బేయార్డ్ టేలర్ … హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
పుస్తకాలలో జీవన్మృతుడతడు
అతని చూపుల్లో ప్రభువు వీక్షణాల ప్రశాంతత.
1మేక్జిమిలియన్ సమాధిస్థలాన్ని
విగ్రహాలు విచారవదనాలతో తిలకిస్తుంటే…
ఈ పుస్తకాలదొంతరలు కూడా బీరువా అరల్లోంచి
తమలాగే మౌనంగా ఉన్న అతన్ని పరికిస్తున్నాయి
అయ్యో! అతని చేతులు ఇక ఎన్నడూ
భద్రపరచిన తమ పుటల్ని తిరగెయ్యవు కదా!
తమ పాటలు ఎంత మధురంగా ఉన్నా,
ఆ పెదవులు ఇకెన్నడూ పలుకబోవు కదా!
జీవం లేని ఆ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి!
దాని అతిథి, దాన్ని వదలి ఎక్కడికో వెళిపోయాడు;
బాటసారి సాయంత్రం దాకా కూడా నిలవలేక,
రహదారి సత్రం విడిచివెళ్ళడానికి తొందరపడినట్టు.
ఓ బాటసారీ! ఏ దూర తీరాల్లో
ఏ గ్రహం మీద, ఏ నక్షత్ర సీమల్లో,
ఏ విశాల వినీల రోదసీ గగనాలలో
నీ వదనంపై ఇపుడు కాంతి ప్రసరిస్తోంది?
ఈ రాత్రికి ఏ ఆనందోద్యానాలలో
సొలసిన నీ పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి?
ఓ కవీ! నీ తాజా కవితని మాలగా
పార్థివ శరీరంపై ధరించినవాడా;
2డ్యూకాలియన్ జీవితాన్ని నీ జీవితంగా
కంచుకంఠంతో ఆలపించిన వాడా!
ఎలాగైతేనేం, గతకాలపు శిధిలాలపై
చివరకి, ఒక మచ్చలేని పువ్వు విరియబోతోంది.
మిత్రమా! నిన్నటికి నిన్న నీకు వీడ్కోలిస్తూ
గంటలు గణగణ మోగేయి
సముద్రాలకావల విగతజీవుడవైన నీకోసం
అవే గంటలు శోకంతో గద్గదమౌతున్నాయి.
నీ పుస్తకాల మధ్య నిద్రించే నీ ముఖంపై
ప్రభువు ప్రసన్న వీక్షణాలు నిలుచుగాక .
.
హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో
(February 27, 1807 – March 24, 1882)
అమెరికను కవి.
ఇది ఒక సమకాలీన కవికి వేరొక కవి అరుదుగా రాయగలిగిన స్మృతిగీతం. మనసున్న నివాళి. జీవిత కాలంలో ఎన్నో ప్రదేశాలు చూసి, సముద్రయానాలు చేసిన బేయార్డ్ టేలర్ అనుభవాన్ని పురస్కరించుకుని, ఇందులో రెండు ముఖ్యమైన చారిత్రక ప్రతీకలు కూడా వాడేడు లాంగ్ ఫెలో. కవిని ఎంత అందంగా సంబోధించేడో చూడండి.
Notes:
1: “మేక్జిమిలియన్ సమాధిస్థలాన్ని
విగ్రహాలు విచారవదనాలతో తిలకిస్తుంటే…”
మేక్జిమిలియన్ 1 రోమను చక్రవర్తి తన అంత్యక్రియలలో తన పూర్వ వంశజులు, బంధువులూ చూడాలని 40 విగ్రహాలను చెక్కించడానికి ఆజ్ఞాపించాడట. అయితే అతని జీవితకాలంలో అన్నీ తయారు కాలేదు. ఈ విషయమై ఇతరవివరాలకి, ఈ క్రిందిలింకు చూడండి…
http://www.readingwoman.org/en/cols/2008/11.html
2 డ్యూకాలియన్ జీవితాన్ని నీ జీవితంగా
కంచుకంఠంతో ఆలపించిన వాడా!
గ్రీకు పురాణగాథలలో డ్యూకాలియన్ జీవితం గురించి, ఈ క్రిందిలింకు చూడండి.. http://en.wikipedia.org/wiki/Deucalion
.

.
Bayard Taylor
Dead he lay among his books!
The peace of God was in his looks.
As the statues in the gloom
Watch o’er Maximilian’s tomb,
So those volumes from their shelves
Watched him, silent as themselves.
Ah! his hand will nevermore
Turn their storied pages o’er;
Nevermore his lips repeat
Songs of theirs, however sweet.
Let the lifeless body rest!
He is gone, who was its guest;
Gone, as travellers haste to leave
An inn, nor tarry until eve.
Traveller! in what realms afar,
In what planet, in what star,
In what vast, aerial space,
Shines the light upon thy face?
In what gardens of delight
Rest thy weary feet to-night?
Poet! thou, whose latest verse
Was a garland on thy hearse;
Thou hast sung, with organ tone,
In Deukalion’s life, thine own;
On the ruins of the Past
Blooms the perfect flower at last.
Friend! but yesterday the bells
Rang for thee their loud farewells;
And to-day they toll for thee,
Lying dead beyond the sea;
Lying dead among thy books,
The peace of God in all thy looks!.
.
HW Longfellow
(February 27, 1807 – March 24, 1882)
American Poet
This is a rare and passionate tribute paid to a fellow poet by another contemporary poet. For the bio of Bayard Taylor please visit: http://en.wikipedia.org/wiki/Bayard_Taylor
Notes:
“As the Statues in the gloom
watch over Maximilian’s Tomb”
For the relevance of statues overseeing Maximilian’s tomb please visit:http://www.readingwoman.org/en/cols/2008/11.html