అనువాదలహరి

బంగారం అయిన ప్రతీదీ మెరవదు… JRR టొల్కియన్, ఇంగ్లిష్ కవి

.

బంగారం అయిన ప్రతీదీ మెరవదు.

దేశాలు తిరుగుతున్నవాళ్లంతా దారితప్పినవాళ్లు కారు

చేవ ఉన్నది పాతదయినా శిధిలమైపోదు.

అంతరాంతరాల్లోని వేళ్లని గడ్డమంచు చేరుకోలేదు

నివురులోంచే నిప్పు రాజుకుంటుంది

నీడల్లోంచే వెలుగు ఒక్కసారి తలెత్తుతుంది;

విరిగిపోయిన కత్తే, మళ్ళీ అతుక్కుంటుంది,

కిరీటం లేనివాడే ఒక రోజు రాజవుతాడు. 

.

JRR టొల్కియన్

3 January 1892 – 2 September 1973

ఇంగ్లీషు రచయిత 

.

 

Lord of the Rings  పుస్తకం

THE FELLOWSHIP OF THE RING, BOOK I, CHAPTER X 

నుండి

.

..
 

All that is gold does not glitter,
Not all those who wander are lost;
The old that is strong does not wither,
Deep roots are not reached by the frost.
From the ashes a fire shall be woken,
A light from the shadows shall spring;
Renewed shall be blade that was broken,
 The crownless again shall be king.

.

From The Lord of the Rings By J.R.R. Tolkien

THE FELLOWSHIP OF THE RING, BOOK I, CHAPTER X

%d bloggers like this: