అనువాదలహరి

వర్ణన… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

జార్జి “దేముడు పొట్టిగా లావుగా ఉంటాడు,” అన్నాడు.

 


నిక్ “లేదు, సన్నగా పొడవుగా ఉంటాడు,” అన్నాడు.

 


“అతనికి తెల్లని పొడవాటి గడ్డం ఉంటుంది,” అని లెన్ అంటే

 


“లేదు, అతను నున్నగా గడ్డం గీసుకుని ఉంటాడు,” అన్నాడు జాన్.

 


విల్ “అతను నల్లని వాడు,” అంటే, “కాదు, తెల్లని వాడు” అన్నాడు బాబ్.

 


రోండా రోజ్ అంది: “దేముడు పురుషుడు కాదు, స్త్రీ.”

 


నాలో నేను నవ్వుకున్నాను గాని, దేముడు స్వయంగా సంతకం చేసి

 


నాకు పంపిన ఫోటోని వాళ్ళకెవ్వరికీ చూపించలేదు.

 


.

 


షెల్ సిల్వర్ స్టీన్

 


(September 25, 1930 – May 10, 1999)

 


అమెరికను కవి 

 

 

ఈ చిన్న కవితలో మంచి చమత్కారం చూపించేడు కవి.  నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణించమంటే దాన్ని తడుముతూ ఎవరికి ఏ అవయవం దొరికితే అదే ఏనుగు అని  వర్ణించినట్టు, భగవంతుణ్ణి ఎవరికి నచ్చినరీతిలో వాళ్ళు ఊహించుకుంటారు. స్వామి వివేకానంద, ఒకవేళ బర్రెలకు గాని భగవంతుడు గురించి ఊహ వస్తే, వాటి భగవంతుణ్ణి  వెయ్యి కొమ్ములున్న బర్రెగా ఊహించుకుంటాయని చెప్పినమాట ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఊహలూ ఉత్ప్రేక్షలూ భగవంతుడిని వర్ణించడంలో మనం సహజంగా చేసే పనులు.

 

ప్రకృతిలోని వస్తువుల్ని మనమాటలు  ఎంతగా వివరించడానికి ప్రయత్నించినా, మనమాటలుమించి అవి ఉంటాయి తప్ప, మన మాటలపరిమితులకి అవిలోనుగావు.(Our descriptions are only an approximation to the Truth and Truth is not constrained by our description of it.  That is the very limitation of language. So we need not over-value our descriptions of Truth  ఇక్కడ భాష సత్యానికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది తప్ప, సత్యం భాషకు దగ్గరగా రాదు.  ఇది భాషకీ భావానికీ ఉన్న పరిమితి అని అర్థం చేసుకున్నవారు, సత్యాన్ని దర్శించడానికి అవకాశం ఉంది.  ఈ విషయాన్ని కవి చాలా సున్నితంగా చెప్పాడు ఈ కవితలో.

 

 

.

 

 

Shel Silverstein
Shel Silverstein (Photo credit: Wikipedia)

 

.

 

 

Description

 

 .

 

 

George said, “God is short and fat.”

 

Nick said, “No, He’s tall and lean.”

 

Len said, “With a long white beard.”

 

“No,” said John, “He’s shaven clean.”

 

Will said, “He’s black,” Bob said, “He’s white.”

 

Rhonda Rose said, “He’s a She.”

 

I smiled but never showed ’em all

 

The autographed photograph God sent to me.

 

.

 

 

Shel Silverstein

 

 

(September 25, 1930 – May 10, 1999)

 

 

American poet, singer-songwriter, cartoonist, screenwriter, and author of children’s books.

 

 

He styled himself as Uncle Shelby in his children’s books. Translated into more than 30 languages, his books have sold over 20 million copies.

 

%d bloggers like this: