ఎపుడో…… ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి

చక్కని కాంతులీను ఒక ఆమని పగటివేళో

లేక మంచు పొడిగారాలే  సుదూర హేమంతవేళో,

ఏ ఆనందఛాయలూలేని  శూన్యశిశిర వేళో…

ఏదో రోజు మృత్యువు నన్ను సమీపిస్తుంది.

 

.

అన్ని రోజుల్లాగే బాధేసుఖమనిపించిన రోజునో,

గతంలోమాదిరి ఏ సందడీలేని రోజునో

నేటికీ రేపటికీ నకలుగా ఉండే రోజునో

మృత్యువు నన్ను సమీపిస్తుంది.

 

.

నా కళ్ళు మసకచీకటి మార్గాలకి అలవాటుపడతాయి

నా చెంపలు చల్లబడి కళతప్పిన పాలరాయిలా ఉంటాయి

ఉన్నట్టుండి నిద్ర నన్ను ముంచెత్తుతుంది.

నొప్పితో నే వేసే పెనుకేకలు ఒక్కసారిగా సద్దుమణుగుతాయి.

 

.

కవిత్వ వివశత్వం నుండి విడిపడ్డ నా చేతులు

మెల్లమెల్లగా  కాగితాలమీంచి జారిపోతాయి

ఒక్క లిప్తపాటు జ్వలిస్తున్న కవిత్వరుధిరాన్ని

ఈ చేతుల్లో పట్టుకున్నాను కదా అన్న స్పృహ కలుగుతుంది.

.

భూదేవి తన రెండు చేతులతో తనలోకి ఆహ్వానిస్తుంది

నన్ను సమాధిలో దించడానికి జనాలు గుమిగూడుతారు

బహుశా, ఏ అర్థ రాత్రో, నా ప్రేమికులు

నా మీద ఎన్నో గులాబిదండలు ఉంచుతారు.

 

.

ఫరూవే  ఫరుక్జాద్

January 5, 1935 — February 13, 1967

పెర్షియన్ కవయిత్రి

Foroogh Farokhzad, Iranian poet

ఫరూవే  ఫరుక్జాద్

20వ శతాబ్దపు ఇరానియన్ కవయిత్రులలో అతిప్రతిభావంతమైన, శక్తివంతమైన గొంతుకలలో ఫరూవే ఫరక్జాద్ ఒకరు. విడాకులు తీసుకున్న స్త్రీగా, ఛాందస భావాలను తొసిరాజంటూ శక్తివంతంగా చెప్పిన ఆమె కవిత్వం అనేక వ్యతిరేకతలని ఎదుర్కొని బహిరంగంగా గర్హించబడింది కూడ.

కవులు ఆమె జీవితం నుండి నేర్చుకోవలసినదీ, అనుకరించవలసినదీ ఎంతైనా ఉంది. కవిత్వాన్ని జీవితంలో ఒక భాగంగా చూసిన ఆమె జీవితంలో రెండు చక్కని ఉదాహరణలు: ఒకటి కుష్టువ్యాధితో బాధపడుతున్న ఇరానియన్లపై ఆమె 1962 లో  The House is Black అన్న పేరుతో తీసిన డాక్యుమెంటరీ 12 రోజుల చిత్రీకరణలో ఇద్దరు కుష్టురోగుల పిల్లడికి చేరువై అతణ్ణి దత్తత తీసుకోవడం; రెండు:  పిల్లల స్కూలుబస్సును ఢీకొనకుండా ఉండేందుకు తనజీపును పక్కకితప్పిస్తూ రాతిగోడను గుద్దుకుని ప్రాణాలు విడవడం.

The Captive (1955), The Wall, The Rebellion,  Another Birth (1963) అన్న కవితా సంకలనాలు వెలువరించింది. ఆమె మరణానంతరం ప్రచురితమైన Let us believe in the beginning of the cold season  పెర్షియన్ భాషలో అత్యుత్తమ ఆధునిక కవితగా కొందరు కొనియాడేరు. ఆమె కవిత్వం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, తుర్కిష్, మొదలైన అనేక భాషలలోకి అనువదించబడింది.

.

Later On

.

My death will come someday to me

One day in spring, bright and lovely
One winter day, dusty, distant
One empty autumn day, devoid of joy.

My death will come someday to me
One bittersweet day, like all my days
One hollow day like the one past
Shadow of today or of tomorrow.


My eyes tune to half dark hallways

My cheeks resemble cold, pale marble
Suddenly sleep creeps over me
I become empty of all painful cries.


Slowly my hands slide o’er my notes

Delivered from poetry’s spell,
I recall that once in my hands
I held the flaming blood of poetry.


The earth invites me into its arms,

Folks gather to entomb me there
Perhaps at midnight my lovers
Place above me wreaths of many roses.

.

Forugh Farrokhzad

(January 5, 1935 — February 13, 1967)

Persian Poetess

( Courtesy: http://www.forughfarrokhzad.org/selectedworks/selectedworks1.asp)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: