అనువాదలహరి

నువ్వు వచ్చిన ఆ రోజు… లిజెట్ వుడ్ వర్త్ రీజ్, అమెరికను కవయిత్రి

దైవం నిన్నిక్కడకు పంపిన ఆ రోజు

చుట్టూ సుగంధపరిమళాలు వ్యాపించాయి

నాకు అర్థమైంది లవండరు పూసిందని

ఋతుచక్రం సగం తిరిగిందనీ.

అలవాటుగా వడిగాలిలు వీస్తున్నాయి

ఓడలు సముద్రం మీదకి పయనిస్తున్నాయి;

రోజు ముగిసేలోగా నాకు అవగతమైంది

నేను ఎదురుచూసినరోజు రానే వచ్చిందని.

కొన్ని పాటలు ముగిసిన తర్వాత ఒక రాగం

పచ్చికలో, పొదరిళ్ళలో తూగాడినట్టు

ఇప్పుడు ప్రతి ఋతువులోనూ ఎంతోకొంత

వసంతఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.

సంవత్సరం,  కొత్తలో మొక్కలకి మొగ్గలు తొడిగితే

వీడ్కోలుపలికినపుడు ఆకులు రాల్చి మోడులను చేస్తుంది;

కానీ నా లవండరు ఉద్యానం లో

నిత్యమూ తేనెటీగల రొదనే వింటుంటాను

.

లిజెట్ వుడ్ వర్త్ రీజ్

(January 9, 1856 – December 17, 1935)

అమెరికను కవయిత్రి …

.

Such special sweetness was about
That day God sent you here,
I knew the lavender was out,
And it was mid of year.

 

Their common way the great winds blew,
The ships sailed out to sea;
Yet ere that day was spent I knew
Mine own had come to me.

 

As after song some snatch of tune
Lurks still in grass or bough,
So, somewhat of the end o’ June
Lurks in each weather now.

 

The young year sets the buds astir,
The old year strips the trees;
But ever in my lavender
I hear the brawling bees.

 

 

Lizette Woodworth Reese

(January 9, 1856 – December 17, 1935)

American

Poem Courtesy: http://www.bartleby.com/267/27.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: