అనువాదలహరి

తుదీ- మొదలూ … జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

యుద్ధం ముగిసిన ప్రతిసారీ

ఎవడో ఒకడు అంతాశుభ్రం చెయ్యాలి.

విషయాలు వాటంతట అవి చక్కబడవుకదా.

శవాలతో నిండిన బళ్ళు

ముందుకు నడవాలంటే,

ఎవరో ఒకరు రోడ్డుమీదున్న చెత్తను

రోడ్డుపక్కకి ఊడ్చిపోయాలి.

ఎవడో ఒకడు కూరుకుపోవాలి

… చెత్తా, బుగ్గీలో,

సోఫా స్ప్రింగుల్లో,

పగిలినగాజుముక్కల్లో

రక్తాలుచిమ్మిన గుడ్డపీలికల్లో…

గోడకూలిపోకుండా ఒకడు

పొడవాటి దూలం పూటు పెట్టాలి

ఊడిపోయిన తలుపు తిరిగి తగిలించి

కిటికీ అద్దాలు పగిలినవి తీసి కొత్తవి వెయ్యాలి.

చూడటానికి అంతగొప్పగా ఏం ఉండదు,

చాలా ఏళ్ళుపడుతుంది దానికి.

ఉన్న కెమేరాలన్నీ

మరో యుద్ధానికి తరలిపోయాయి.

మనకి మళ్ళీ కొత్త బ్రీడ్జిలూ

రైల్వే స్టేషన్లూ కావాలి.

పైకి మడిచి మడిచి

చొక్కా చేతు చిరిగిపోతాయి.

ఇంకా చేతిలోచీపురున్నవాళ్ళెవరికో

అది ఎలాగుండేదో గుర్తుచేసుకుంటున్నారు.

ఇంకా తెగిపోనితలున్నవ్యక్తి ఎవడో

వింటూ తలతాటిస్తున్నాడు;

దానిగురించే చర్చింటుకున్నవాళ్ళకి

అది చాలా పేలవంగా కనిపిస్తోంది;

పొదలమాటునుండి ఎవడో

తుప్పుపట్టిన వాదనలని వెలికితీసి

వాటిని చెత్తకుప్పమీదపారబోస్తున్నాడు.

ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసినవాళ్ళు…

ఇక్కడ ఏం జరిగిందో కొద్దిగా తెలిసినవాళ్ళకీ

బొత్తిగా తెలియని వాళ్ళకీ

చివరికి బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళకీ

చోటు వదలాల్సి వస్తునంది.

విచ్చలవిడిగా పెరిగిన గడ్డినిచూస్తూ

మేఘాలని పరికిస్తూ,

ఒక గడ్డిపరకని నములుతూ

ఎవడో ఒకడూ

కార్యకారణ సంబంధాలు చెబుతుంటాడు.

.

జిష్వావా షింబోర్స్కా

(2 July 1923 – 1 February 2012)

పోలిష్ కవయిత్రి

.

Wisława Szymborska (b. July 2, 1923 in Bnin, P...
Wisława Szymborska (b. July 2, 1923 in Bnin, Poland), Polish poet, and Nobel Prize winner. She lives in Cracow, Poland (Photo credit: Wikipedia)

.

The End and the Beginning

.

After every war
someone has to clean up.
Things won’t
straighten themselves up, after all.

Someone has to push the rubble
to the sides of the road,
so the corpse-laden wagons
can pass.

Someone has to get mired
in scum and ashes,
sofa springs,
splintered glass,
and bloody rags.

Someone must drag in a girder
to prop up a wall.
Someone must glaze a window,
rehang a door.

Photogenic it’s not,
and takes years.
All the cameras have left
for another war.

Again we’ll need bridges
and new railway stations.
Sleeves will go ragged
from rolling them up.

Someone, broom in hand,
still recalls how it was.
Someone listens
and nods with unsevered head.
Yet others milling about
already find it dull.

From behind the bush
sometimes someone still unearths
rust-eaten arguments
and carries them to the garbage pile.

Those who knew
what was going on here
must give way to
those who know little.
And less than little.
And finally as little as nothing.

In the grass which has overgrown
causes and effects,
someone must be stretched out,
blade of grass in his mouth,
gazing at the clouds.

.

Wislawa Szymborska

(translated from the Polish by Joanna Trzeciak)

%d bloggers like this: