అనువాదలహరి

XXXIV… ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి

Dolichonyx oryzivorus
Dolichonyx oryzivorus (Photo credit: Wikipedia)

ప్రకృతి అంటే మనం దర్శించేది,
ఈ పర్వతాలూ, ఈ మధ్యాహ్నాలూ,
ఆ ఉడతా, ఈ గ్రహణాలూ,  ఆ తుమ్మెదా,
కాదు కాదు…. ప్రకృతి అంటే స్వర్గమే.

ప్రకృతి అంటే మనం వినేది,
ఆ బాబొలింక్* ఈ సంద్రఘోష,
ఆ ఉరుములూ, ఆ కీచురాయీ,
ఓహ్, కాదు… ప్రకృతి అంటే స్వరసాయుజ్యమే.

ప్రకృతి అంటే మనకి పరిచయమున్నదే
కానీ దాన్ని వివరించగల కళ మనకి లేదు
దాని నిరాడంబరతముందు
మన జ్ఞానమంతా నిర్వీర్యమే.
.

ఎమిలీ డికిన్సన్

(December 10, 1830 – May 15, 1886)
అమెరికను కవయిత్రి

Notes:

* బాబొలింక్ అన్నది  చక్కగా పాడే ఒక ఉత్తర అమెరికను పక్షి (Dolichonyx oryzivorus).  శీతకాలంలో దక్షిణానికి పోతుంది.

.

Emily dickinson
Emily Dickinson (Photo credit: Wikipedia)

XXXIV

.

Nature is what we see,
The Hill, the Afternoon–
Squirrel, Eclipse, the Bumble-bee,
Nay–Nature is Heaven.

Nature is what we hear,
The Bobolink, the Sea–
Thunder, the Cricket–
Nay,–Nature is Harmony.

Nature is what we know
But have no art to say,
So impotent our wisdom is
To Her simplicity.

.

Emily Dickinson

(December 10, 1830 – May 15, 1886)

American

Poem Courtesy:

http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: