నువ్వు
బంగారు రంగు చివురులు తొడుగుతూ
తిన్నగా ఎదుగుతూ కొమ్మలతో ఊగిసలాడే
చిన్ని బాదాం (1) చెట్టు మొలకవి .
నీ నడక కొండగాలికి రివ్వున
కొమ్మలు జాచే బాదం చెట్టు వంటిది.
నీ గొంతు సడి ఆకులమీద
తేలికగా విహరించే దక్షిణగాలి ఒరిపిడి;
నీ నీడ నీడకాదు, విరజిమ్మిన వెలుతురుపొడ;
రాత్రివేళ నువ్వు ఆకాశాన్ని క్రిందకి దించుకుని
నక్షత్రాలను చుట్టూ కప్పుకుంటావు.
నేను మాత్రం, తనపాదాల చెంత పెరుగుతున్న పిల్ల బాదం మొక్కని
మేఘావృతమైన ఆకాశం క్రింద పరిశీలించే ఓక్ చెట్టుని
.
ఏమీ లోవెల్,
ఫిబ్రవరి 9, 1874 – మే 12, 1925
(1) (గమనిక: బీచ్ చెట్టు అంటే బాదం చెట్టు కాదు. బీచ్ చెట్టుకు కాసే పళ్ళలో తినదగిన గట్టి సీడ్ ఉంటుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలతో పొడవుగా ఎదగుతుంది. సామ్యానికి దగ్గరగా ఉంటుందని బీచ్ చెట్టుని బదం చెట్టుగా మార్చడం జరిగింది. అంతే. )
ఎజ్రాపౌండ్ ప్రారంభించిన ఇమేజిజం అనే సాహిత్య ఉద్యమాన్ని అమెరికాలో బాగా ముందుకి తీసుకు వెళ్ళిన కవయిత్రి ఏమీ లోవెల్. తక్కువ వర్ణనలతో, ప్రతీకలకి, స్పష్టమైన పదప్రయోగానికి ప్రాధాన్యతనిచ్చిన ఒక ఉద్యమం ఈ ఇమేజిజం. ఈమెకు మరణానంతరం పులిట్జరు బహుమతి వచ్చింది. పౌండ్ లాంటి వాళ్ళు ఆ మార్గాన్ని వదిలేసినా, ఏమీ లోవెల్ మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగించింది.
.

.
Generations
.
You are like the stem
Of a young beech-tree,
Straight and swaying,
Breaking out in golden leaves.
Your walk is like the blowing of a
beech-tree
On a hill.
Your voice is like leaves
Softly struck upon by a South wind.
Your shadow is no shadow, but a
scattered sunshine;
And at night you pull the sky down
to you
And hood yourself in stars.
But I am like a great oak under a
cloudy sky,
Watching a stripling beech grow up
at my feet.
.
స్పందించండి