అనువాదలహరి

నువ్వు పోయావని విన్నాక… విల్టన్ ఏగ్నూ బారెట్, అమెరికను

నువ్వుపోయావని విన్నాక
నేను ఆశ్చర్యాన్ని ప్రకటించడం మినహా నోట మరోమాట రాలేదు:
మనిద్దరం విడిపోయి చాలా కాలం అయిపోయింది,
ఇన్నేళ్ళూ నీపట్ల చాలా ఉదాసీనంగా ప్రవర్తించేను.
నువ్వు వెళ్ళిపోయావన్న బాధ నాలో క్రమంగా కోపం నింపింది.
ఒకప్పుడు నువ్వు నాకిచ్చిన ఒక పువ్వు…
అదే, నే పోగొట్టుకున్న పుస్తకంలో పదిలంగా దాచుకున్న గులాబి…
దానిమీద పాట అల్లడానికి ప్రయత్నించేను…
నేను నీపట్ల క్రూరంగా ప్రవర్తించేను,
మిగతా ప్రపంచం నుండి కూడ అంతకుమించి నీకేం దొరకలేదు,
నాకు కోపం రావడానికి కారణం అదే.
సరే,  మనం ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు
పోయినవాళ్ళని అభిమానిస్తారు,  వాళ్ళకి కళంకం రాకుండా.
వాళ్ళంటే  చాలా  అభిమానంగా ప్రవర్తించవచ్చు
వాళ్ళు మనదగ్గరకి మరి రారుకదా అన్న తలపుతో.
నాకూ నీ గురించి ఆలోచనలున్నాయి.
నీ స్మృతిలో చెప్పుకుందికి జ్ఞాపకాలున్నాయి
నువ్వు ఎంత అందంగా ఉండే దానివో, ఎంత అపురూపమైనదానివో
చెప్పుకుని నీకై విలపిస్తాను.
మనిద్దరం పిల్లలుగా ఉన్నప్పుడు
ఇసుకతిన్నెలలో నాతో ఆడుకున్న నువ్వు, ఇంతకీ ఎక్కడ ఉన్నావు?
ఆడపిల్లవైనా, దృఢంగా, పొట్టిగా ఉన్న నీ ఆకారమూ
చేతిలోచెయ్యివేసినపుడు బిగువైన నీ పట్టూ
నిజాయితీ తొణికే నీ కళ్ళూ,
నీ చిన్ని నుదురు ముంగిట సన్నగా తేలియాడే
లేత గోధుమరంగు ముంగురులూ …నాకు గుర్తే.
నాకింకా గుర్తే,
కదలినురుగులో తడిసివస్తూ నువ్వు బంతిపట్టుకోడం
మొరటుకుర్రాడ్ని పట్టుకున్నట్టు.
నాకు తెలుసు మృత్యువు నిను తనగుప్పెట్లో పెట్టుకుంది.
బహుశా, నువ్వు చనిపోయినందుకు సంతోషించే ఉంటావేమో కూడా,
ఒంటరిగా, దుఃఖంతో బయటికి వెళ్ళి
కలలన్నీ నలిగి మాడి మసైపోయినపుడు…
అంత సౌకుమార్యమూ, స్నేహశీలతా, నిజాయితీ,
అంత గుండెదిటవుతోనూ జీవించడం  చాల కష్టం.
మృత్యువు నిన్నుకబళించడానికి కుట్రపన్నకపోతే
నువ్వు అన్నీ మరిచిపోయేదాని వేమో!
ఆత్మలన్నీ మనుషుల్లా శాశ్వతంగా కేరింతలాడే  
వేడీ, వెలుగుల పురాతన సముద్ర తీరానికి వస్తే
యువహృదయాలని గిలిగింతలు పెట్టిన ఓ నీలికళ్ళదానా!
బహుశా, నువ్వు అక్కడ నాకు తారసపడతావేమో!  
.

విల్టన్ ఏగ్నూ బారెట్

అమెరికను 

అపురూపమైన ఈ కవి (కవయిత్రి) గురించి ఏ సమాచారమూ ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను

.

When I Heard You Were Dead

.

When I heard you were dead,

I had little more than a startled word to give;

We had been too long apart,

And all the years I had been cold to you.

But the pity and pain of your leave-taking filled me with slow resentment.

Once I would have cared to make a song

About a flower you gave me—

An old rose shut in a book that is lost.

I was cruel to you,

And you had nothing better from the rest of the world;

That is what made me angry.

Well, we can love the dead in our own way

And not hurt them;

We can be very tender, knowing well

They will not come back to us.

I have thoughts for you now,

I have words of bereavement;

I see how lovely and rare you were

And cry out after you.

Where are you now, whom I played with on the sands when we both were young?

I remember your girl’s body stocky and strong,

Your little hard hand-clasp,

Your truthful eyes,

Your corn-pale dancing hair

Growing low on your small forehead.

I remember you, wet from the surf, catching ball like a rough boy.

I know death has you;

That very likely you were glad to die,

Going out lonely and in bitterness,

With your dreams all crunched to black dust …

Too strong for life, too honest, too friendly and too tender.

I hope, if the grave has not conspired to hold you,

You have forgotten about all that.

I hope, if I could come to an old sea-beach white and sunny,

Where spirits immortally human played,

I would find you there, O gray eyes—the laughing comrade of boys!

.


Wilton Agnew Barrett

American

Poem Courtesy: http://www.bartleby.com/300/1036.html

A Magazine of Verse. Volume X. No. 5. August, 1917

Ed.: Harriet Monroe, (1860–1936).

I deeply regret that I am unable to furnish any information about this wonderful Poet / Poetess.

%d bloggers like this: