అనువాదలహరి

ఒక రైతు మరణం … రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి

డేవీస్ నీకు గుర్తున్నాడా?


పాపం, పోయాడు, తెలుసా?


వెల్ష్ కొండల్లో, పేదరైతు రాళ్లుతేరిన


తనపొలంలోనే చచ్చిపోయినట్టు


జీవితం మీద ఆశలు వదిలేసుకుని.


నాకు ఇంకా గుర్తే … పెంకులచూరుకింద అతని గదీ,


అతను పడుక్కునే విశాలమైన పక్కా


దానిమీద వెలిసిపోయిన దుప్పటీను…


ఒంటరిగా, మార్చినెల మధ్య ఎండల్లో


ఈనలేక బాధపడుతున్న ఆడగొర్రెలా ;


అంతే కాదు, ఇంట్లో చిక్కుకున్న వడిగాలి


తెరలన్నిటినీ చించుకుని బయటకి పోవడమూ,


ఎండ నేలమీద విన్యాసాలు చెయ్యడమూ గుర్తే.


చుట్టుపక్కలవాళ్ళు గట్టిగా అడుగులేసి నడుస్తుంటే


అతని తల అదరకుండా ఉండడానికి పాపం


తలక్రిందకి ఒక దుప్పటీ అయినా …


కనీసం చాప అయినా లేకుండా బోసిగా ఆ బల్లచెక్కమీద;


వచ్చినవాళ్ళు ఒకసారి తొంగి చూసి,  అర్థంలేని ఓదార్పు మాటలు


ఏవో వల్లిస్తూ, చెమ్మకుండి చివికిపోయిన గది గోడల్లాగే


చావుకంపుకొడుతున్న అతనినుండి దూరంగా


నిర్దాక్షిణ్యంగా వెనక్కి మరలడమూ గుర్తే.

.

రొనాల్డ్ స్టూవర్ట్ థామస్

(29 March 1913 – 25 September 2000

వెల్ష్ కవి

.

R. S. Thomas
R. S. Thomas (Photo credit: Wikipedia)

.

Death of a Peasant

.

You remember Davies? He died, you know,
With his face to the wall, as the manner is
Of the poor peasant in his stone croft
On the Welsh hills. I recall the room
Under the slates, and the smirched snow
Of the wide bed in which he lay,
Lonely as an ewe that is sick to lamb
In the hard weather of mid March,
I remember also the trapped wind
Tearing the curtains, and the wild light’s
Frequent hysteria upon the floor,
The bare floor without a rug
Or mat to soften the loud tread
Of neighbours crossing the uneasy boards
To peer at Davies with gruff words
Of meaningless comfort, before they turned
Heartless away from the stale smell
Of death in league with those dank walls.
.
Ronald Stuart Thomas
(29 March 1913 – 25 September 2000)
Welsh Poet

%d bloggers like this: