అనువాదలహరి

నిష్క్రమణ … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

నే నే తోవ తీసుకున్నా నాకు లెక్కలేదు,

అదెక్కడికి వెళుతుందో అంతకన్నా పట్టింపులేదు

ఈ ఇంట్లోంచి బయటపడాలి, నా గుండెపగిలేలోపు

నేను వెళ్ళిపోవాలి, ఎక్కడికో అక్కడికి.

నా గుండెలో ఏముందో నాకు తెలీదు

నా మనసులో ఏమున్నదీ నాకు తెలీదు

కానీ నాకు ఇక్కడనుండి లేచి వెళిపోవాలనుంది

నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళతాయో నాకు లెక్కలేదు.


నేనొక పగలూ రాత్రీ నడవగలిగి

సూర్యోదయం వేళకి ఒక నిర్జనప్రదేశంలో

కనుచూపుమేర రోడ్డన్నది లేకుండా

ఒక కొంపగాని, మనిషన్న ఊసుగానిలేకుంటే చాలు.  


కాళ్ళు రక్తాలు కారేదాకా నడవాలి

మరి కదలలేకుండా పడిపోయేదాకా నడవాలి

కలుపుమొక్కలమధ్య వానకుతడిసే రాళ్ళగుట్టల్లో

ఏ విశాలమైన తీరాన్నో రాలిపోవాలి… అలకిదొరికిపోతూ…  

నే పట్టిన త్రోవ రాళ్లలోకి దారితీసినా…

రేవులోకి దారితీసినా నాకు లక్ష్యం లేదు

ఎక్కడో ఏ గోతిలోనో నిలువునా జారిపడినా

నే నేమీ బాధపడను, ఎవర్నీ నిందించను.

ఏమిటే, నీలోనువ్వే గొణుక్కుంటున్నావ్?”అందామె,

“అంత మౌనంగా నీ పని చేసుకుంటున్నావు?”

” అబ్బే, ఏమీ లేదమ్మా! ఏదో నా బుర్ర తొలుస్తున్న సమస్య.

అదిగో అప్పుడే కెటిలు కూస్తోంది, టీ పెడతానులే.”

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే,

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)
Portrait of Edna St. Vincent Millay (1933-01-14) (Photo credit: Wikipedia)

 

.

Departure

 .

It’s little I care what path I take,

And where it leads it’s little I care;

But out of this house, lest my heart break,

I must go, and off somewhere.

 

It’s little I know what’s in my heart,

What’s in my mind it’s little I know,

But there’s that in me must up and start,

And it’s little I care where my feet go.

 

I wish I could walk for a day and a night,

And find me at dawn in a desolate place

With never the rut of a road in sight,

Nor the roof of a house, nor the eyes of a face.

 

I wish I could walk till my blood should spout,

And drop me, never to stir again,

On a shore that is wide, for the tide is out,

And the weedy rocks are bare to the rain.

 

But dump or dock, where the path I take

Brings up, it’s little enough I care;

And it’s little I’d mind the fuss they’ll make,

Huddled dead in a ditch somewhere.

 

“Is something the matter, dear,” she said,

“That you sit at your work so silently?”

“No, mother, no, ’twas a knot in my thread.

There goes the kettle, I’ll make the tea.”

.

Edna St Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American

%d bloggers like this: