కాలశకలాలని ఏర్చికూర్చాను, గతచరిత్రని కథనం చేద్దామని,
ఎంతప్రయత్నించినా అవి ఉదాత్తమైన చరిత్రగా మలచబడటం లేదు.
5
నా చుట్టూ వర్ణమాలవంటి సుందర స్నేహ వదనాలున్నాయి
కానీ ఏదీ ఓదార్చగల పదంగానీ,
సాంత్వననివ్వగల మాటగానీ పలకడం లేదింకా…
పలకడం లేదింకా…
.
శ్రీనివాస్ వాసుదేవ్
తెలుగు
ఇండియన్
( స్వేచ్చానువాదం. )
.
ఈ కవిత చదవగానే (అందుకే అనువాదంలో కూడా ఆ మాటలే కనిపిస్తాయి) నాకు వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి ముచ్చటైన మూడు పద్యాల “ఆశాగానము” అన్న ఖండికలోని మొదటి పద్యం గుర్తొచ్చింది. అందులో సందర్భం ఇక్కడి సందర్భమూ వేరనుకొండి. అక్కడ జీవుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మిత్రుడికి తన అసహాయత ప్రకటిస్తున్నాడు.
వేదుల వారి పద్యం ఇది:
ఏ సడి లేక ఈ ప్రకృతియెల్ల గభీర నిశానిబద్ధమై నీ సుకుమార హస్తముల నిద్దురవోయెడిమౌనవేళ, నీ వే, సరిజేసి ఈ శిధిలవీణను పాడుమటంచు నాపయిన్ ద్రోసెదవేల, తీగ తెగునో, శృతిదప్పునొ, పల్కదో ప్రభూ!