ఋణం… సారా టీజ్డేల్, అమెరికను
ఎన్నాళ్లనుండో నన్నింత గాఢంగా ప్రేమిస్తున్నావు కదా
నీకు నేనేమి ఋణపడి ఉన్నాను?
నువ్వెన్నడూ నా ఊహలకి రెక్కలు తొడగలేదు
నా మనసులో కూనిరాగాన్నైనా పలికించలేదు.
కానీ, ఓ, నేను ప్రేమించినతనికా?
అతను నన్నసలు ప్రేమించనే లేదు.
స్వర్గం లోకి దారితీసే ఆ చిన్న ద్వారం ఉందే
అదీ నేనతనికి బాకీ పడ్డాను.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి.
.

.
Debt
.
What do I owe to you
Who loved me deep and long?
You never gave my spirits wings
Nor gave my heart a song.
But oh, to him I loved,
Who loved me not at all,
I owe the little gate
That led through heaven’s wall.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
Poem Courtesy: http://www.bartleby.com/300/212.html
A Magazine of Verse, Ed. Harriet Monroe, (1860–1936).
.