అనువాదలహరి

నాగేటి చాలు… పెడ్రాక్ కోలం, ఐరిష్ కవి

ఎక్కు! త్వరగా కొండపైకి ఎక్కు, కృషీవలా!

ఆకాశం అంచులదాకా ఎక్కు. పద పద. 

విత్తనాలు విసురుతూ, ఆనందంతో

నాల్గుపక్కలా జల్లుతూ, పద పద.

కొండ అంచుకి ఆవలివైపు 

విశాలమైన తీరం మీద

కడలికెరటాలు చేసే లయకి

అనుగుణంగా పదాలు పాడుతూ…

దిగువ, నేలక్రింద, చీకట్లో

తల్లులు నిద్రలో ఉన్నారు

ఉయ్యాలలు విశ్రాంతి తీసుకుంటున్నై

వెలబారిన నివురు లోలోపల

నిప్పు-రవ్వ కూడా నిద్రిస్తోంది. 


ఓ నేలపట్టీ! ఓ దార్శనికుడా!

చీకటికీ నిద్రకీ తలవంచు!

నన్ను పుడమికి అంకితంచెయ్యి.

నేను విత్తనంతో సహా వెళ్తాను.

అంచెలంచెలుగా శక్తిసమకూర్చుకుంటూ

మౌనంగా ఎదగడం ఎంతబాగుంటుందని!

ప్రకృతిశక్తులనెదిరించి మరీ  

బలంగా చీల్చుకుని బయటకి రావచ్చు

సూర్యకిరణాలని నవ్వుతూ పలకరిస్తూ

ప్రప్రపంచానికి ఉల్లాసాన్ని కలిగిస్తూ.

.

పెడ్రాక్ కోలం

8 December 1881 – 11 January 1972

ఐరిష్ కవి.

Notes:

నేలపట్టీ: Son Of the Soil, the Farmer.

.

Padraic Colum
Padraic Colum
Irish Poet
Image Courtesy:
http://www.findagrave.com/cgi-bin/fg.cgi?page=gr&GRid=35829606

.

THE FURROW

.

Stride the hill, sower,
Up to the sky-ridge,
Flinging the seed,
Scattering, exultant!
Mouthing great rhythms
To the long sea beats
On the wide shore, behind
The ridge of the hillside.

Below in the darkness—
The slumber of mothers—
The cradles at rest—
The fire-seed sleeping
Deep in white ashes!

Give to darkness and sleep:
O sower, O seer!
Give me to the Earth.
With the seed I would enter.
O! the growth thro’ the silence
From strength to new strength;
Then the strong bursting forth
Against primal forces,
To laugh in the sunshine,
To gladden the world!

.

Padraic Colum

8 December 1881 – 11 January 1972

 Irish Poet

Padraic Colum was a poet, playwright, founder of the Irish Review and a leader of the Irish Renaissance, but he is perhaps best known today for his outstanding books for children. He was awarded the Regina Medal in 1961 for his “distinguished contribution to children’s literature,” honoring works like The Children’s Homer, The Golden Fleece (a Newbery Honor Book), The Arabian Nights, The King of Ireland’s Son and Roofs of Gold. (From Project Gutenberg’s Book :The Children Of Odin , The Book of Northern Myths.)

Poem Courtesy: http://www.gutenberg.org/files/38438/38438-h/38438-h.htm
The Melody Of Earth: An Anthology of Garden and Nature Poems from Present Day Poets. (page 3)
Selected and Arranged by Mrs Waldo Richards,
Houghton Mifflin Company, 1918

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: