అనువాదలహరి

మహావృక్షము… ఏన్ ఫించ్, వించిల్సీ రాణి, ఇంగ్లండు

అద్భుతమైన ఓ వృక్షరాజమా!ఇంత చక్కని నీడనిచ్చే నీకు
ప్రత్యుపకారం చెయ్యడం న్యాయం; నేను ఖచ్చితంగా
ఏదైనా చెయ్యాలి నీకు, నీ చల్లని ఛాయనందుకున్నందుకు.
నువ్వు పక్షులకి ఆశ్రయం కల్పిస్తున్నావంటే
ప్రతిగా చక్కని సంగీతాన్ని తిరిగి వినిపిస్తున్నాయి;
తుఫానులు విసుగెత్తి మరలే వరకూ బాటసారులు
నీ అండన తలదాచుకున్నారంటే ఆ సమయమంతా;
వాళ్ళు స్తుతిస్తూ గడుపుతారు నిన్నూ, నీ రక్షణకవచాన్నీ;
పాపం పశుల కాపరి ఎండకి తాళలేక నీ నీడ చేరినా
నీ ఆకుల కదలికలకి అనుగుణంగా వేణువూదుతుంటాడు;
అప్సరవంటి అతని ప్రేయసి కృతజ్ఞతతో
పూలహారాలు నీకొమ్మల అలంకరిస్తే
నేను కేవలం మౌనంగా ప్రేక్షకురాలిగా చూస్తూ
నీకేమీ చెల్లించుకోకుండా ఊరుకోగలనా?
లేదు! ఈ కోరిక నాలో శాశ్వతంగా ఉండనీ:
నీ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండు గాక!
వయసులో ఉన్నప్పుడు మిసిమినిచ్చిన
నీలోని చేవ పూర్తిగా ఇగిరిపోయేదాకా
కాలపు తొందరపాటుదనానికి చిక్కకుండా
కొన్ని యుగాలు నువ్వు నిలిచి ఉందువు గాక!
నువ్వు సజీవంగా ఉన్నప్పుడు నీ ఔన్నత్యాన్ని
వ్యర్థంగా సవాలుచేసే భీకరమైన గాలులు
ప్రాణావసానకాలంలో నీకు గొడ్డలివేటు తప్పించి
నిన్ను గౌరవపూర్వకంగా అవనతము చేయుగాక!
ఫెళఫెళార్భటులతో చెల్లాచెదరైన వాటి శక్తి
మబ్బులకు నీ మరణవార్త అందించుగాక!
నీ తల గుబురులలో చోటుదొరకని ఆ మబ్బులు
సాంధ్య వేళ నీకు తమ మంచుతుంపరల తర్పణలిచ్చుగాక!
పురాతన కావ్యనాయకుల వలె జ్వలించే నీకు
ఏ చక్కని పొయ్యిగూడో చితాభస్మకలశమౌ గాక!

.

ఏన్ ఫించ్

(April 1661 – 5 August 1720)

వించిల్సీ రాణి, ఇంగ్లండు 

Portrait of Anne Finch, Countess of Winchilsea...
Portrait of Anne Finch, Countess of Winchilsea (1661-1720) (Photo credit: Wikipedia)

.

Tree

.

Fair Tree! for thy delightful shade

’Tis just that some return be made;

Sure some return is due from me

To thy cool shadows, and to thee.

When thou to birds dost shelter give

Thou music dost from them receive;

If travellers beneath thee stay

Till storms have worn themselves away,

That time in praising thee they spend,

And thy protecting power commend;

The shepherd here, from scorching freed.

Tunes to thy dancing leaves his reed,

Whilst his loved nymph in thanks bestows

Her flowery chaplets on thy boughs.

Shall I then only silent be,

And no return be made by me?

No! let this wish upon me wait,

And still to flourish be thy fate,

To future ages mayst thou stand

Untouched by the rash workman’s hand,

Till that large stock of sap is spent,

Which gives thy summer’s ornament;

Till the fierce winds, that vainly strive

To shock thy greatness whilst alive,

Shall on thy lifeless hour attend,

Prevent the axe and grace thy end,

Their scattered strength together call,

And to the clouds proclaim thy fall,

Who then their evening dews may spare,

When thou no longer art their care,

But shalt, like ancient heroes, burn

And some bright hearth be made thy urn.

.

Anne Finch, Countess of Winchilsea

(1661–1720)

England

Read an excellent Critical introduction on the poetess by Edmund Gosse:

http://www.bartleby.com/337/605.html

http://www.bartleby.com/337/607.html

The English Poets.  1880–1918.
Vol. III. The Eighteenth Century: Addison to Blake

Ed. Thomas Humphry Ward.

%d bloggers like this: