ఆ గులాబిరెమ్మని చూడు! పడమటి గాలి ప్రేమాతిశయంతో చుంబించబోతే తన చెక్కిలి పక్కకి తిప్పుకుంటోంది; కాని ఒక క్షణం గాలి ఆగితే మళ్ళీ అటే తిరిగిచూస్తూ తను చెంతనే ఉండాలని లాలనగా చూస్తోంది.
మరులుకొన్న యువకుడు దరిచేరబోతే బిడియపడుతున్న కన్నియలా లేదూ ఆ గులాబి? బిడియపడుతూనే, తనూలతని విదిలించుకుంటూ తన అనురాగాన్ని తెలియపరుస్తూ ఉంది. ఒకవంక అతని అనునయాన్ని ఆశిస్తూనే మరొకవంక అతను హద్దుమీరకుండా వారిస్తోంది. .
జార్జి డర్లీ (1795–1846) ఐరిష్ కవి, నవలా కారుడు, విమర్శకుడు
. Love’s Likeness .
O Mark yon Rose-tree! When the West Breathes on her with too warm a zest, She turns her cheek away; Yet if one moment he refrain, She turns her cheek to him again, And woos him still to stay!
Is she not like a maiden coy Press’d by some amorous-breathing boy? Tho’ coy, she courts him too, Winding away her slender form, She will not have him woo so warm, And yet will have him woo! . George Darley (1795–1846)
Text Courtesy: The Oxford Book of Victorian Verse. 1922 Compiled by: Arthur Quiller-Couch