ఆమెని సరిదిద్దడం వృధాప్రయాస… జార్జి స్మోలెట్, స్కాటిష్ కవి .
ఆమె మనసు మార్చడం … వృధా ప్రయాస
అది వర్షంలో చినుకులు లెక్కెట్టడం లాంటిది
ఆఫ్రికా ఊసరక్షేత్రాల్లో నారుపొయ్యడం లాంటిది
తుఫానుల్ని నిరోధించాలని శ్రమపడడం లాంటిది.
మిత్రమా! నాకు తెలుసు : ఆమె గాలికంటే తేలిక
బోయవాడి వలకంటే కళాత్మకమైన ఉచ్చు;
వీచే గాలికంటే నిలకడలేనిది;హేమంతపు
నీరవ మంచు మైదానాలంత దయమాలినది.
ఆమె చాలా లోభి, ఆఖరికి ప్రేమలో కూడా;
ఆమె కన్నులగెలుపులో తమభవిష్యత్తుకై
వందలమంది వీరులు ఆతృతగా ఎదురుచూస్తున్నా
ప్రేమలోని ఆనందమెవరితోనూ పంచుకోదు,ప్రకటించదు;
అటువంటి లజ్జాకరమైన ఆధిపత్యానికి సిగ్గుపడుతూ
నాకు ఒక్కోసారి ఆమె శృంఖలాల్ని తెంచుకోవాలనిపిస్తుంది
ఇక ఎంతమాత్రమూ మోసపోకూడదని నిశ్చయించుకున్న
నాకు నా వివేకం అండగా నిలుచుగాక
మిత్రమా! ఇది క్షణికమైన మైమరపు,
ఒక్క సమ్మోహనమైన చూపుతో పటాపంచలౌతుంది.
ఒక్క సారి ఆమె చూస్తే చాలు! అంగీకరిస్తాను
ఆ చూపులు నన్ను పూర్తిగా కరుణించినా, శపించినా.
అంత సున్నితంగా, అంత సొగసుగా, అంత అందంగా…
ఉన్న ఆమెలో ఏదో అలౌకికత్వం ఉంది; నిజం.
నేను తలవంచక తప్పదు; కలహించి ప్రయోజనం లేదు
ఈ సంకెలలు దుర్విధే నాకు ఇలాగ తొడిగింది.
.
జార్జి స్మోలెట్
19 March 1721 – 17 September 1771
స్కాటిష్ కవి .
.

. To Fix Her,—’Twere a Task As Vain .
To fix her,—’twere a task as vain
To count the April drops of rain,
To sow in Afric’s barren soil,—
Or tempests hold within a toil.
I know it, friend, she’s light as air,
False as the fowler’s artful snare,
Inconstant as the passing wind,
As winter’s dreary frost unkind.
She’s such a miser too, in love,
Its joys she’ll neither share nor prove;
Though hundreds of gallants await
From her victorious eyes their fate.
Blushing at such inglorious reign,
I sometimes strive to break her chain;
My reason summon to my aid,
Resolved no more to be betray’d.
Ah, friend! ’tis but a short-lived trance,
Dispell’d by one enchanting glance;
She need but look, and I confess
Those looks completely curse, or bless.
So soft, so elegant, so fair,
Sure, something more than human’s there;
I must submit, for strife is vain,
’Twas destiny that forged the chain.
.
Tobias George Smollett
(19 March 1721 – 17 September 1771)
Scottish Poet
http://www.bartleby.com/333/45.html
The Book of Georgian Verse. 1909. Ed. William Stanley Braithwaite
Related articles
- Summer voyages (theguardian.com)