నెల: నవంబర్ 2013
-
A Shooting Star … Manasa Chamarti, Telugu, Indian
If he were a jungle She wanted to nestle in his heart like a jingle of verdure If he were a Sea She wanted to dissolve like a drop of rain in his expanse Had he teased her like the sky She wanted to give a peck on his cheek like a star. […]
-
ఆగష్టు 1968… ఆడెన్, ఇంగ్లీషు-అమెరికను కవి
ఆ రాక్షసుడు రాక్షసులేం చెయ్యగలరో అదే చేస్తాడు; అది మనుషులకి సాధ్యం కాదు; కానీ ఒక అమూల్యవస్తువు మాత్రం వాడికి చిక్కదు: రాక్షసుడు మాటను వశపరచుకోలేడు. దాసోహం అన్న నేల మీద, అక్కడి హతాసులూ, నిహతులూ మధ్య ఆ రాక్షసుడు నడుం మీద చేతులేసుకుని పెదాలంట చొంగకారుతుంటే అసహనంగా కదులుతుంటాడు. . వ్యుస్టన్ హ్యూ ఆడెన్ (W H Auden) 21 ఫిబ్రవరి- 29 సెప్టెంబరు 1973 బ్రిటిషు-అమెరికను కవి . ఈ కవిత కమ్యూనిష్టు రష్యా […]
-
మిన్నోలు (నెత్తళ్ళు) … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఆ వంపునుండి ఎంత సడిలేకుండా పారుతోందీ నీరు; ఈ వేలాడుతున్న సాలవృక్షాలకొమ్మల్లో పిసరంత గుసగుసలైనా చెయ్యదు; వెలుగునీడలు ఆ గడ్డి పరకలమీంచి నెమ్మదిగా పాకురుతూ పోతున్నాయి— ఎంత నెమ్మదంటే, ఆ గులకరాళ్ళ తిన్నెలమీద ప్రవాహం చేరి ఒక జీవిత సత్యాన్ని బోధించే లోపు మనం రెండు సానెట్లు చదువుకోవచ్చు. అక్కడికి నెత్తళ్ళు గుంపులుగా వచ్చి తలలు పైకెత్తుతాయి ప్రవాహానికి వ్యతిరేకంగా తమ శరీరాలు నిలిపి నీటి తాకిడికి చల్లబడిన సూర్యకిరణాలని ఒక్క సారి తనివిదీరా ఆస్వాదించడానికి… ఆనందపారవశ్యంలో […]
-
మనుషులు … యెవెనీ యెటుషెంకో, రష్యను కవి, రష్యను కవి.
అంత ఆనాసక్తికరంగా ఏ మనుషులూ ఉండరు గ్రహాల్లాగే ప్రతివారి జీవితమూ ఒక ఇతిహాసమే. అందులో వ్యక్తిగతం కానిదేదీ లేదు, అలాగని ఏ గ్రహమూ మరోదానికి భిన్నంగానూ ఉండదు. ఒక వ్యక్తి అజ్ఞాతంగా జీవించి ఆ అజ్ఞాతంలోనే స్నేహితులను సంపాదించుకుని బ్రతికితే ఆ అజ్ఞాతం కుతూహలంగా ఉండకపోదు. ప్రతివ్యక్తికీ తన ప్రపంచం తనది ఆ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షణమూ అందులోనే ఒక విషాద సంఘటనా అవన్నీ వ్యక్తిగతాలే. ఏ వ్యక్తి మరణించినా, అతనితోపాటే పోతుంది మొదటి హిమపాతపు […]
-
లిన్ మౌత్ విడో… అమీలియా జోసెఫ్ బర్, అమెరికను
అతను పొడవుగా బలిష్ఠంగా ఉండేవాడు, అతని కళ్ళు వేసవి పొద్దు దిగంతాలకొసల నింగీ, కడలీ కలిసినంత నీలంగా ఉండేవి. నను పెళ్ళి చేసుకున్నపుడు అతని బుగ్గల ఎరుపుముందు ఆ ఎర్రని కొండశిఖరాల రంగు వెలవెలబోయింది. ఆ పిచ్చుకలు కాపురముండే వసారా దాటేము ఆ చిన్న కావిరంగు చర్చిని వీడి బయటకి వచ్చేము, అవసరం లేకపోయినా, అతని భుజానికి ఆనుకున్నాను కేవలం అతని దారుఢ్యాన్నీ, అనునయాన్నీ ఆస్వాదించడానికే. ఒక్కటి మాత్రం ఎంతప్రయత్నించినా మరిచిపోలేకున్నాను; నేను ప్రార్థన చేద్దామనుకున్నపుడల్లా గొంతు […]
-
ననుగన్న తల్లీ!… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి.
(ఈ రోజు మా అమ్మ పవిత్ర దినం. ఆ స్మృతిలో తల్లులందరికీ కృతజ్ఞతలతో) Note: కొన్ని అనివార్యకారణాలవల్ల ఇక్కడ ఈ రోజు ముందు ఉంచిన పోస్టు తొలగించి ఈ కొత్తది ఉంచడమైనది. . ఊహకందని ఎత్తులోని కొండమీద నన్ను ఉరితీసినా నను గన్న తల్లీ! ఓ నన్ను గన్న తల్లీ! ఎవరి ప్రేమ నన్ను వెంబడిస్తుందో తెలుసు, నను గన్న తల్లీ! ఓ నను గన్న తల్లీ! లోతైన సముద్రంలో నన్ను ముంచి వేసినా, నను గన్న […]
-
కవిత్వం… గ్రెగ్ కుజ్మా, అమెరికను
పాత కవిత్వ రూపాలు పిట్టలగూళ్ళలాంటివి అవి ఎంతకాలంగా వాడుకలో ఉన్నాయంటే వాటినిండా రెట్టలే; కొన్ని అరుదైన పక్షులు మాత్రమే ఆ ద్వారాల్లోంచి దూరి లోనకీ బయటకీ రాగలవు. అవికూడా లోపల అంత స్వేచ్ఛగా తిరగలేవు; ఏదో పాత స్వరాలనే వర్లిస్తుంటాయి, వాటిని ఆ కంపు ఎక్కడా తాకనైనా తాకదు. కానీ ఏం లాభం? అవి ఆ గూళ్ళకే పరిమితమై ఉండిపోతాయి. వాటిలోంచి ఎప్పుడైనా కూజితాలు వినవస్తాయేమోనని చెవులు రిక్కించి వింటాయి. ఆశించినట్టు వినిపిస్తాయి కూడా. . గ్రెగ్ […]
-
Metaphysical … Bhaskar Kondreddy, Telugu, Indian.
When she is dragged along the rough gravel and dirt village road tying her legs to a rope without concern What bitch can offer her teats to the pitiful pups following their mother ? They were by her side till yesterday vying with one another and rolling playfully one over the other Teasing and […]
-
ఏదీ రెండుసార్లు జరగదు… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి.
ఏదీ రెండుసార్లు జరగదు. దానివల్ల, విచారించవలసిన పర్యవసానం మనం ఇక్కడకి ఉన్నపాటుగా వచ్చేస్తాము, సాధన చేసే అవకాశం లేకుండా వెళిపోతాము. మనకంటే తెలివితక్కువవాడు లేడనుకున్నా ఈ భూమ్మీద మనమే చవట రాచ్చిప్ప అనుకున్నా వచ్చే సెమిస్టరులో పరీక్షకి కూర్చుందికి లేదు ఈ పాఠం ఈ ఒక్కసారే బోధించ బడుతుంది. ఏ రోజూ నిన్నని అనుకరించదు. ఏ రెండు రాత్రుళ్ళూ బ్రహ్మానందమటే ఏమిటో సరిగ్గా ఒక్కలా చెప్పలేవు సరిగ్గా అవే ముద్దులతో. బహుశ ఏ పనీ లేనివాడు ఒకడు […]
-
Ethereal Vision of the Melody … Swatikumari, Telugu, Indian
Heralding the day, The statues and the ruins, The Sea and the City. Making the dawns pleasantly quiver Was he heard on the flute Following the wakes of melodies In the lake of serene air I searched for and found him… Did I find him really? No, he deigned to appear. When he […]