అనువాదలహరి

ఎవరికి వర్తిస్తే వారికి… ఏడ్రియన్ మిచెల్, ఇంగ్లీషు కవి

.

Hear the poem in poet’s voice: To Whom It May Concern

.

ఒకరోజు సత్యం నన్ను తొక్కుకుంటూ నా మీంచి వెళ్ళిపోయింది

ఆ ప్రమాదం జరిగిన దగ్గరనుండి ఇలా కుంటుతున్నాను.  

నా కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

అలారం గంట బాధతో మూలగడం వినిపించింది

నాకు నేను కనిపించక మళ్ళీ తిరిగి పడుక్కున్నాను.

నా చెవుల్లో సీసం పొయ్యండి.

కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి.

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు కనిపించేవి మంటలు

నాపరాయి పలకలతో ఫోనుబుక్కు చేసి పేర్లన్నీ చెక్కేను

నా కళ్ళకి వెన్నరాయండి

నా చెవుల్లో సీసం పొయ్యండి.

కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి.

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

ఏదో మండుతున్న వాసనేస్తోంది. బహుశా నా మెదడే అయి ఉంటుంది

అబ్బే, వాళ్ళు పిప్పరమెంట్లూ, డెయిజీ పూలగుత్తులూ వర్షిస్తున్నారు. 

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

నేరం జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు?

స్మారక చిహ్నం పక్క నిల్చుని మట్టిగొట్టుకుంటున్నా.

నా నోరు విస్కీతో మూసెయ్యండి

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

నువ్వు నీ బాంబర్లనివినియోగిస్తావు, అంతరాత్మని చంపుకుంటావు

మనిషిశరీరాన్ని తీసుకుని ఎన్నిరకాలుగానైన మెలిబెట్టగలవు.

నా చర్మాన్ని స్త్రీలతో రుద్దు.

నా నోరు విస్కీతో మూసెయ్యండి

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి 

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

.

ఏడ్రియన్ మిచెల్

24 October 1932 – 20 December 2008

ఇంగ్లీషు కవి.

యుద్ధవ్యతిరేక కవితలు చాలా వచ్చాయి. కానీ ఈ కవితకి అందులో ప్రత్యేకత ఉంది. మొదటిది ఈ కవితా శిల్పం. రెండవది అందులో ఉపయోగించిన ప్రతీకలు.  మొదటి పద్యం నాలుగు లైన్లు ఉంటే, రెండోది అయిదు, మూడవది ఆరు… ఇలా సాగుతుంది కవిత. మొదట పద్యంలో చెప్పినవి రెండవదానిలో, రెండవదానిలో చెప్పినవి మూడవదానిలో చెబుతూ, కవిత చివరికి వచ్చేసరికి ఉవ్వెత్తుగా ఎగిసి ఒక ఆవేశాన్ని రగిలించ గలుగుతుంది. యుద్ధానికి వ్యతిరేకంగానే కాదు, యుద్ధోన్మాది చేస్తున్న దురాగతాలకి కూడా వల్లమాలిన కోపం వస్తుంది.

ప్రతీకల విషయంలోకి వస్తే, “నాపరాయిపలకలతో చేసిన ఫోనుబుక్కూ అందులో చెక్కిన పేర్లూ” సమాధుల పరంపరలకి సంకేతాలు. ఆ ప్రతీక వాడడంలో భావతీవ్రతతో పాటు, బాధ తీవ్రతకూడా మనకి అందుతుంది. అలాగే, “వాళ్ళు పిప్పరమెంట్లూ, డెయిజీ పూలగుత్తులే వర్షిస్తున్నారు” అన్న మాటలో ఎంత వ్యంగ్యం ఉందో చూడొచ్చు. వాళ్ళు కురిపిస్తున్న బాంబులనీ, శ్రద్ధాంజలి ఘటించడానికి ఉపయోగించే డెయిజీ పూలనీ ఏకకాలంలో ఉపయోగించడం భావసాంద్రతని చెప్పకనే చెబుతున్నాయి. “నువ్వు అంతరాత్మని చంపుకోగలవు, మనిషి శరీరాన్ని ఎన్ని రకాలుగానైనా మెలిబెట్టగలవు” అనడంలో శత్రువుచేసే శారీరక మానసిక హింసలని రెండూ చెబుతున్నాడు కవి. ఒకపక్క నీతులు వల్లిస్తూనే, హిపోక్రిటికల్ గా ప్రవర్తించడానికి శత్రువుకి సిగ్గు లేదు. (ఈ శత్రువు తమ ప్రభుత్వమే అయి ఉండొచ్చు… ఒక్కోసారి). మానవతకి కట్టుబడిన వ్యక్తికి, తప్పు ఎవరుచేసినా తప్పుగానే కనిపిస్తుంది.

మంచి భావమూ, ఆవేశమూ, కవితాప్రయోగాలూ ఉన్న చక్కని కవిత ఇది. చదివిన తర్వాత మనల్ని తప్పకుండా అలజడికి గురిచేస్తుంది.

.

Adrian Mitchell
Adrian Mitchell
Image Courtesy:
http://en.wikipedia.org/wiki/Adrian_Mitchell

.

To Whom It May Concern

.

I was run over by the truth one day.

Ever since the accident I’ve walked this way

So stick my legs in plaster

Tell me lies about Vietnam.

Heard the alarm clock screaming with pain,

Couldn’t find myself so I went back to sleep again

So fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

Every time I shut my eyes all I see is flames.

Made a marble phone book and I carved out all the names

So coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

I smell something burning, hope it’s just my brains.

They’re only dropping peppermints and daisy-chains

So stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

Where were you at the time of the crime?

Down by the Cenotaph drinking slime

So chain my tongue with whisky

Stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

You put your bombers in, you put your conscience out,

You take the human being and you twist it all about

So scrub my skin with women

Chain my tongue with whisky

Stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

.

Adrian Mitchell

(24 October 1932 – 20 December 2008)

English poet, novelist and playwright.

Adrian Mitchell was born in 1932 and educated at Oxford. After coming down in 1955 he worked for some years on the staff of the Oxford Mail, and subsequently with the London Evening Standard. Mitchell’s early poetry showed a fondness for tight stanzas and a use of myth, but there was always a kind of agonised human concern about his writing which marked him off sharply from his more tight-lipped contemporaries. This concern has developed over the years into a full-fledged political commitment, and there is no other poet in England who has more steadily focussed his aesthetic aims through his social ones. It would not be too much to say that a poem such as ‘To Whom It May Concern’ altered the conscience of English poetry, and for many younger writers Mitchell is already the elder statesman of literary protest. He has made enemies through this, and there are still critics who refuse to accept his importance. But there are few poets now writing who can command a wider general audience, and none who can swing such an audience more effectively from public laughter to near tears.

poem and bio  courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/03/to-whom-it-may-concern-adrian-mitchell.html

%d bloggers like this: