మూడు పద్యాలు… లిల్లా కాబో పెర్రీ, అమెరికను కవయిత్రి
1. కప్పు
ఆమె అంది: “కప్పును పైకెత్తు!” అని.
ఆమె చేయి అలసినట్టు ఏ సూచన కనిపించనీ లేదు,
నవ్వుతూనే చెయ్యి పైకి ఎత్తింది
అందులో మధువులేదని ఇతరులు చూడకుండా, ఊహించకుండా.
2. నన్ను క్షమించకు!
నన్ను క్షమించకు! నన్ను ద్వేషించు, నాకు తెలుస్తుంది
నీ గుండెలో ప్రేమాగ్ని అవశేషం ఇంకా జ్వలిస్తోందని!
రాగరహితమైన హృదయాలలోనే క్షమ చోటుచేసుకుంటుంది
అచేతనమైన అగ్నిపర్వతం మీద మంచుపేరుకున్నట్టు.
3. గులాబి
ఒక రక్తవర్ణపు గులాబిని అతని సమాధిలో జారవిడిచేను
అంత అపురూపమైన మిత్రుడికి ఎంత అల్పమైన కానుక!
కానీ అతనికి తెలుసు నే జారవిడిచింది నా హృదయాన్నని
ఇక జీవితాంతమూ అదిలేకుండా బ్రతుకు ఈడవ వలసిందే!
.
లిల్లా కాబో పెర్రీ
January 13, 1848 – February 28, 1933
అమెరికను కవయిత్రి, ఇంప్రెషనిస్టు చిత్రకారిణి
ఇంప్రెషనిస్టు ఉద్యమం19వ శతాబ్దంలో కళా రంగానికిచెందినది. అది క్రమంగా సాహిత్యంలోకి పాకింది. ఈ ఉద్యమపు మూల సూత్రం చిన్నచిన్న కుంచె తో గీసినగీతలైనా, వెలుగునీడలని అవి మనకి ఎలా కనిపిస్తాయో అలాగే చిత్రించడం; కాలగతిలోని మార్పులను రంగులతీవ్రతలోని బేధం ద్వారా గ్రహించేటట్టు ప్రకటించడం.
ఈ మూడుకవితలూ ఒక బలమైన భావనని ఉత్ప్రేక్షలూ ఉపమలు ద్వారా కాకుండా, సామాన్యమైన చేష్టలద్వారా, అపుడు ప్రకటితమయ్యే భావనలద్వారా పాఠకుడు లేదా ప్రేక్షకుడికి అందిస్తాయి. మొదటిదాంట్లో ఒక పార్టీలో, తన అనారోగ్యం పార్టీ జరుగుతున్న కారణాన్ని మరుగుపరచకూడదన్న ఉద్దేశ్యంతో ఆ స్త్రీ ఎంత ఉదాత్తంగా నటించిందో మొదటి కవిత చెబితే, రెండవకవిత ఎత్తుగడే ఆశ్చర్యంగా ప్రారంభమవుతుంది. దాన్ని ఎంత సొగసుగా అర్థాంతరన్యాసంలో కవయిత్రి సమర్థిస్తుందో చూడవచ్చు. మూడవది నిజంగా ఆణిముత్యమే. జాషువాగారి “హృదయము సుమ్మి నిల్పి చనియెన్” అన్న మాటలు గుర్తుకొస్తాయి వెంటనే.
.
Lilla Cabot Perry
Image Courtesy:
http://en.wikipedia.org/wiki/Lilla_Cabot_Perry
.
.
Three Quatrains
THE CUP
She said, “Lift high the cup!”
Of her arm’s weariness she gave no sign,
But, smiling, raised it up
That none might see or guess it held no wine.
FORGIVE ME NOT!
Forgive me not! Hate me and I shall know
Some of Love’s fire still burns within your breast!
Forgiveness finds its home in hearts at rest,
On dead volcanoes only lies the snow.
THE ROSE
One deep red rose I dropped into his grave,
So small a thing to give so great a friend!
Yet well he knew it was my heart I gave
And must fare on without it to the end,
Lilla Cabot Perry
January 13, 1848 – February 28, 1933
American Poet and Impressionist Painter
Poem Courtesy: http://www.gutenberg.org/files/2294/old/mpoet11.txt