అనువాదలహరి

పక్షులు …విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి

అతడు:

 
నువ్వెక్కడ ఉంటున్నావు?  నీదే తోట?

సొగసైన దానా! ప్రియతమా!

ఏ సీమకైనా అందాన్నిచ్చేదానా! 

నీ సుందరమైన గూడు ఎక్కడ కట్టుకున్నావు?      
    

ఆమె:


అదుగో అక్కడ దూరంగా ఒంటరిచెట్టుందే,

అక్కడ నేనుంటున్నాను నీ కోసం జపిస్తూ;

పగళ్లు నా కన్నీరు త్రాగితే

రాత్రుళ్ళు నా వేదన గాలి మోసుకెళుతుంది.     

అతడు:


ఓ వసంత మాధురీ!

నేను నీకోసమే బ్రతుకుతూ శోకిస్తున్నాను

ప్రతి రోజూ తోట నా దుఃఖాన్ని నినదిస్తే

రాత్రి నా వేదనని దూరంగా వినిపిస్తుంది.     

ఆమె:


నువ్వు నిజంగా నన్ను కోరుకుంటున్నావా?

నేను నీకు నిజంగా అంత ఇష్టమా?

అయితే మన దుఃఖానికి భరతవాక్యం పలుకుదాం

ఓ ప్రియమైన చెలికాడా! నా స్నేహితుడా!
    
అతడు:


రా! పద! ఎత్తైన శిఖరమ్మీది నా పొదరింటికి

ఆనందపు రెక్కలమీద ఎగిరిపోదాం

పచ్చనాకుల గుబురుల్లో, సొబగైన పూలగుత్తుల మధ్య

నా గూటిలో హాయిగా సేద తీర్చుకో !    

.

విలియం బ్లేక్

(28 November 1757 – 12 August 1827)

ఇంగ్లీషు కవీ, చిత్రకారుడూ, ముద్రణా నిపుణుడూ.

విలియం బ్లేక్ పేద కుటుంబం నుండి వచ్చి, చాలా తంటాలుపడి చిత్రకళా, నగిషీపనీ నేర్చుకుని, అందులో అనుపమానమైన ప్రతిభా, పేరూ సంపాదించేడు. చాలా మంది కవుల కవిత్వానికి, ముఖ్యంగా  డాంటే Divine Comedy కి, థామస్ గ్రే An Elegy On The Country Churchyardకీ, రాబర్ట్ బ్లేర్ The Graveకీ గొప్ప ఇలస్ట్రేషన్స్ గీశాడు.

సరళమైన భాషలో మంచి కవిత్వం రాసేడు గానీ, విలియం బ్లేక్ జీవితకాలంలో కవిగా మాత్రం పెద్ద గుర్తింపుకు నోచుకోలేదు. అందరి కళాకారుల్లా అతను గొప్పభావుకుడూ, సున్నిత హృదయుడూ. అతని కవితల్లో The Tiger ఎక్కువ సంకలనాల్లో చోటుచేసుకుంది. అతని కవిత్వం తర్వాతి తరాల్లోనే బాగా ప్రచారానికీ, గుర్తింపుకీ నోచుకుంది.

ఈ కవితలో ఎడబాటైన రెండు పక్షులు తిరిగి కలుసుకున్నప్పుడు జరిగే సంభాషణని ఊహిస్తున్నాడు కవి.  వాటికి మానవప్రకృతి ఆపాదిస్తూ,  వాటికీ మనకీ పరస్పరానురాగం, ఆకర్షణ విషయాల్లో, స్పందనల్లోనూ, ఊహల్లోనూ అబేధాన్ని చూపిస్తున్నాడు.

.

The artist and poet William Blake, who lived i...
The artist and poet William Blake, who lived in Hercules Road — a portrait by Thomas Phillips (1807). (Photo credit: Wikipedia)

.

The Birds

He. Where thou dwellest, in what grove,
Tell me Fair One, tell me Love;
Where thou thy charming nest dost build,
O thou pride of every field!

She. Yonder stands a lonely tree,
There I live and mourn for thee;
Morning drinks my silent tear,
And evening winds my sorrow bear.

He. O thou summer’s harmony,
I have liv’d and mourn’d for thee;
Each day I mourn along the wood,
And night hath heard my sorrows loud.

She. Dost thou truly long for me?
And am I thus sweet to thee?
Sorrow now is at an end,
O my Lover and my Friend!

He. Come, on wings of joy we’ll fly
To where my bower hangs on high;
Come, and make thy calm retreat
Among green leaves and blossoms sweet.

.

William Blake

(28 November 1757 – 12 August 1827)

English Poet, Painter, Print Maker.

రెండు దేహాలు … ఆక్టేవియో పాజ్, మెక్సికన్ కవి

రెండు ఎదురెదురు దేహాలు

ఒక్కోసారి ఎగసిపడేకెరటాలు
రాత్రి ఒక మహాసాగరం

 

రెండు ఎదురెదురు దేహాలు
అపుడపుడు రెండు పెద్ద బండరాళ్లు
రాత్రి ఒక విశాలమైన ఎడారి

 

రెండు ఎదురెదురు దేహాలు
ఒక్కొసారి రెండు రాత్రిలోకి
చొచ్చుకుపోయిన రెండు పిల్లవేర్లు    

 

రెండు ఎదురెదురు దేహాలు
అపుడపుడు రెండు కత్తులు
రాత్రి పూట నిప్పురవ్వలు రాలుస్తాయి

 

రెండు ఎదురెదురు దేహాలు
శూన్యాకాశం నుండి నేలకు
రాలిపడే రెండు ఉల్కలు.
.

ఆక్టేవియో పాజ్ 

(March 31, 1914 – April 19, 1998)

మెక్సికన్ కవి

.

ఈ కవిత చక్కని ప్రతీకలతో ఒక అద్భుతమైన తాత్త్విక ప్రయోజనాన్ని నెరవేరుస్తోంది.  పదాల గాంభీర్యతగాని, విశేషమైన భావనలూ, సాంకేతిక పదాలుగాని, అన్వయక్లిష్టతగాని ఏమీ లేవు.  ఉన్నవి రెండు దేహాలు ఎదురెదురుగా… అవి ఎన్ని రకాలుగా ప్రవర్తించగలవో పెద్దవ్యాఖ్యానం ఏమీ లేకుండా కవి చెప్పగలిగేడు… ఆయా సందర్భానికి తగిన ప్రతీకలతో.  అనురాగమూ, నిర్లిప్తతా, సహ అనుభూతి, వైరమూ, మొదలైన అన్ని రకాల నుభూతులకూ లోనై చివరకి రెండు అనంత విశ్వంలోకి  ఉల్కల్లా రాలి అంతం కావడమూ జరుగుతుంది.

 

కవులందరూ చెప్పేది ఒకటే… ఈ ప్రపంచాన్ని అవగాహనచేసుకుందికి మన అస్తిత్వాన్ని గురించిన అవగాహన మనకి ఉండాలి; చివరకి, మన జీవితానికి అర్థం ఈ అస్తిత్వంతోనే నశిస్తుంది. ప్రకృతి మనకి ఒక ప్రతీక… “బాహ్యసంబంధి” (Objective corrélative). అంటే, దానివల్లనే మనకి మన అస్తిత్వంగురించిన అవగాహన కలుగుతుంది. దాన్ని వేరుగా చూడగలగడము మన ఉనికి తెలియజేస్తే, మనం అందులో అంతర్భాగమే అని తెలుసుకోవడం ఈ శరీరం యొక్క ఆశాశ్వతత్వం గురించీ, ఈ ప్రకృతిలో అనాదిగా, నిర్లిప్తంగా జరిగే సహజ ప్రక్రియగురించీ మంచి అవగాహన కల్పిస్తుంది. ఈ అవగాహన మనల్ని భయపెట్టడానికి, నిర్వీర్యులనీ చెయ్యడానికి కాకుండా, మనకున్న చైతన్య పరిధిలో, మనకి ఇష్టమైన పనులు, మనకి ఏవి మంచి అనితోస్తే అవి,  చెయ్యగల స్వేఛ్ఛలో, మనం పనిచెయ్యడానికి కావలసిన వినమ్రత (Humilty) ప్రసాదిస్తుంది.

 

కవికి తార్కిక చింతనతో పాటు, తాత్విక చింతన కూడా అవసరమే అని చెప్పే చిన్న కవిత ఇది.

 

Octavio Paz
Octavio Paz (Photo credit: Wikipedia)

.

Two Bodies

.

 

Two bodies face to face
are at times two waves
and night is an ocean.

 

Two bodies face to face
are at times two stones
and night is a desert.

 

Two bodies face to face
are at times two roots
laced into the night.

 

Two bodies face to face
are at times two knives
and night strikes sparks.

 

Two bodies face to face
are two stars falling
in an empty sky.

.

Octavio Paz

(March 31, 1914 – April 19, 1998)

Mexican Poet,

.
Pl. visit the following link for a beautiful explanation with visuals:

http://www.scribd.com/doc/20702999/Two-Bodies

Things That Matter… Prasuna Ravindran, Telugu, Indian

Sometimes,

it would be just like that!

 

We would rather imprison

those butterflies of thoughts

in our heart

than allow them to float free

liberating from the sensibilities

 

Even as the rain water

Collected in the cusps of our hands

leaks out through the fissures

between fingers,

the chill and freshness

of the ethereal skies

linger still.

 

If you think

You have wasted your time

enjoying the pattering rain

And the prominent moonlight…

 

Well,

You know not what living after all, is!

.

Prasuna Ravindran

Indian

Prasuna A

Prasuna Ravindran

Prasuna is an engineer by profession and is a resident of Hyderabad, Andhra Pradesh. She is a blogger running her blog :

http://rekkalasavvadi.blogspot.in/

since 3rd Jan 2010. Poetry, Painting, Reading and Animation are her favorite subjects.

ముఖ్యమైన వాళ్ళకు … ప్రసూన

 

.

కొన్నిసార్లంతే …

 

హృదయ స్పందనలోంచి పుట్టిన

భావాల సీతాకోక చిలుకల్ని

గుండెలోనే బంధించడం తప్ప

స్వేచ్చగా వదల్లేం…

 

దోసిట్లో పట్టుకున్న వాన నీరు

వేళ్ళ సందుల్లోంచి జారిపోయినా

ఆకాశపు కబుర్ల హాయి

అరచేతుల్లో ఇంకా చల్లగా …

 

కురిసే వర్షాన్నీ

పెరిగే వెన్నెలనీ

ఆస్వాదించిన సమయం

వృధా అనుకుంటే

బ్రతకడం రానట్టే …

 

 

The Run Within…Yakoob, Telugu, Indian

Did I forget something back home?

Did I lock the door properly?
Did I put off the geyser and put the milk bowl back in the frig?
Oh, damn it!
The three kittens might make a hell by the time I come home.
Well, maybe the tommy might not allow barking at them
And might even chase them away towards the gate.
But sometimes it sleeps like a log.
Btw did I logout from the laptop or
Left the FB open as it is?

Oh, bloody traffic and bloody traffic signals!
Caught in the jam as usual and resent it as usual.
A vacuous feeling if I didn’t resent.
There are only twelve minutes left for office.
Can I reach office in time? Can I sign in on time?
Awful signal! How long shall I have to vent my anger
On these traffic signals?

*

Poetic diction has changed; the metaphors have changed.
In the confused and confounded life …
The scars of wounds from the run within lay scattered around.
There are traces of my blood
In the flood swelling … breeching the roads.
Like the teething pain of stiff joints…

There are no dialogues between people.
There aren’t any more conversations.
All talk turns out to a rant of credits and debits;
About the life that exists between two pay packets ;
And reduces to a veritable P&L Statement
With its bills payable, liabilities, and net losses.

Occasionally, some books and few people
Like paintings on heart’s canvas
Lend their colour to our lives.

The dream of Sunday recurs for the rest of the six days.
A life… Sans traffic, sans locks, sans run…
A blank serene dreamless dream.

.

Kavi Yakoob

Indian

Image Courtesy: Kavi Yakoob
Image Courtesy: Kavi Yakoob

Dr. Yakoob is working as Associate Professor at Anwarul – Uloom Degree College, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh. He runs a blog: http://kaviyakoob.blogspot.in/

లోపలి పరుగు  

………………………….

 

ఏం మర్చిపోయాను ఇంట్లో

తాళం వేశానా ,లేదా ?, గీజర్ స్విచ్ కట్టేశానా, పాలగిన్నె ఫ్రిజ్ లో పెట్టానా ,ఆ మూడు పిల్లులూ ఏం చేస్తాయో ఏమో

టామీ రానీయకుండా మొరుగుతుందిలే,గేటు దాకా తరిమేస్తుందిలే

అదేమిటో దానిదీ మొద్దునిద్రే !

అవునూ- ల్యాప్టాప్ లో logout అయ్యానో లేదో

Facebook అలానే ఉంచేసానా

 

ఈ ట్రాఫిక్ లో ఇలా చిక్కుకున్నాను,ఇలా రోజూ ఉన్నదే కానీ మళ్ళీ అలానే అనుకోవాలి.అనుకోకపోతే అదో వెలితి.ఇంకో 12 నిమిషాలే మిగిలింది, ఆలోపు ఆఫీసుకు వెళ్ళగలనా ,సంతకం పెట్టగలనా in time లో ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎన్నాళ్ళిలా నన్ను నేనే

ఇలా కోపగించుకోవడం .

  

కవిసమయం మారింది.

కకావికలమైన జీవితం నిండా లోపలి పరుగుల గాయాల గుర్తులు. రాత్రంతా కురుస్తున్న వర్షం కోసిన రోడ్లమీద పారుతున్నవరదలో ఎక్కడో నావి కొన్ని రక్తపుచారికలు. బిగుసుకున్న రోజుల్లో కీల్లనోప్పుల్లాంటి బాధ.

 మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్.మాటలన్నీ జమాఖర్చు లెక్కల చిట్టాలే. ఒకటవతేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఊహించగలిగిన జీవితం. బిల్లులు,చిల్లులూ ,వెరసి తరుగుదల ఖాతా లాంటి బతుకువాణిజ్య శాస్త్రం.

 కొన్ని పుస్తకాలూ,కొందరు మనుషులూ మనసుకు తగిలించుకున్న పెయింటింగ్స్ లా అపుడపుడూ మనసుకు రంగులు పూస్తారు .

 

వారంనిండా ఆదివారం కల.

 ట్రాఫిక్ లేని, తాళం కప్పలేని,పరుగులేని మరుపులాంటి ఒక కల.

 

*

యాకూబ్

22.7.2013

Death Indeed… Afsar, Telugu, Indian

Death is not
Starvation
Neither Tsunami
Nor cessation of heart beat…

When a promise made hides behind equivocation
When a profile coldly vanishes into the back, or
When a man is banished into eternal silence…
That is … a veritable death.

Murders
Suicides
Abortions
Are not death.

When the cherished faith you so covetously held
Mercilessly bites and hurts you deep

When an unfamiliar hand
Turns into a murderous knife
By pinning a wound to the heart like a rose

That… that is death indeed.
.

Afsar

Indian

Image Courtesy: Afsar's Blog : http://www.afsartelugu.blogspot.in/
Image Courtesy: Afsar’s Blog : http://www.afsartelugu.blogspot.in/

Mr Afsar is a Faculty member at College of Liberal arts, University of Texas at Austin. 

.

నిజంగా మరణం

ఆకలో
వుప్పెనో
ఆగిన గుండె చప్పుళ్ళో
కాదు మరణమంటే.
ఒక మాట నిలువునా చీలిన చోట
ఒక దృశ్యం నిర్లిప్తంగా నిష్క్రమించిన చోట
ఒక మనిషి నిశ్శబ్దంలోకి వెలివేయబడిన చోట
నిజంగా మరణం.

హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే.

వెంట వచ్చిన విశ్వాసం నిర్దాక్షిణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడూ

ఒక గాయాన్ని గుండెకి గులాబీగా గుచ్చి
ఒక పరిచిత హస్తం
మృత్యుఖడ్గంగా రూపెత్తిన ప్పుడూ

నిజంగా మరణం.

The Monsoon Nights… Manasa Chamarti, Telugu, Indian

The monsoon nights let not sleep a wink.

  

With the drops of rain suddenly pecking at the ground…

The earth tingling anew all over bathed in flowers…

And the sweet trilling of a Dove in its nest with its mate

Let not sleep a wink the monsoon nights.

 

The thorn of chill prickles ever so gently

And the mischievous drizzle gets people wet slowly…

The wings remain in flight through the night

Till the twinkling glass-house gets blurred and hazy.

 

This rhythm in the back ground as lights are retired

Stirs up memories of some ancient melody

Whirling steadily within like the scents of the soil

Bidding goodbye to the month-long love-sickness

 

The delicate entwines around the tender waist

Locks on the forehead caressing the un-veiled bosom

Oh! What dreamy scripts the tips of nails encrypt, but

The blue eyes go all aglow… and the lightning to cloud nine.

   

Monsoon nights let not sleep a wink.

 .

 Manasa Chamarti

 Indian

 

Photo Courtesy: Manasa Chamarti
Photo Courtesy: Manasa Chamarti

Born and brought up in Vijayawada, Andhra Pradesh, and a student of V R Siddhartha College of Engineering there, Manasa Chamarti is an IT professional with eight years of experience. She is the team-leader now and has moved to Bangalore recently.

 

“Madhumanasam (http://www.madhumanasam.in/), her blog which she has been running since 22nd March 2010, is a record of her fine poetic sensibilities.

“I never knew when I was drawn to literature or whose poetry had drawn me to it, but I know for sure I became her subject and been drenched in its showers.  As for me, I feel this is one way to cherish every moment of our lives.,” she says rather modestly.

 

 

.

శ్రావణ రాత్రులు

 

శ్రావణ రాత్రులు నిద్రపోనివ్వవు

 

అకస్మాత్తుగా అవనిని ముద్దాడే వాన చినుకులూ

పుష్పాభిషేకాలతో పుడమి క్రొంగొత్త పులకింతలూ

గూటిలో ఒదిగిన గువ్వల వలపు కువకువలూ..

శ్రావణ రాత్రుల్లో కన్నులు మూతపడవు!

 

కొద్దికొద్దిగా గిల్లుతూ చలి ముల్లు

కాస్త కాస్తగా తడిపే తుంటరి జల్లూ

రేయంతా రెక్కలు తెరుచుకునే ఉంటాయిక

అద్దాల మేడ మొత్తం మసకబారిపోయేదాకా

 

దీపాలారే వేళల్లో లయగా ఈ నేపథ్య సంగీతం

ఏనాటిదో ఓ పురాస్మృతిగీతాన్ని జ్ఞప్తికి తెస్తూ

మన్ను పరిమళంలా మెల్లగా లోలో సుళ్ళు తిరుగుతూ

ఆషాఢ రాత్రుల విరహానికి వీడ్కోలవుతోంటే

 

లేలేత నడుమును చుడుతూ పెనవేసుకునే బంధాలు

అనాచ్ఛాదిత గుండెలను చుంబించే నెన్నుదిటి ముంగురులూ

కొనగోటి స్పర్శల్లో ఏ స్వప్న లిపి ఆవిష్కృతమవుతుందో గానీ..

మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో

 

శ్రావణ రాతురులు…లోకాలను నిదుర పోనివ్వవు…!!

.

మానస చామర్తి

9/13/2013

మానవ పరిజ్ఞానము… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి

నాకు తెలుసు నా శరీరము అతి బలహీనమైనది,కారణం

బయట శక్తులూ, లోపలి జ్వరాలూ దాన్ని నశింపజేయగలవు;

నాకు నా మనసు దివ్యాంశ సంభూతమనీ తెలుసు

కానీ, దాన్ని అతితెలివీ, లాలసా రెండూ చెడగొడతాయి. 

నాకు తెలుసు నా ఆత్మ అన్నిటినీ తెలుసుకోగల శక్తిగలది, 

కానీ అది అన్నివిషయాల్లోనూ అజ్ఞానీ,అవివేకీను;  

నాకు తెలుసు నేను ప్రకృతిలో ఒక మాదిరి మహరాజుని,

కానీ అధమమూ, నీచమూ అయిన విషయాలకి దాసుడిని.   

నాకు తెలుసు నా జీవితం క్షణికమూ, దుఃఖమయమూ

నా ఇంద్రియాలు నన్ను అన్నివిషయాల్లో మోసంచేస్తాయని

చివరకి చెప్పొచ్చేదేమిటంటే, నేను ఒక మానవుడిని

అది ఒక గర్వకారణమే కాదు, ఒక దౌర్భాగ్యం కూడా.

.

సర్ జాన్ డేవీస్

16 April 1569 (baptised) – 8 December 1626

ఇంగ్లీషు కవి 

ఈ కవిత ప్రత్యేకత చాలా సరళమైన భాషలో భౌతిక పదార్థానికీ, ఆత్మకీ మధ్య వివేచన చెయ్యడం. మానవ జీవితంలోని వరాల్నీ శాపాలనీ ఏకరువు పెడుతున్నట్టు కనిపించినా, కవి సానుభూతి ఎటో చెప్పకనే తెలుస్తుంది.  ఏ కాలంలోనైనా ఆ కాలపు మేధోవికసనము నాటి కవిత్వంలో ప్రతిబింబిస్తుందని ఒప్పుకుంటే, ఈ చిన్న కవిత ఎలిజబెత్ మహారాణి కాలంలో ఎంత ఆరోగ్యకరమైన సాహితీ వాతావరణం ఉందో అంచనావెయ్యొచ్చు ఈ కవితద్వారా.

.

.
Of Human Knowledge

.

I know my body’s of so frail a kind,
As force without, fevers within can kill;
I know the heavenly nature of my mind,
But ’tis corrupted both in wit and will.

I know my Soul hath power to know all things,
Yet is she blind and ignorant in all;
I know I am one of Nature’s little kings,
Yet to the least and vilest things am thrall.

I know my life’s a pain and but a span,
I know my Sense is mock’d with every thing:
And to conclude, I know myself a MAN,
Which is a proud, and yet a wretched thing.

Sir John Davies

(16 April 1569 (baptised) – 8 December 1626) English Poet and Lawyer

తోటలో … హొరేస్ హోలీ, అమెరికను కవి

కురుస్తున్న వర్షానికి తోటలో నిలబడి

నుదురు పైకెత్తి చినుకులని ముఖంపైకి ఆవాహనచేశా.

వావ్! ఎంత మనోల్లాస భావన! ఎక్కడికో జారి పడిపోతున్నట్టు  

మేఘాలతో, స్థావరజంగమ ప్రకృతితో,అస్తిత్వ బంధాలతో ఒంటరిగా… 

అలాగని ఏదో పోగొట్టుకోడమో, పొందడమో, అయిపోడమో కాదు;  

క్షణికమూ అవ్యక్తమూ ఐన ఆత్మానుభూతి,అంతే!    

మనసుకలవరపరచి బాధలకుగురిచేసే బంధాలనుండీ

అన్ని అవసరాలనుండీ పరిపూర్ణమైన స్వేచ్ఛ!  

‘తేలిపో’ అంటూ అరిచా ఆ క్షణానికి జేజేలుపలుకుతూ! 

ఆ నిర్మలానందాన్ని స్తుతించవలసిందే; అది అంతరించినా           

ఆ క్షణంలో ఉదయించిన నూతనోత్తేజమూ,

ఉదాత్తభావనలూ శాశ్వతంగా మిగులుతాయి; 

పూలతో నా బాంధవ్యం అవగాహన అవడమే కాదు   

ఈ వర్షం నాకు తోబుట్టువనీ, ఈ లోయలోని

సమస్త జీవప్రకృతికీ తత్కాల మిత్రుడనీ తెలిసింది.

.

హొరేస్ హోలీ

1887-1960

అమెరికను కవి

.

Horace Holley (Bahá'í)
Horace Holley (Bahá’í) (Photo credit: Wikipedia)

.

I stood within a Garden during rain

Uncovering to the drops my lifted brow:

O joyous fancy, to imagine now

I slip, with trees and clouds, the social chain,

Alone with nature, naught to lose or gain

Nor even to become; no, just to be

A moment’s personal essence, wholly free

From needs that mold the heart to forms of pain.

Arise, I cried, and celebrate the hour!

Acclaim serener gladness; if it fail,

New courage, nobler vision, will survive

That I have known my kinship to the flower,

My brotherhood with rain, and in this vale

Have been a moment’s friend to all alive.

 .

Horace Holley

1887-1960 

American

 (From Divinations and Creations)

Poem Courtesy:

http://www.gutenberg.org/files/38438/38438-h/38438-h.htm#Page_6

An Anthology of Garden and Nature Poems, Collected and Arranged by Mrs Waldo Richards,  BOSTON AND NEW YORK
HOUGHTON MIFFLIN COMPANY, 1918. 

నా నైపుణి లేక కళ… డిలన్ థామస్, వెల్ష్ కవి

ఈ నిశ్శబ్ద నిశీధిని, ప్రేమికులు

తమ దుఃఖాలని కాగలించుకు నిద్రించేవేళ

బయట స్వచ్ఛంగా వెన్నెల విరజిమ్ముతుంటే

లోపల రెపరెపలాడుతున్న దీపం ప్రక్కన

నేను సాధనచేస్తున్న ఈ నైపుణ్యమూ,ఈ కళా

పేరుప్రఖ్యాతులకోసమో, జీవికకో

బ్రహ్మాండమైన వేదికలపై వాటిని

దర్పంతో ప్రదర్శించడానికో కాదు;

వాటి అంతరాంతర రహస్యాలు ఇచ్చే

అతి సహజమైన ఆనందంకోసం.

 

గాలికి రెపరెపలాడుతున్న కాగితాలపై

అందమైన వెన్నెలనుండి దూరంగా బ్రతికే

అహంభావి మనిషికోసం కాదు నేను రాస్తున్నది;

వాళ్ళ కోయిలలతోనూ,వాళ్ల స్తుతిగీతాలతోనూ

అమరులైన కవిశ్రేష్ఠులకోసమూ కాదు;    

ఏ ప్రశంసలూ, ఏ పారితోషికాలూ ఇవ్వలేక

అసలు నా కౌశలంతో,కళతో నిమిత్తంలేకుండా

అనాదిగా వస్తున్న బాధల భుజాలపై

చెయ్యివేసి నడిచే కవిత్వ ప్రేమికులకి.

 

డిలన్ థామస్

(27 October 1914 – 9 November 1953)

వెల్ష్ కవి 

Hear the poem in Dylan’s Voice here

Welsh poet Dylan Thomas
Welsh poet Dylan Thomas (Photo credit: Wikipedia)

.

In my craft or sullen art
.
In my craft or sullen art
Exercised in the still night
When only the moon rages
And the lovers lie abed
With all their griefs in their arms,
I labour by singing light
Not for ambition or bread
Or the strut and trade of charms
On the ivory stages
But for the common wages
Of their most secret heart.

Not for the proud man apart
From the raging moon I write
 On these spindrift pages
Not for the towering dead
With their nightingales and psalms
But for the lovers, their arms
Round the griefs of the ages,
Who pay no praise or wages
Nor heed my craft or art.

Dylan Thomas

(27 October 1914 – 9 November 1953)

Welsh Poet

సంతలో తిరుగుతూ ఆమె… పెడ్రాక్ కోలం, ఐరిష్ కవి

నా జవరాలు నాతో ఇలా అంది
“మా అమ్మ ఏమీ అనుకోదు
మా నాన్న నిన్ను చులకనచెయ్యడు
నీకు ఆస్తిపాస్తులేం లేవని.”
అంటూ నా పక్కనుండి తప్పుకుని పోతూ,
“మరెన్నాళో లేదు, ప్రియతమా,
మన పెళ్ళిరోజు. అందాకా,”
అని వీడ్కోలు చెప్పింది.

నానుండి వీడ్కోలు పలికి
ఆమె సంతలో తిరగ సాగింది.
పిచ్చిగా ఆమేవంకే చూడసాగేను
ఆమె అటూ ఇటూ తిరుగుతుంటే.
ఒక్క చుక్క మిగిలుందనగా
ఇంటిముఖం పట్టింది చివరకి
సెలయేటి అలలలమీద సాయంవేళ
రాజసంగా విహరించే హంసలా.

మనుషులనుకోవడం విన్నాను
ప్రపంచంలో ఏ జంటా లేదు
ఒక్కరికే ఒక దుఃఖం ఉండి
రెండోవారికి చెప్పుకోనిది. 
దుస్తులూ, సామాన్లూ కొనుక్కుని
ఆమె వెళుతుంటే చూసి చిరునవ్వు నవ్వేను.
అంతే! అదే ఆఖరుసారి
నా ప్రియురాలిని చూసింది

నిన్న రాత్రి ఆమె నా దగ్గరకి వచ్చింది,
నా దివంగత ప్రేయసి లోనికి వచ్చింది
ఎంత మెత్తగా నడుచుకుంటూ వచ్చిందంటే
ఆమె అడుగులు ఎంతమాత్రం చప్పుడుచెయ్యలేదు.
ఆమె నా తల మీద చెయ్యివేస్తూ
ఆమె ఈ విధంగా నాతో అంది:
“”మరెన్నాళ్ళో లేదు, ప్రియతమా,
మన పెళ్ళిరోజు.  అందాకా “

.

పెడ్రాక్ కోలం

(8 December 1881 – 11 January 1972)

ఐరిష్ కవి

మనకంటే, గత రెండు మూడు శతాబ్దులలో, జానపదసాహిత్యాన్ని కాపాడుకోవడంలో,  ముఖ్యంగా మౌఖిక సాహిత్యాన్ని కాపాడుకోవడంలో యూరోపియనులు  ఇంగ్లండునుండి బాగా నేర్చుకున్నారు. ముఖ్యంగా ఐరిష్, స్కాటిష్ సాహిత్యంలో జానపద సాహిత్యం, మౌఖిక సంప్రదాయం ఒక విశిష్టమైన విభాగం.

మన గాథా సప్తశతిలోలా ఇక్కడకూడా చిన్నకవితల్లో పెద్ద కథ చెప్పబడుతుంది.  ఈ కవితలో  రోమియో జూలియట్ లో  “Till it be morrow”  అనిచెప్పుకుంటూ తియ్యనికలలు కంటూ విడలేక విడలేక విడిపోయిన నాయికానాయకుల్లా, ఇందులో కూడా మనపెళ్ళిరోజు ఎంతోదూరం లేదు మళ్ళీ కలుసుకుందాం” అనుకుంటూ శలవు తీసుకున్న ప్రేయసీ ప్రియులు మరి బ్రతికుండగా కలవరు.  ఇందులో జాగ్రత్తగా  గమనించవలసిన పాదాలు రెండున్నాయి. మొదటిది మనుషులనుకోవడం విన్నాను / ప్రపంచంలో ఏ జంటా లేదు /ఒక్కరికే ఒక దుఃఖం ఉండి /రెండోవారికి చెప్పుకోనిది.  అన్వయంలో, నిజమైన జంటలమధ్య దాపరికలూ, రహస్యాలూ ఉండకపోవడమే కాదు, వాళ్ళకి రెండుకష్టాలూ, రెండుసుఖాలూ ఉండవు. కష్టమూ సుఖమూ ఇద్దరికీ ఒక్కటే. అలా లేనివాళ్ళు దంపతులు కాదు… అనిభావము.

రెండోది:   ఒక్క చుక్క మిగిలుందనగా / ఇంటిముఖం పట్టింది చివరకి / సెలయేటి అలలలమీద సాయంవేళ /రాజసంగా విహరించే హంసలా. ఈ ఒక్క చుక్క మిగిలి ఉండడం అన్నది అర్థం చేసుకోవాలంటే, ఈ సంత సామాన్యమైన సంత కాదనీ,  కార్నివాల్ లాంటిదనీ, అది తెల్లవార్లూ జరుగుతోందనీ, కథానాయిక ఒక్క చుక్క ఉండగా అంటే, సూర్యోదయమవబోయేవరకూ ( తెల్లవారుతుంటే అన్ని చుక్కలూ కనుమరుగైపోతాయి గాని, ఒక్క వేగుచుక్క,  లేదా శుక్ర గ్రహం మాత్రం బాగా కాంతివంతమైనదవడం వల్ల సూరునివెలుతురువచ్చేదాకా సుమారుగా కనిపిస్తుంది.) తిరిగి తిరిగి ఇంటిముఖం పట్టిందని అర్థం చేసుకోవాలి. ఆ తిరగడం ఊరికే కాకుండా, Goods and Gear  కొనుక్కుంది. అంటే పెళ్ళి దృష్టిలో పెట్టుకుని బట్టలు కొనుక్కుందన్నమాట.

అయితే అన్ని విషాద ప్రేమ గాధల్లాగే, ఏమయిందో తెలీదు. ఆమె చనిపోతుంది. అయినా నాయకుడు మరణశయ్యపై ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తుంది.  మరుజన్మలో కలుస్తామని. అది ఎంతో దూరం లేదని చెప్పడానికి. ఒక చిన్న కాన్వాసులో పాఠకుడు తనకు తోచింది ఊహించుకుందికి అవకాశమున్న కథ ఇది.

.

Padraic Colum
Padraic Colum (Photo credit: Wikipedia)

.

Hear the song here

.

My young love said to me,
“My mother won’t mind
And my father won’t slight you
For your lack of kind.”
And she stepped away from me
And this she did say:
“It will not be long, love,
Till our wedding day.”

As she stepped away from me
And she moved through the fair
And fondly I watched her
Move here and move there
And then she turned homeward
With one star awake
Like the swan in the evening
Moves over the lake.

The people were saying,
No two e’er were wed
But one had a sorrow
That never was said
And I smiled as she passed
With her goods and her gear,
And that was the last
That I saw of my dear.

Last night she came to me,
My dead love came in
So softly she came
That her feet made no din
As she laid her hand on me
And this she did say
“It will not be long, love,
Till our wedding day.”
.
Padraic Colum

(8 December 1881 – 11 January 1972)

Irish Poet, playwright, novelist, folklorist

%d bloggers like this: