The poet also says that with the death of each such individual, it is not a number of a population that is missing, but a world, an exclusive world, that can never be recreated.

%d bloggers like this: