చిరుకవిత… విలియం రాస్కో థేయర్, అమెరికను
చిన్నప్పుడు నేను కవులతో తిరిగేను
ఎందుకంటే వాళ్ళు చిత్రించే ప్రపంచం
నేనెరిగిన ప్రపంచంకన్నా ఎన్నోరెట్లు
అందంగా, ఉదాత్తంగా కనిపిస్తుండేది.
ఇప్పటికీ కవులు నాకు సన్నిహితులే. కాని,
చిన్నప్పటికంటే కూడ వాళ్ళిప్పుడు నాకు ఇష్టం.
ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసును
వాళ్ళొక్కరే సత్యాన్ని ఆవిష్కరిస్తారని.
.
విలియం రాస్కో థేయర్
(January 16, 1859 – 1923)
అమెరికను
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/William_Roscoe_Thayer