అనువాదలహరి

మానవుడు …. విల్టన్ ఏగ్నూబారెట్, అమెరికను

నేను మహోన్నతమైన ఉక్కు వంతెనలమీంచి
గొప్ప నౌకలు ప్రయాణించిన సముద్రమార్గాలమీంచి
సుదూరంగా ఉన్న ఒక మహానగరం నుండి వచ్చాను;
జులై నెల కనువిందు చేసే మైదానాలను
తిలకిస్తూ రైలు మార్గాల ద్వారా వచ్చేను
మిరుమిట్లు గొలుపుతూ మనసుదోచిన
అనేక వస్తువులను చూస్తూ వచ్చేను;
ఆకాశాన్ని కూడా చూసేను.


వత్సా! ఇప్పుడు నీ దగ్గరకి వచ్చేను
ఈ ఊరి పక్కన మెల్లగా రైలు పోతుంటే,
త్రోవపక్కన గడ్డిలోంచి
నువ్వు తేరిపారచూస్తుంటే,
నీలికురుల ఆ తల్లి చేతులలోనున్నవాడా!
గుండెదాకా పెరిగినగడ్డిలో, ఎత్తిపట్టుకుంటే
నీ వెడల్పైన కళ్ళు బహుశా చూడొచ్చు
పక్కనించి పోతున్న ఈ సేవక మర మనిషిని. 


నువ్వు నా ముఖాన్ని చదువుతున్నావా?
ఈ వంతెనలూ, రైలుమార్గాలూ,
ఈ మహా నగరాలూ, నౌకలూ ,
కనుచూపుమేరా వ్యాపించిన ఈ పంటచేలే
గొప్పవనుకునే నిద్రలోంచి నన్ను లేపావు.


నువ్వు నా ముఖాన్ని పరీక్షిస్తున్నావా?
ఈ బరువైన పెట్టెలు గణగణ మోగుతుంటే
నీలో అకస్మాత్తుగా
నాకేదో మహత్వం కనిపిస్తోంది వత్సా!
ఆ తల్లి తన గుండెల మీద
నిన్నెత్తి పట్టుకుంటుంటే,
గడ్డిలోంచి పైకి తొంగి చూస్తున్న నువ్వు
నేనింతవరకు చూసిన అద్భుతాలన్నిటిలోకీ
మహాద్భుతానివి!

.

విల్టన్ ఏగ్నూ బారెట్

అమెరికను

.

ఇది చాలా రసవత్తరమైన కవిత. ఈ కవితా నిర్మాణమే చాలా అందంగా సాగుతుంది.  మనిషి సాధించిన విజయ పరంపరతో ప్రారంభమైన కవిత,  మనిషి తన విజయాలకి తాను దాసుడై,  అసలు సృష్టిలో తానే ఒక అద్భుతమైన వస్తువు అన్న విషయం మరిచిపోతున్నాడు.  మనిషి కేంద్రంగా సాగవలసిన ఆలోచనలు…  అభివృద్ధీ, సాంకేతికత, ఉత్పత్తీ, సంపదా…  కేంద్రంగా సాగుతున్నాయి. కవి ఎంత సున్నితంగా ఈ విషయాన్ని చెప్పేడో (చెప్పిందో) గమనించండి.

ఈ కవి గురించి ఎంత వెతికినా ఒక్క జాతీయత తప్ప మరి ఏ వివరాలు నాకు దొరకలేదు. నా అసమర్ధతకి చింతిస్తున్నాను.

.

The Man

 

.

 

I have come over bridges of steel

Over ways where I saw great ships

And a mighty city afar;

I have come over rails where I saw

The meadows of July

With myriads of rooted things

Flashing each a shining eye;

And I saw the sky.

Now I come to you, child,

Here by the town where the train moves slow,

And you stare from the wayside grass,

 You, in the dark-haired woman’s arms,

Held up in the bosom-tall grass

That your wide, wide eyes may see

The iron servant pass. . .

And do you read by my face

You have wakened me from my dream

Of the strength of bridges and rails,

The hugeness of cities and ships,

The wide existence of fields —

Do you give me a glance

Grown sudden majestic, O child,

As the heavy trucks clang by?

There on the woman’s breast.

You, held up out of the grass.

Are the mightiest thing I have seen!

.

Wilton Agnew Barrett

American

This indeed is a fantastic piece of a poem.  You can notice the beautiful structure of the poem: stating subtly the greatest inventions and achievements of man, the poet (or Poetess?) underlines how man has become a slave to his own achievements.  What should have bee a man-centric progress, or development, has now become a mania for creation of wealth, assets and treasures.  We cannot forget the underlying warning that man himself is one of the greatest wonders  here on earth. 

I deeply regret my inefficiency in providing any information about the poet except the nationality.  I deeply appreciate if anybody could throw some light.

 

%d bloggers like this: