అనువాదలహరి

పుడమి… జాన్ హాల్ వీలాక్ అమెరికను కవి

ఓ అజ్ఞాత కీటకమా!

శ్రావ్యమైన నీ సంగీతమూ, నా కవితా కూడా,

సమస్తమైన కవిత్వానికీ ఆలవాలమై

మౌన, గంభీరమైన ఈ పుడమికి ఒక్కలాగే చెందుతాయి.

మనం రాసేదీ, పాడేదీ అంతా ఆమె సుషుప్తావస్థలో ఉండి

అటూ ఇటూ కదులుతున్నప్పుడు

మగతలో ఆమె గుండెచేసే సవ్వడులే.

మనం ఆనందంతో కేరినా, దుఃఖంతో కీరినా నువ్వూ,

నువ్వూ నేనూ ఇద్దరం ఆమె గొంతులమే.

 

ఆమె అగోచరమైన సౌందర్యాన్ని

ఈ ధూళి ఎంతో నేర్పుగా ప్రకటిస్తుంది;

డాంటే కలలైనా, కీచురాయి అరుపులైనా

ఆమె నిశ్శబ్దంలోంచి ఆవిర్భవించేవే.

స్థావర పకృతిని ఈనుతున్న పుడమే

నగరాల్నీ, స్వరవర్ణపటాన్నీ ఈనుతోంది;

ఆమె సౌందర్యం సరిసమానంగా

పువ్వులోకీ,శిలువలోకీ ప్రవహిస్తుంది.

 

అలా ఎదుగుతున్న పచ్చికలాగే

మట్టిలోంచి మతాలు బయటలు వస్తాయి,

రాజనాలుపండే ఆ మట్టిలోంచే

కథలూ, గాథలూ పుడుతుంటాయి.

ఒక గులాబిలా, ఒక తెల్ల కలువలా

కవిత్వం కూడా భూమిలోంచి మొలకెత్తుతుంది;

ఇప్పుడు మనిషి ఇలా ఉన్నా, రేపు మరోలా ఉన్నా

అదంతా సాఫల్యం చెందే దిశలో

ఒక కఠినమైన ఏటవాలును

ఎక్కడానికి ఆమె పడే వేదనలాంటిది.  

చివరికి ఈ విశ్వమంతా మట్టిగా మిగిలినపుడు

అది ఒక సచేతనమైన విశ్వాత్మగా అవతరిస్తుంది.

 

ఔను నిజం. నా ఈ కవితకూడా,

మట్టీ, మంచూ లా ఆమెలో ఒక అంతర్భాగమే.

నా పెదాలద్వారా, నా ప్రార్థనద్వారా

ఆమె తనని తాను ప్రకటించుకుంటుంది

.

జాన్ హాల్ వీలాక్ 

September 9, 1886 – March 22, 1978

అమెరికను కవి

.

EARTH

Grasshopper, your fairy song
And my poem alike belong
To the deep and silent earth
From which all poetry has birth;
All we say and all we sing
Is but as the murmuring
Of that drowsy heart of hers
When from her deep dream she stirs:
If we sorrow, or rejoice,
You and I are but her voice.

Deftly does the dust express
In mind her hidden loveliness,
And from her cool silence stream
The cricket’s cry and Dante’s dream:
For the earth that breeds the trees
Breeds cities too, and symphonies,
Equally her beauty flows
Into a saviour or a rose.
.
Even as the growing grass
Up from the soil religions pass,
And the field that bears the rye
Bears parables and prophecy.
Out of the earth the poem grows
Like the lily, or the rose;
And all that man is or yet may be,
Is but herself in agony
Toiling up the steep ascent
Towards the complete accomplishment
When all dust shall be, the whole
Universe, one conscious soul.
.
Yea, and this my poem, too,
Is part of her as dust and dew,
Wherein herself she doth declare
Through my lips, and say her prayer.
.

John Hall Wheelock

September 9, 1886 – March 22, 1978
American Poet
Poem Courtesy: http://www.gutenberg.org/files/38438/38438-h/38438-h.htm
The Melody Of Earth: An Anthology of Garden and Nature Poems from Present Day Poets.
Selected and Arranged by Mrs Waldo Richards,
Houghton Mifflin Company, 1918

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: