అనువాదలహరి

కోరిక పుట్టుక, పెంపూ … ఎడ్వర్డ్ డి వేరె , ఎర్ల్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, ఇంగ్లండు

నువ్వు ఎప్పుడు పుట్టావు కోరికా?

వసంత ఋతు శోభ ఉద్దీపించినపుడు

అందమైన చిన్నోడా, నీ జన్మకారకులెవరు?

ఏమో, ఊహ అని మాత్రం అందరూ అంటుంటారు.

మరి నిన్ను పోషిస్తున్నదెవరు?

ఆనందమలదిన యవ్వనం.

మరి నీ భోజనం మాటో?

చికాకుపెట్టే వేడి నిట్టూర్పులు

మరి నీ దాహం తీరేదెలా ?

ప్రేమికుల కపటంలేని కన్నీళ్ళు తాగి

నిన్ను ఏ ఊయలలో ఊచారో?

ఏ భయమూ లేని ఆశల ఊయలలో

మరి నీకు నిద్రపుచ్చడమెలా?

మనుషులందరూ ఇష్టపడే కమ్మని కబుర్లు

మరి ఇప్పుడు నీ బస ఎక్కడ?

అమాయక హృదయాలలో

నీకు స్నేహితులంటే చిరాకా?

చిరాకే, చాలా సార్లు.

మరి ఎవరితో తిరగాలనుకుంటావు?

ఒంటరిగా ఆలోచనలలో పడేవాళ్లతో

నీకంటికి ఏది ఇంపుగా కనిపిస్తుంది ?

నేనంటే అభిమానించేవాళ్ళు.

నీకు అందరిలోకీ ఎవరంటే శత్రుత్వం?

నా అభిమానాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళంటే

వయసు గాని, మృత్యువుగాని నిన్ను నశింపచేయగలదా?

ప్రసక్తి లేదు. నేను రోజుకి కొన్ని వేలసార్లు పుడుతూ గిడుతుంటాను.

.

ఎడ్వర్డ్ డి వేరె

(12 April 1550 – 24 June 1604)

17 వ ఎర్ల్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, ఇంగ్లండు

ఈ కవిత వయసు సుమారు 500 సంవత్సరాలంటే నమ్మశక్యం కాదు… అందులో వస్తువుకీ, ఆ భావనా సరళతకీ, పదాల ఆధునికతకీ.

ఇందులో సంభాషణపూర్వకంగా కవిత సాగుతూనే అందులో వ్యంగ్యమూ, సహజోక్తీ స్పష్టంగా కనిపించేటట్టు సమర్థవంతంగా నిర్వహించేడు కవి.

.

Portrait of Edward de Vere - 17th Earl of Oxfo...
Portrait of Edward de Vere – 17th Earl of Oxford – after lost original 1575 (Photo credit: Wikipedia)

.

Of the birth and bringing up of Desire

 

.

 

When wert thou born, Desire? 

In pomp and prime of May.

By whom, sweet boy, wert thou begot? 

By Good Conceit, men say.

Tell me, who was thy nurse? 

Fresh Youth, in sugared joy.

What was thy meat and daily food? 

Sore sighs, with great annoy.

What had you then to drink? 

Unfeignëd lovers’ tears.

What cradle were you rockëd in? 

In hope devoid of fears.

What brought you then asleep?

Sweet Speech, which likes men best.

And where is now your dwelling-place? 

In gentle hearts I rest.

Doth company displease?

 It doth, in many one.

Where would Desire then choose to be? 

He likes to muse alone.

What feedeth most your sight? 

To gaze on favor still.

Who find you most to be your foe? 

Disdain of my good will.

Will ever age or death bring you into decay?

No, no!  Desire both lives and dies a thousand times a day.

 

.

 

Edward de Vere, 17th Earl of Oxford, 

(12 April 1550 – 24 June 1604)

England

 

Poem Source: http://www.luminarium.org/renlit/whenwert.htm

%d bloggers like this: