వాళ్ళు నీ మీద నేరాలు చెప్పడానికి వచ్చేరు
ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయేరు.
చెప్పడం పూర్తయేక గట్టిగా ఫక్కున నవ్వేను
అవన్నీ నాకు ఇంతకుముందే తెలుసు.
ఓహ్! వాళ్లు ఎదురుగుండా కనిపిస్తున్నా చూడలేని గుడ్డివాళ్ళు
ఆ నీ తప్పులే నిన్నింకా గాఢంగా ప్రేమించేలా చేసేయి.
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి
సారా టీజ్డేల్ అపురూపమైన కవయిత్రి. ఆమె ఎంత సరళంగా రాస్తుందో, అందులో అంత భావ గాంభీర్యతనీ చొప్పిస్తుంది. ఒక వ్యంగ్యమో, ఒక ఉపమానమో, ఒక ఆకాంక్షో, నైరాశ్యమో, విరహమో … ఏదైనా సరే ఆమె చాలా అలవోకగా పలికించగలదు ఆమె పదాల్లో. అక్కడ నేర్పుకంటే, తాదాత్మ్యం చెందిన అనుభూతిని అక్షరాలలోకి వొలికించగల సహజమైన శక్తి ఉంది. ప్రతీ ఒక్కరూ మమేకమవగలిగేలా ఉంటాయి ఆమె ప్రేమకవితలు.
.

.
Faults
.
They came to tell your faults to me,
they named them over one by one;
I laughed aloud when they were done,
I knew them all so well before
Oh, they were blind, too blind to see,
Your faults had made me love you more.
.
Sara Teasdale
August 8, 1884 – January 29, 1933
American
స్పందించండి