
Image Courtesy: http://bobsbaitandtackle.com/tag/cut-mullet/
సుడిలేచి ఎగసిపడు సంద్రమా!
నీ సూదంచు కొమ్మలను నిలువెత్తు ఎగయనీ.
ఎగసిలేచిన నీ దేవదారువుల
నా బండరాళ్ళపై భంగపడనీ;
నీ హరిత వర్ణాన్ని మామీద చిలికించి
నీ పచ్చనాకుల పెనవేయవమ్మా.
.
హిల్డా డూలిటిల్
September 10, 1886 – September 27, 1961
అమెరికను కవయిత్రి
HDగా ప్రఖ్యాతి వహించిన హిల్డా డూలిటిల్, 20 వ శతాబ్దం ప్రథమార్థంలో కవిత్వంలో బాగా వ్యాప్తిలో ఉన్న ఇమేజిజం ఉద్యమమానికి మారుపేరుగా నిలిచిన కవులలో ఒకరు. ఈమె కవిత్వంలో తరచుగా విమర్శకులు ప్రస్తావించే కవిత ఇది. ఇమేజిజంలో ప్రథానాంశం కవి ఏమీ చెప్పకుండా ప్రతీకలచే చెప్పడం. ఉదాహరణకి ఈ కవితలో సముద్రానికి సూదంచు కొమ్మలెక్కడుంటాయి? అవి బాగా ఎగసిపడే కెరటాలకి ప్రతీక. పైన ఇచ్చిన బొమ్మ చూడండి. అది ఎత్తునుండి తీసిన చిత్రం కాబట్టి అంత సరిగ్గా కనిపించకపోవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగాపరిశీలిస్తే నిప్పుకీలల్లా, నీటికీలలూ కనిపిస్తాయి. అందులో ఆకుపచ్చని రంగూ కనిపిస్తుంది. అంతే. అలాగే ఈ కవితలో మాటాడుతున్న వ్యక్తి వనకన్య (నిజానికి Oread వనదేవతకి చెలికత్తె వంటిది). దాన్ని ప్రతీకాత్మకంగా ‘నా బండరాళ్ళపై’ అన్న మాట ద్వారానే తెలుసుకోగలం.
.
.
Oread
.
Whirl up, sea —
Whirl your pointed pines,
Splash your great pines On our rocks;
Hurl your green over us,
Cover us with your pools of fir.
—
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…