అనువాదలహరి

రోడ్డువార నిద్ర … ఆర్థర్ కెచం, అమెరికను

ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో!

వేసవిలూ శరత్తులూ గడిచిపోతుంటాయి,  

ఇప్పుడు గడ్డిమీద పూస్తున్నది మంచో,

డెయిజీలో కూడా వాళ్ళకి తెలీదు.  

 

రోజల్లా “బర్చ్” చెట్టు ఒదిగి చెవి పారేసుకుంది

నది లోలోపల ఏమిటిగొణుగుతోందో విందామని

చుట్టూ ఆవరించిన నిశ్శబ్దంలో  ఓ పిట్ట

ఒంటరిగా సాంధ్యగీతాన్ని ఆలపిస్తోంది. 

 

గాలి తేలికగా వీచనీ, గట్టిగా రోదించనీ

వాళ్ళ కలల అంచుల్లో ఏ చలనమూ ఉండదు.

“శాంతి” గుండెలమీద సేదతీరుతున్నారు

ఆమె లభించినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు.

 

ఏమి తెచ్చేవని వాళ్ళు అడగరు…

దగ్గరికి ఏ పాదాలు వచ్చేయో లేదో అక్కరలేదు

నిర్లక్ష్యంగా పక్కనించి జీవితం నడిచిపోతుంది

అంత ప్రశాంతమైన నిద్ర వాళ్ళది.

.

ఆర్థర్ కెచం

అమెరికను

.

Roadside Rest

American Poet

Poem Courtesy: http://www.bartleby.com/272/50.html

Anthology of Massachusetts Poets.  1922 Ed. William Stanley Braithwaite

%d bloggers like this: